ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినా సరే.. ఈ విషయాలను మాత్రం చెప్పి తప్పు చేయకండి

First Published Mar 15, 2024, 11:50 AM IST

ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరికీ ఉంటారు. ఇక అందులో బెస్ట్ ఫ్రెండ్ మాత్రం పక్కాగా ఉంటాడు. బెస్ట్ ఫ్రెండ్ అంటేనే అన్ని విధాలుగా నమ్మొచ్చంటారు చాలా మంది. అందుకే దాచుకోకుండా అన్ని విషయాలను చెప్పేస్తుంటారు. కానీ బెస్ట్ ఫ్రెండ్ కు కూడా చెప్పుకోకూడని విషయాలు చాలానే ఉన్నాయి. అవేంటంటే?
 

మనలో ప్రతి ఒక్కరికీ ఎంతో మంది స్నేహితులు ఉంటారు. స్కూల్, ఇంటర్, డిగ్రీ, పీజీ అంటూ ఎక్కడెక్కడో ఎంతో మంది ఫ్రెండ్స్ అవుతుంటారు. ఇది చాలా కామన్. మనకున్న ఫ్రెండ్ లీస్ట్ లో ఒకరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఉంటారు. వీళ్లతోనే ఎక్కువ క్లోజ్ గా ఉంటారు. ప్రతీదీ చెప్పకుంటారు. స్నేహం ఎంత ప్రత్యేకమైనా.. కొన్ని విషయాలను మాత్రం చెప్పకూదంటారు పెద్దలు. అవును బెస్ట్ ఫ్రెండ్ కు కూడా చెప్పకూడని విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటంటే? 

ఆదాయ వనరు

అవును మీరెంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా.. మీ ఆదాయ వనరు గురించి ఎవరికీ చెప్పకూడదు. ఆఖరికి బెస్ట్ ఫ్రెండ్ కు కూడా చెప్పకూడదు. మీరు ఏం చేస్తున్నారు? ఎలా సంపాదిస్తారు వంటి డబ్బుకు సంబంధించిన విషయాలను మాత్రం ఫ్రెండ్స్ తో చెప్పకూడదు. 
 

ఆస్తుల గురించి

మీకున్న ఆస్తి గురించి మీ చుట్టాలకే కాదు మీ క్లోజ్ ఫ్రెండ్ కు కూడా చెప్పకూడదు. చాలా మంది క్లోజ్ ఫ్రెండ్ కదా అని అన్ని విషయాలను చెప్పేస్తుంటాం. కానీ స్నేహం చెడిపోయిన తర్వాత అతను మీ విషయాలను ఎవరికైనా చెప్పే అవకాశం ఉంది. అందుకే మీ ఆస్తుల గురించి ఎవ్వరితోనూ చెప్పకండి. 

వ్యక్తిగత ఫోటోలు

మీ ఫ్రెండ్ మీకు ఎంత క్లోజ్ గా ఉన్నా, మీరెంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా.. అతనికి మాత్రం మీ పర్సనల్ ఫోటోలను పంపకండి. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జీవితం ఉంటుంది. దీనిని వీలైనంత సీక్రేట్ గా ఉంచాలి. ఫోటోలు కూడా ఎన్నో దారుణాలకు ఒడిగడతాయి. అందుకే పర్సనల్ ఫోటోలను మాత్రం ఎవ్వరికీ షేర్ చేయకండి. 


భాగస్వామి గతం గురించి

బెస్ట్ ఫ్రెండ్ అని చాలా మంది పర్సనల్ విషయాలను కూడా షేర్ చేసుకుంటుంటారు. ఎందుకంటే వారు ఎవ్వరికీ చెప్పరనే నమ్మకం. కానీ అలా అనుకోవడానికి లేదు. మీరు మీ భాగస్వామి గతం గురించి మీ ఫ్రెండ్ తో అస్సలు మాట్లాడకండి. ఈ విషయం మీ భాగస్వామికి తెలిస్తే మీ సంబంధం దెబ్బతినొచ్చు. అందుకే వ్యక్తిగత జీవితం గురించి ఫ్రెండ్స్ కు అన్ని విషయాలను చెప్పకూడదంటారు. 

click me!