Cleaning Hacks: వంటగదిలో గిన్నెలు మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. కూర మాడిపోయినప్పుడు, పాలు అడుగుంటినా కూడా గిన్నెలు నల్లగా మారుతాయి. బొగ్గులా మారిన గిన్నెలను కూడా తెల్లగా మెరిపించే చిట్కాలు కొన్ని ఉన్నాయి.
వంట చేసేటప్పుడు పాలు మాడిపోవడం, కూర మాడిపోవడం వంటివి జరుగుతూ ఉంటాయి. అప్పుడు గిన్నె నల్లగా మారిపోతుంది. సాధారణంగా తోమితే ఆ నలుపుదనం పోదు. అలాంటప్పుడు కొన్ని చిట్కాలు పాటించడం ద్వారా నల్లగా మారిన గిన్నెలను తిరిగి స్టీలు గిన్నెల్లా మెరిపించేయచ్చు. ఇందుకోసం మీరు మాడిపోయిన గిన్నె నిండా నీళ్లు , అందులో చెంచా ఉప్పు, ఒక చెంచా బేకింగ్ సోడా, సగం ప్యాకెట్ ఈనో , కొద్దిగా డిటర్జెంట్ లిక్విడ్ లేదా పౌడర్ వంటివి సిద్ధం చేసుకోవాలి.
23
ఇలా చేయండి
ముందుగా మాడిపోయిన గిన్నెలో మాడు మునిగేంత వరకు నీళ్లు పోయాలి. సుమారు 2 లీటర్ల నీళ్లు సరిపోతాయి. ఇప్పుడు ఆ గిన్నెను గ్యాస్ స్టవ్ మీద పెట్టండి. నీళ్లలో ఒక చెంచా ఉప్పు వేయండి. ఉప్పు మాడిన పొరను వదలగొట్టడానికి సాయపడుతుంది. ఆ తర్వాత, ఒక చెంచా బేకింగ్ సోడా కూడా కలపండి. ఇది మొండి మరకలను తొలగించడంలో బాగా పనిచేస్తుంది.
33
ఈనో కలిపి
ఈనో పొడి వాడడం ద్వారా గిన్నెలకు పట్టిన మాడును వదిలించేయవచ్చు. ఇది నీటిలో బుడగలు (Effervescence) సృష్టించి, గిన్నెకు అంటుకున్న నల్లటి మాడును సులభంగా వేరు చేస్తుంది. కాబట్టి స్టమ్ మీద పెట్టిన గిన్నెలో ఈనో పొడి కలపండి. చివరగా, కొద్దిగా బట్టలు ఉతికే డిటర్జెంట్ వేసి నీటిని బాగా మరగనివ్వండి. నీళ్లు మరుగుతున్నప్పుడు, గిన్నె అడుగున అంటుకున్న నల్లటి పొరలు వాటంతట అవే పైకి తేలడం ప్రారంభమవుతాయి. నీళ్లు బాగా మరిగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేయండి. గిన్నెను కనీసం 1 గంట పాటు అలాగే వదిలేయండి. నీళ్లు చల్లారే కొద్దీ మాడిన పొరలు పూర్తిగా మెత్తబడతాయి.
గంట తర్వాత ఒక గరిటెతో గిన్నె అడుగు భాగాన్ని బాగా గీరండి. ఇప్పుడు మాడిన పొరలు ఎలాంటి శ్రమ లేకుండా ఊడి వచ్చేస్తాయి. ఆ నీటిని పారబోసి మామూలు స్క్రబ్బర్‌తో తోమితే స్టీలు గిన్నెలు తళతళలాడిపోతాయి.