మొటిమలకు అద్భుతమైన చిట్కాలు.. ఒక్క రాత్రిలో అద్భుతం...

First Published Aug 5, 2021, 1:18 PM IST

అయితే మొటిమలకు అనేక కారణాలుంటాయి. జన్యుపరంగా వచ్చేవి కొన్ని అయితే... కాలుష్యం, ఒత్తిడి, జీర్ణ సంబంధింత సమస్యల వల్ల వచ్చేవి మరో రకం. వీటినుంచి విముక్తి కోసం అనేకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. ఎన్నో హోం రెమెడీస్ ట్రై చేస్తుంటారు.

చందమామ లాంటి మొహం మీది దిష్టిచుక్కలా ఉంటుంది మొటిమలు. ముఖం మీది మొటిమలు ఇబ్బందిగా ఉంటాయి. నొప్పిని కలిగిస్తాయి. దీనికితోడు అత్మన్యూనతను కలిగిస్తుంది. దీంతో డిప్రెషన్ గురవడం మామూలే. అంతేకాదు నలుగురిలో ఇబ్బందిగా ఉంటుంది. ప్రతీ ఒక్కరూ ఏంటి అని అడగడం.. అది మానసికంగా కృంగదీస్తుంది.
undefined

టీ ట్రీ ఆయిల్ : ఒక చుక్క టీ ట్రీ ఆయిల్ ఐదు చుక్కల కొబ్బరినూనెలో కలపాలి. ఈ మిశ్రమాన్ని మొటిమల మీద రుద్దుకోవాలి. రాత్రిపూట పెట్టుకుని పొద్దున్నే చల్లటి నీటితో కడుక్కోవాలి. దీనివల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి.
undefined
తేనె కూడా మొటిమలకు అద్భుతమైన ఔషధంగా పనిచేస్తుంది. ఓ చుక్క తేనెను మొటిమల మీద రుద్దుకోవాలి. రాత్రంతా అలా వదిలేసి.. ఉదయాన్నే మొహాన్ని చల్లటి నీటితో కడుక్కోవాలి. దీనివల్ల మొటిమల నుంచి ఉపశమనం లభిస్తుంది.
undefined
అలోవెరాలో ఎన్నో సుగుణాలు ఉన్నాయి. అవి మొటిమల నివారణలో బాగా ఉపయోగపడతాయి. తాజాగా తీసిన అలోవెరా జెల్ ను రాత్రి మొటిమలు ఉన్న ప్రాంతంలో రుద్దుకుని.. ఉదయాన్నే చల్లటి నీటితో కడుక్కుంటే మంచి ఫలితం ఉంటుంది.
undefined
గ్రీన్ టీ తో కూడా మొటిమలు బాగా తగ్గుతాయి. అంటే గ్రీన్ టీ తాగడం వల్ల కాదు. ఓ కప్పు మీ కిష్టమైన గ్రీన్ టీని తీసుకుని.. దాంతో టీ చేసి.. చల్లారక మొహం కడుక్కోవాలి. ఇది రాత్రి పడుకునేముందు చేయాలి. కడుక్కున్న తరువాత మొహాన్ని శుభ్రమైన క్లాత్ తో తుడిచుకుని పడుకోవాలి.
undefined
ఐస్ తో మొహం మీది మొటిమల మీద రుద్దడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది. అయితే మొటిమల మీద మెల్లగా రుద్దాలి.... గట్టిగా రుద్దకూడదు. రాత్రి పడుకునే ముందు ఇలా చేయాలి. తెల్లారికి మొటిమల్లో వచ్చే అద్భుతమైన మార్పును మీరే గమనించవచ్చు.
undefined
నీళ్లలో కొంచెం నిమ్మచుక్కలు పిండాలి. ఈ నీటిలో దూదిని ముంచి మొటిమల మీద రుద్దాలి. పదినిముషాల సేపు ఆగి కడిగేసుకోవాలి. ఇది కూడా రాత్రిపూట పడుకునేముందు చేయాలి.
undefined
సంత్రా పొట్టుతో మొటిమలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. సంత్రా పొట్టును ఎండబెట్టి పొడిచేయాలి. ఈ పొడిలో కొంచెం నీళ్లు కలిపి పేస్టులా చేసి మొహానికి ప్యాక్ లా వేసుకోవాలి. లేదా మొటిమల మీద పెట్టుకోవాలి. రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే కడిగేసుకోవాలి.
undefined
ఫుల్లర్స్ ఎర్త్ లేదా ముల్తానీ మట్టిని నీటితో కలిపి పేస్టులా చేయాలి. దీన్ని మొహం మీది మొటిమలు ఉన్న ప్రాంతంలో అప్లై చేయాలి. రాత్రంతా వదిలేసి ఉదయాన్నే కడిగేయాలి.
undefined
click me!