Back Pain:ఈ పొరపాట్ల వల్లే వెన్ను నొప్పి వస్తుంది..

Published : Mar 13, 2022, 10:41 AM IST

Back Pain: ఒకే పొజీషన్ లో ఎక్కువ సేపు కూర్చోవడం,  గంటల తరబడి డెస్క్ మీద పనిచేయడం,  సరిగా లేని భంగిమలు వంటి అనేక కారణాల వల్ల వెన్ను నొప్పి వస్తుంటుంది.   

PREV
19
Back Pain:ఈ పొరపాట్ల వల్లే వెన్ను నొప్పి వస్తుంది..

Back Pain: ప్రస్తుత కాలంలో వెన్ను నొప్పి సమస్య సర్వసాధారణంగా మారింది. మారుతున్న జీవన శైలి కారణంగానే చిన్న వయస్సు వారు కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. వెన్ను నొప్పి ఉన్నవారు సాధారణ జీవితం గడపడం కష్టంగా మారింది. ముఖ్యంగా వంగి పనిచేయడం, పనులను చేసుకోవడం వంటి సాధారణ పనులను కూడా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఈ నొప్పి ఎక్కువైతే మాత్రం మంచానికే పరిమితం కావాల్సి ఉంటుంది. 

29

వెన్ను నొప్పి వల్ల సరిగ్గా నడవలేరు కూడా. అయితే ఈ సమస్య నుంచి ఉపశమనం పొందడానికి చాలా మంది వైద్యులను సంప్రదిస్తూ ఉంటారు. ఇంతకీ ఈ నొప్పి ఎందుకు వస్తుందో తెలుసుకుంటే ఈ సమస్య రాకుండా జాగ్రత్త పడొచ్చు కదా.. 
 

39
मरकटासन

వెన్ను నొప్పి రావడానికి మనం చేసే మిస్టేక్స్: వెన్ను నొప్పి రావడానికి ముఖ్య కారణం మారిన మన చెడు జీవిన శైలీ అనే అంటున్నారు వైద్యులు. ఎక్కువ సేపు ఒకే చోట కూర్చోవడం, సరైన పొజీషన్ లో పడుకోకపోవడం, రాంగ్ పొజీషన్ లో కూర్చోవడం వంటివి ఈ సమస్యకు దారి తీస్తాయి. 

49

అలాగే చాలా మంది ఆడవారికి ఆపరేషన్ ద్వారా డెలివరీ అవుతూ ఉంటుంది. దీనివల్ల కూడా వెన్ను నొప్పి సమస్య వస్తుంది. చాలా మంది ఆఫీసుల్లో పనిచేసే వారు గంటలకు గంంటలు కంప్యూటర్ల ముందు ఒకే పొజీషన్ లో కూర్చొని ఉంటారు. దీనివల్ల వెన్ను పాము దెబ్బతినడం మొదలవుతుంది. దీంతో మీకు బ్యాక్ పెయిన్ స్టార్ట్ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

59

కూర్చునే పద్దతి సరిగ్గా లేకపోయినా బ్యాక్ పెయిన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొబైల్ ఫోన్ చూస్తున్నప్పుడు, టీవీ చూస్తున్నప్పుడు, ల్యాప్ టాప్ ఆపరేట్ చేస్తున్న సమయంలో శరీరం సరైన పొజీషన్ లో లేకపోయినా ఈ సమస్య వస్తుంది.
 

69

బరువు ఎత్తడం అంటే బకెట్లు, సంచులను ఎత్తేటప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వచ్చే ప్రామాదముంది. కాబట్టి బరువులు ఎత్తేటప్పుడు జాగ్రత్త వహించాలి. 

79

ఫిట్ గా ఉండేందుకు చాలా మంది ఉదయం, సాయంత్రాలలో వ్యాయామాలను చేస్తుంటారు. అయితే ఈ వ్యాయామాలను తప్పుగా చేస్తే కూడా వెన్ను నొప్పి వస్తుంది. 

89

యోగా చేసే సమయంలో లేదా Stretching చేస్తుంటే కూడా ఈ వెన్ను నొప్పి సమస్య వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 

99

వెన్ను నొప్పి ఉన్న వాళ్లు మెత్తటి పరుపుపై పడుకోవడం వల్ల ఈ సమస్య మరింత పెరిగే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనివల్ల కూడా వెన్ను నొప్పి వస్తుందట.  

click me!

Recommended Stories