Health Tips: కిడ్నీల్లో రాళ్లున్న వారికి ఈ పండ్లు అస్సలు మంచివి కావు..

Published : Mar 19, 2022, 11:50 AM IST

Kidney Stone Hacks: కిడ్నీలో రాళ్లున్న వారు కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండటమే బెటర్. ముఖ్యంగా కొన్ని రకాల పండ్లను తింటే కూడా ఈ సమస్య మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. 

PREV
19
Health Tips: కిడ్నీల్లో రాళ్లున్న వారికి ఈ పండ్లు అస్సలు మంచివి కావు..

Kidney Stone Hacks:మారుతున్న జీవన శైలీ, చెడు ఆహారపు అలవాట్లు, పోషకాహార లేమి వంటి కారణాల వల్ల చాల మందికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడుతుంటాయి. దీని వల్ల ఉదర సంబంధమైన అనేక సమస్యలు కూడా వస్తుంటాయి. కిడ్నీల్లో రాళ్ల వల్ల కలిగే నొప్పి దారుణమైంది. ఈ సమస్య నుంచి ఎంత తొందరగా బయటపడితే ఆరోగ్యానికి అంత మంచిది. 

29

ఈ సమస్యను నిర్లక్ష్యం చేసే కొద్ది లివర్ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇంతేకాదు పెద్ద పేగు క్యాన్సన్ బారిన కూడా పడతారని నిపుణులు తేల్చి చెబుతున్నారు. 

39

కిడ్నీల్లో రాళ్ల సైజును బట్టి వైద్యం చేస్తారు. రాళ్ల సైజు చిన్నగా ఉంటే మెడిసిన్స్, కొన్ని రకాల ఆహార పదార్థాలో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. మరీ ముఖ్యంగా కిడ్నీల్లో రాళ్లున్న వారు తీసుకునే ఆహారంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదముంది. 

49

అయితే కిడ్నీలో రాళ్లున్న వారు కొన్ని రకాల పండ్లకు దూరంగా ఉండాలి. కొన్ని రకాల పండ్లను రెగ్యులర్ గా తినాల్సి ఉంటుంది. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి. 

59

ఏ పండ్లను తినకూడదు:  మూత్రపిండాల సమస్యలు, కిడ్నీల్లో రాళ్లున్న వాళ్లు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ కు దూరంగా ఉండాలి. అలాగే బత్తాయి, దానిమ్మ వంటి పండ్లను తినకూడదు. ఇవి కిడ్నీలపై చెడు ప్రభావం చూపిస్తాయి. అంతేకాదు ఇవి వారిలో అంత తొందరగా జీర్ణం కావు కూడా. ఇకపోతే వీరు ప్యాక్ చేసిన ఫుడ్ ను కూడా తినకూడదు. ముఖ్యంగా ఫ్రైడ్ ఆహార పదార్థాలతో ఈ సమస్య పెరుగుతుంది కాబట్టి వీటిని తినకపోవడమే బెటర్. 
 

69

ఇవి తినాలి.. కిడ్నీలో రాళ్ల సమస్య నుంచి ఉపశమనం పొందాలంటే .. వీరు డీహైడ్రేషన్ బారిన పడకూడదు. ఇందుకోసం నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. అలాగే నీటి శాతం ఎక్కువ ఉండే ఫ్రూట్స్ ను తింటూ ఉండాలి. 

79

పుచ్చకాయ, కొబ్బరి బోండం, సీతాఫలం వంటి పండ్లను ఎక్కువ మొత్తంలో తింటూ ఉండాలి. అయితే వాటర్ మిలన్ పండులోని గింజలను మాత్రం ఎట్టి పరిస్థితిలో తినకూడదు. 

89

సిట్రస్ ఫ్రూట్స్ లో కిడ్నీలోని రాళ్లను కరిగించే గుణముంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ సిట్రస్ ఫ్రూట్స్ లో ఉండే సిట్రిక్ యాసిడ్స్ కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా చూస్తాయి. కాబట్టి నారింజ, ద్రాక్ష, జామ పండ్లను ఎక్కువగా తింటూ ఉండాలి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి  కూడా. 

99

కాల్షియం కూడా కిడ్నీలో రాళ్ల సమస్యను తగ్గిస్తుంది. నల్ల ద్రాక్ష పండ్లు, అత్తిపండ్లు, కివీ పండ్లలో కాల్షియం ఎక్కువ మొత్తంలో ఉంటుంది. కాబట్టి వీటిని ఎక్కువ మొత్తంలో తినాలని నిపుణులు సూచిస్తున్నారు.  

click me!

Recommended Stories