Pregnant Woman: కడుపుతో ఉన్న మహిళలు.. ఇతరుల్లా అన్ని పనులు తమకు తాముగా చేసుకోలేరు. సరిగా కూర్చోవడం, నిలపడటమే కష్టంగా ఉంటుంది. కానీ, ఓ మహిళ 9 నెలల కడుపుతో తలకిందులుగా యోగా చేసి రికార్డు క్రియేట్ చేసింది.
కడుపుతో ఉన్న స్త్రీలకు నార్మల్ డెలీవరీ అవ్వాలని చిన్నపాటి యోగాసనాలు వేయమని డాక్టర్లు స్వయంగా చెబుతూ ఉంటారు. గర్భిణీలు యోగా చేయడం చాలా కామన్ విషయం. కానీ, బెంగళూరుకు చెందిన ఓ యోగా టీచర్ 9 నెలల కడుపుతో చేసిన యోగాసనాలు అందరినీ షాకింగ్ కి గురి చేశాయి.
24
యోగా టీచర్...
బెంగళూరు యోగా టీచర్ శశిప్రభ ద్వివేది తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో షేర్ చేశారు. ఆ వీడియోలో ఆమె చీర కట్టుకొని ఉన్నారు. అందులోనూ 9 నెలల గర్భవతి. ఈ సమయంలో కూడా... ఆమె అద్భుతమైన యోగాసనాలు వేసింది. నార్మల్ గా ఉన్నవారు కూడా వేయడానికి కష్టంగా ఉండే యోగాసనాలు ఆమె వేయడం విశేషం. చక్రాసనంతో పాటు.. తల కిందులుగా పెట్టి.. కాళ్లు పైకి పెట్టి కూడా ఆమె యోగాసనాలు చేయడం విశేషం. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు 20 మిలియన్లు.. అంటే 2 కోట్లకు పైగా ఆ వీడియోని వీక్షించారు. ఆమె ఫిట్‌నెస్, ఆమె బాడీ ఫ్లెక్సిబిలిటీ చూసి నెటిజన్లు షాక్ అవుతుంది. ఎంత యోగా టీచర్ అయినప్పటికీ.. డెలివరీకి కొద్ది రోజుల ముందు ఇలాంటి యోగాసనాలు వేయడం చాలా ప్రమాదకరం అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
34
యోగా టీచర్ ఏమన్నారంటే....
‘గర్భిణీగా ఉంటూ నేను చేసే యోగాసనాలు మాత్రమే జనాలు చూస్తున్నారు. కానీ, దీని వెనక నాకు ఎన్నో సంవత్సరాల కఠోర శ్రమ దాగి ఉంది. ఎన్నో సంవత్సరాల కఠిన శిక్షణ తర్వాత మాత్రమే తాను ఈ యోగాసనాలు చేయగలుగుతున్నాను. నేను ప్రస్తుతం 9 నెలల గర్భవతిని ఇది నిజం. కానీ.. అందరూ ఈ ఆసనాలు వేయలేరు. ప్రతి మహిళ శరీరం ఒకేలా ఉండదు. ఇలాంటి ఆసనవాలు వేసే ముందు వైద్యుల సలహా కచ్చితంగా తీసుకోవాలి’ అని శశి ప్రభ చెప్పారు.
కాగా.. శశి ప్రభ పోస్టు చేసిన యోగా వీడియోలకు నెటిజన్ల రియాక్షన్ ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. చాలా మంది ఆమె వీడియోలకు సూపర్ గా మద్దతు తెలుపుతున్నారు. కొందరు.. గర్భం దాల్చినప్పుడు ఇలాంటివి చేయడం బిడ్డ ఆరోగ్యానికే ప్రమాదకరం అంటూ కామెంట్స్ చేస్తుండగా.. మరి కొందరు మాత్రం.. ఇది కేవలం పబ్లిక్ స్టంట్ అంటూ కామెంట్ చేయడం విశేషం. అయితే.. ఇలాంటి యోగాసనాలు వేయద్దని... తనను తన తల్లి కూడా తిట్టిందని.. కానీ.. తాను మాత్రం ఈ యోగా సాధన చేయడం మాత్రం ఆపలేదు అని శశి ప్రభ చెప్పారు.