Low Blood Pressure: బీపీ తగ్గుతోందా..?ఇలా చేస్తే మీరు సేఫ్.. !

Published : Apr 08, 2022, 11:40 AM IST

Low Blood Pressure: బీపీ తగ్గినప్పుడల్లా.. టీ, కాఫీ లేదా లెమన్ వాటర్ తాగడం వల్ల తక్కువ రక్తపోటు సమస్య నుంచి బయటపడగలుగుతారు.    

PREV
18
Low Blood Pressure: బీపీ తగ్గుతోందా..?ఇలా చేస్తే మీరు సేఫ్.. !

Low Blood Pressure: బీపీ ఎక్కువగా ఉండటం వల్ల ఎలా అయితే సమస్యలు వస్తాయో.. బీపీ తక్కువగా ఉంటే కూడా అనేక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

28

బీపీ తగ్గినప్పుడల్లా కళ్లు బైర్లు కమ్మడం, అపస్మారక స్థితిలోకి వెళ్లిపోవడం, అలసట, వాంతులు, వికారం, తల తిరగడం, అధికంగా చెమటలు పట్టడం, పాదాలు చల్లగా మారడం, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడటం, మూర్చ, కళ్లకింద నల్లటి వలయాలు ఏర్పడటం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. 

38

బీపీ తగ్గడానికి ప్రధాన కారణం మన మెదడుకు రక్త సరఫరా సరిగ్గా జరక్కపోవడం.ఈ సమస్యలనే హైపోటెన్షన్ అంటారు. ఈ సమస్య  తలెత్తినప్పుడు కొన్ని ఇంటి చిట్కాలతో బయటపడొచ్చు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.. 

48

టీ, కాఫీ.. లో బీపీతో బాధపడేవారు.. ప్రతిరోజూ ఒకటి రెండు కప్పులు టీ లేదా కాఫీ తాగాలి. వీటిలో ఉండే కెఫిన్ రక్తపోటును పెంచేందుకు ఎంతో సహాయపడుతుంది. ఒకవేళ మీరు లోబీపీ కళ్లు తిరిగినట్టు లేదా ఇతర లక్షణాలు కనిపిస్తే వెంటనే టీ లేదా కాఫీని తాగండి.. వెంటనే ఉపశమనం లభిస్తుంది.
 

58

లెమన్ వాటర్.. నిమ్మరసం మన ఆరోగ్యానికి ఎన్నో విధాల ఉపయోగపడుతుంది. అంతేకాదు లెమన్ వాటర్ తో తక్కువ రక్తపోటు సమస్య కూడా తగ్గిపోతుంది. డీహైడ్రేషన్ కారణంగా కూడా ఒక్కోసారి బీపీ తగ్గుతుంది. కాబట్టి ఇలాంటి వారు నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. కాగా ఈ నీళ్లకు కాస్త నిమ్మరసం కలిపి తాగితే మీ ఆరోగ్యానికి ఏ ఢోకా ఉండదు. 

68

మజ్జిగ.. వేసవిలో మజ్జిగ మనకు దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఏదీ తీసుకున్నా తీసుకోకపోయినా.. ప్రతిరోజూ కాస్త మజ్జిగను తాగాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అయితే ఈ  మజ్జిగ లో బీపీ సమస్యకు కూడా చెక్ పెట్టగలదు. బీపీ తక్కువగా అయినప్పుడల్లా గ్లాస్ మజ్జిగలో కొంచెం ఉప్పు, జీలకర్ర పౌడర్ ను వేసి బాగా కలపి తాగండి. నిత్యం ఇలా చేస్తే మీరు హైడ్రేటెడ్ గా ఉండటంతో పాటుగా లోబీపీ సమస్య కూడా తగ్గిపోతుంది. 
 

78

తులసి ఆకులు.. తులసి ఆకులు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. లోబీపీ నుంచి బయటపడాలంటే..కొన్ని తులసి ఆకులను నమలండి. వెంటనే ఈ సమస్య నుంచి బయటపడతారు. తులసి ఆకుల్లో ఉండే పొటాషియం, మెగ్నీషియం రక్తపోటును నార్మల్ గా చేయడానికి సహాయపడతాయి. 
 

88

అల్లం.. బీపీ తగ్గినప్పుడు కొంచెం అల్లం ముక్కను నమిలినా వీరు వెంటనే సాధారణ స్థితికి చేరుకుంటారు. అలాగే ఖర్జూర పండును తిన్నా లోబీపీ తగ్గుతుంది. అలాగే కాసిన్ని వేడినీళ్లలో కొంచెం దాల్చిన చెక్క పౌడర్ ను కలుపుకుని తాగితే బీపీ పెరుగుతుంది. క్యారెట్, ఎండుద్రాక్ష, టొమోటోలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకున్నా లో బీపీ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు. 
 

click me!

Recommended Stories