Motivational Story: నాలో ఒక్క టాలెంట్ కూడా లేదు అని ఫీల్ అవుతున్నారా? మీ కళ్లు తెరిపించే కథ ఇది

Published : Oct 02, 2026, 09:02 AM IST

Motivational Story:ఈ ప్రపంచంలో ఎవరి దారిన వారు వెళ్తుంటారు. కానీ చాలాసార్లు మనం ఎదుటివారి విజయాలను, టాలెంట్ చూసి మనల్ని మనం తక్కువ చేసుకుంటూ ఉంటాం. వాళ్లు ఆ పనిలో అద్భుతంగా రాణిస్తున్నారు, మరి నాకేమో రావడం లేదు అని కుమిలిపోతుంటాం. అయితే, ఈ కథ చదవండి

PREV
13
కథలోకి వెళితే...

ఆకాశంలో సూర్యుడికి దగ్గరలో కొన్ని అందమైన మేఘాలు ఉన్నాయి. అవన్నీ కలిసి ఒకే చోట ఉండేవి. వాటిల్లో ఒక మేఘం.. ఒకరోజు పెద్ద వర్షం కురిపించింది. జనాల నీటి అవసరాన్ని తీర్చింది అని... అందరూ దానిని మెచ్చుకున్నారు. ఆ పక్కనే ఉన్న మరో మేఘం అందమైన రెయిన్ బో క్రియేట్ చేసింది. అది చాలా అందంగా ఉండటంతో... రెయిన్ బో క్రియేట్ చేసిన మేఘాన్ని అందరూ మెచ్చుకుంటారు. దీంతో... పక్కనే ఉన్న మరో చిన్న మేఘం వెంటనే ఉత్సాహపడుతుంది. తాను కూడా వెంటనే వర్షం కురిపించాలని ప్రయత్నిస్తుంది. కానీ, తాను ఎంత ప్రయత్నించినా ఒక్క చిన్న చినుకు కూడా రాలదు. సరే కనీసం.. రెయిన్ బో కోసం అయినా ప్రయత్నిద్దాం అనుకుంటుంది. కానీ, అది కూడా సాధ్యం కాదు.. దీంతో చాలా బాధపడుతుంది. వెంటనే అక్కడి నుంచి దూరంగా అలిగి వెళ్లి.. ఓ కొండ వెనకాల దాక్కుంటుంది.

దానిని దూరం నుంచి సూర్యుడు చూస్తాడు. పిలిచి.. ఏమైంది అని అడుగుతాడు. అయితే.. తాను వర్షం కురిపించలేకపోతున్నాను అని చెబుతుంది. దానికి ఎందుకు బాధపడుతున్నావ్ అని సూర్యుడు చెబితే.. మేఘం అంటే వర్షం కురిపించాలి.. అది చేయనప్పుడు ఇంక నేను ఎందుకు అని బాధపడుతుంది. దానికి సూర్యుడు... అది కాకపోతే.. నువ్వు ఇంకో దానిలో ఎక్స్ పర్ట్ అయ్యి ఉంటావు.. అంత చిన్న దానికి బాధ పడకూడదు అని సర్ది చెబుతుంది. కానీ, సూర్యుడు చెప్పిన మాటలు దానికి నచ్చవు. తాను ఎందుకూ పనికిరాను అని బాధ పడుతూ వెళ్లిపోతూ ఒక చోట ఆగుతుంది.

23
తనలోని టాలెంట్...

ఆ సమయంలో ఓ పక్షికి మంచి నీడ అందిస్తుంది. అప్పటి వరకు ఎండలో ఇబ్బంది పడిన ఆ పక్షికి మంచి నీడ దొరకడంతో.. మేఘానికి థాంక్స్ చెబుతుంది. ఆ మాట వినగానే మేఘానికి సంతోషం వేస్తుంది. మరి కాస్త దూరం వెళ్లగా.. ఎండలో ఓ రైతు పొలంలో పని చేస్తూ ఉంటాడు. వెంటనే వెళ్లి ఈ మేఘం వెళ్లి వాలుతుంది. కాస్త నీడ తగలడంతో.. ఆ రైతుకి ఉపశమనం కలుగుతుంది. ఆయన కూడా వెంటనే మేఘానికి థ్యాంక్స్ చెబుతాడు.

అప్పుడు.. ఆ మేఘానికి నిజంగా తన పర్పస్ ఏంటి అని అర్థం అవుతుంది. అన్ని మేఘాలు వర్షాలు కురిపించాల్సిన అవసరం లేదు అని తెలుసుకుంటుంది. తనలో కూడా టాలెంట్ ఉందని సంబరపడుతుంది. సంతోషంగా మళ్లీ తన ఇంటికి వెళ్తుంది. రోజంతా తనకు జరిగిన విషయాన్ని తోటి మేఘాలతో పంచుకుంటుంది. వాళ్లు కూడా ఆ చిన్న మేఘాన్ని అందరూ మెచ్చుకుంటారు.

33
ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి?

పోలికలే అనర్థం: ప్రతి మనిషి ఈ సృష్టిలో ఒకేలా పుట్టలేదు. అందరి వేలిముద్రలు వేరుగా ఉన్నట్లే, అందరి ప్రతిభ కూడా వేరువేరుగా ఉంటుంది. ఎదుటివారు ఏ రంగంలో రాణిస్తున్నారో చూసి, మనకు అది రాలేదని కుంగిపోవడం కేవలం మనల్ని మనం తక్కువ చేసుకోవడమే అవుతుంది.

ప్రతి ఒక్కరికోసం ఒక ప్రత్యేక గమ్యం ఉంటుంది: వర్షం కురిపించే మేఘాలు ఎంత ముఖ్యమో, ఎండలో కష్టపడేవారికి నీడనిచ్చే మేఘాలు కూడా అంతే ముఖ్యం. మీలోని ప్రత్యేకత ఏమిటో మీరు గుర్తించాలి. బహుశా మీ టాలెంట్ వేరే రంగంలో ఉండవచ్చు, దానిని గుర్తించడమే అసలు విజయం.

ఆత్మవిశ్వాసమే శ్రీరామరక్ష: ఆ చిన్న మేఘం మొదట్లో తనని తాను తక్కువ చేసుకుని పారిపోయింది. కానీ, పక్షులకు, రైతుకు నీడనిచ్చినప్పుడే దాని నిజమైన విలువ ఏంటో దానికి తెలిసింది. అలాగే మన జీవితంలో కూడా ఓపికతో, మనపై మనకు నమ్మకంతో ముందుకు వెళ్తే మనం ఎక్కడ రాణించగలమో మనకే స్పష్టంగా తెలుస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories