తమిళనాడులోని తప్పక చూడాల్సిన ప్రదేశాలు.. మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇవే!

First Published Oct 29, 2021, 5:12 PM IST

భారత దేశంలోని పర్యాటక ప్రదేశాలలో (Tourism place) తమిళనాడు ఒకటి.  తమిళనాడులోని దేవాలయాలు, ఎత్తైన గోపురాలు (Domes) ఉంటూ సహజ సిద్ధమైన ప్రకృతి అందాలతో పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనం తమిళనాడులోని ప్రసిద్ధి చెందిన కొన్ని పర్యాటక ప్రదేశాల గురించి ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం..
 

కుటుంబ సభ్యులతో కలసి సందర్శించడానికి తమిళనాడులో అనేక పర్యాటక  ప్రదేశాలు ఉన్నాయి. ఇక్కడి దేవాలయాలు, కళాత్మక సౌరభాలు, గోపురాలు(Domes), శిల్పకళా (Sculpture) చాతుర్యాన్ని చూడడానికి దేశంలోని అనేక మూలాల నుంచి పర్యాటకులు వస్తుంటారు. ఇక అవేంటో చూదాం.
 

రామేశ్వరం (Rameshvaram): తమిళనాడులోని ముఖ్య పర్యాటక ప్రదేశాలలో రామేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం ఒకటి. ఇక్కడ శివుడు రామనాథస్వామిగా పూజలు అందుకుంటున్నాడు.ఇక్కడ ప్రత్యేకత శ్రీ రాముడు సీతాదేవిని రావణాసురుడి చర నుంచి కాపాడుకోవడం కోసం శ్రీలంకకు వెళ్లడానికి ఇక్కడి నుంచే వంతెనను (Bridge) నిర్మించాడట.
 

ఇక్కడ శ్రీ రాముడు శివ లింగాన్ని ప్రతిష్ట చేశాడు. రామేశ్వరంలో మొదటి సముద్ర స్నానం చేశాక 22 బావులలో స్నానాలు చేస్తారు. 22 బావులలోని నీటితో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. ఈ 22 బావులు 22 తీర్థాలు. ఇక్కడ పంబన్ బ్రిజ్ (Pamban bridge) , ధనుష్కోడి (Dhanushkoti) ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణలు.
 

మధురై (Madhurai) : మధురై అనే పేరు వినగానే మనకు మీనాక్షి అమ్మవారి ఆలయం గుర్తుకొస్తుంది. మధురై ఆలయం వైగై (Vaigai) నది ఒడ్డున ఉంది. ఈ ఆలయం 8 ద్వారాలతో, 2 బంగారు గోపురాలతో పాటు 14 సుందరమైన గోపురాలతో (Domes) అందంగా ఉంటుంది. నాలుగు దిక్కులు నాలుగు రాజ గోపురాలతో సుందరంగా కనిపిస్తుంది.
 

మధురై నగరానికి దక్షిణాన నాగమలై హిల్స్ (Nagamalai), ఉత్తరాన సిరుమలై హిల్స్ (sirumalai) ఉన్నాయి. తమిళనాడులో ప్రసిద్ధి చెందిన దేవాలయాల్లో మధురై రెండవ స్థానంలో ఉంది. మీనాక్షి టెంపుల్ మాత్రమే కాక మరెన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. ఇది ఒక మంచి పర్యాటక ప్రదేశం.
 

శ్రీపురం (Sripuram): శ్రీపురం స్వర్ణ దేవాలయం (Golden temple) వేలూరుకి దగ్గరలో మలైకుడి సమీపంలో ఉంది. ఇది కొండల దిగువున సుమారు నూరు ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడినది. ఇది చెన్నై నుండి 180 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయంలోని గర్భగుడి (Sanctum) దాదాపు 1.5 మెట్రిక్ టన్నుల బంగారంతో చేసిన మందపాటి రేకులతో కప్పబడి ఉంటుంది. 
 

మహాబలిపురం (Mahabhalipuram) : మహాబలిపురం తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉంది. మహాబలిపురంను మహాబలి అనే ఒక క్రూర రాజు పాలించేవాడు. ఆయనను శ్రీమహావిష్ణువు వధించడంతో మహాబలిపురం అని పేరు వచ్చింది. ఇక్కడ కొండ రాతి గృహాలు (Stone cave), ఇసుక బీచ్ (Sandy beach), దేవాలయాలు, చారిత్రాత్మక, పుణ్యక్షేత్రాలు పర్యాటకులకు కనువిందు చేస్తాయి.

click me!