Parenting: పేరెంట్స్ చేసే ప్రతి పని, మాట్లాడే ప్రతి మాట పిల్లల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా చిన్న వయసులో పిల్లలు విన్న మాటలు వారి ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానంపై చెరగని ముద్ర వేస్తాయి. మరి పేరెంట్స్ పిల్లలతో చెప్పకూడని 5 మాటలేంటో చూద్దాం.
పిల్లల వ్యక్తిత్వ వికాసంలో తల్లిదండ్రుల పాత్ర కీలకమైంది. వారు చెప్పే ప్రతి మాట పిల్లల మనసుపై లోతైన ప్రభావం చూపుతుంది. చిన్న వయసులో వినే మాటలే వారి ఆత్మవిశ్వాసం, ఆలోచనా విధానం, భావోద్వేగాలు, భవిష్యత్తు వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేస్తాయి. కోపంలో లేదా నిరాశలో కొంతమంది తల్లిదండ్రులు పిల్లలను మార్చాలనే ఉద్దేశంతో కఠినమైన మాటలు మాట్లాడుతుంటారు. అయితే అలాంటి మాటలు పిల్లలను మార్చడం కంటే వారి మనసును ఎక్కువగా గాయపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా 5 మాటలను పిల్లలతో అస్సలు చెప్పకూడదు. అవేంటో చూద్దాం.
26
నువ్వు ఎందుకూ పనికిరావు
ఒక పని సరిగ్గా చేయలేకపోయినా లేదా పరీక్షలో తక్కువ మార్కులు వచ్చినా, ఆ తప్పును సరిదిద్దే బదులుగా పిల్లల వ్యక్తిత్వాన్నే తక్కువ చేసి మాట్లాడితే వారు తమ సామర్థ్యంపై నమ్మకం కోల్పోతారు. కొంతకాలానికి నేను ఏ పని చేసినా సరిగా చేయలేను అనే భావన వారిలో బలపడుతుంది. దీనివల్ల కొత్త విషయాలు నేర్చుకోవాలనే ఆసక్తి తగ్గిపోవడంతో పాటు ప్రతి పనికి భయపడే అవకాశం పెరుగుతుంది.
36
అసలు నువ్వు ఎందుకు పుట్టావో
ఇలాంటి మాటలు పిల్లల మనసును తీవ్రంగా గాయపరుస్తాయి. తల్లిదండ్రుల ప్రేమే తమకు అండ అని భావించే పిల్లలు ఇలాంటి మాటలు విన్నప్పుడు తాము కుటుంబానికి భారం అని భావించే ప్రమాదం ఉంటుంది. ఇది ఒంటరితనం, నిరాశ, ఆత్మన్యూనత వంటి సమస్యలకు దారితీయవచ్చు. కోపంలో అన్న మాట అయినా, పిల్లలు దాన్ని చాలా కాలం గుర్తుంచుకుంటారు.
పిల్లల్ని తరచూ ఇతరులతో పోల్చడం కూడా మంచిది కాదు. ప్రతి పిల్లవాడికి తనదైన ప్రతిభ, ఆసక్తి ఉంటాయి. ఒకరిని మరొకరితో పోల్చడం వల్ల ప్రోత్సాహం కంటే నిరాశ ఎక్కువగా పెరుగుతుంది. నేను ఎం చేసినా మా అమ్మానాన్నలకు నచ్చను అనే భావన పిల్లల్లో ఏర్పడుతుంది. కొందరిలో అసూయ కూడా పెరిగే అవకాశం ఉంటుంది.
56
నువ్వు ఎప్పుడూ ఫెయిల్ అవుతూనే ఉంటావ్
ప్రతి విజయం వెనుక కొన్ని అపజయాలు ఉండటం సహజం. కానీ ప్రతి చిన్న తప్పును శాశ్వత వైఫల్యంగా చూపించడం వల్ల పిల్లలు కొత్త పనులు చేయడానికి వెనుకాడవచ్చు. ఒక పరీక్షలో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితంలో ఫెయిల్ అయినట్లు కాదు. కాబట్టి పిల్లలు ఏ విషయంలో అయినా ఫెయిల్ అయితే, మరోసారి బాగా ప్రయత్నించమని ప్రోత్సహించాలి.
66
నిన్ను ఎవరూ మార్చలేరు
చిన్న వయసులో పిల్లలు నిరంతరం నేర్చుకుంటూ, మారుతూ ఉంటారు. అలాంటి సమయంలో వారిని ఒకే విధంగా ముద్ర వేయడం సరైంది కాదు. ఈ మాట వల్ల నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను అనే భావన కలిగి, తమలోని లోపాలను సరిదిద్దుకోవాలనే ఆసక్తి తగ్గిపోవచ్చు. ప్రతి పిల్లవాడు సరైన మార్గదర్శకత్వం, సహనం, ప్రోత్సాహం లభిస్తే మంచి మార్పు సాధించగలడు. పిల్లలతో మాట్లాడేటప్పుడు తల్లిదండ్రులు కఠినమైన విమర్శల కంటే పాజిటివ్ గా మాట్లాడటం మంచిది.