Image: FreePik
గంధం పొడిని చర్మాన్ని అందంగా మార్చడానికి ఎన్నో సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. దీని వల్ల కలిగే ప్రయోజనాల గురించి అమ్మమ్మలు చాలాసార్లు చెప్పే ఉండొచ్చు. కానీ ఈ బ్యూటీ సీక్రెట్స్ గురించి మనం పెద్దగా పట్టించుకోం. నిజానికి గంధం పొడి మన చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిని ఉపయోగించి మనం ఎన్నో చర్మ సమస్యలను తగ్గించుకోవచ్చు. అందుకే దీనిని ఎన్నో చర్మ సంరక్షణ ఉత్పత్తుల్లో ఉపయోగిస్తారు. గంధం పొడిని ఉపయోగించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Image: Getty
మొటిమలను తగ్గిస్తుంది
గంధం పొడిని ఉపయోగించడం వల్ల మొటిమలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఎలా అంటే గంధంలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇది మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను పెరగనివ్వదు. ఫలితంగా మొటిమలు ఏర్పడవు. గంధం మొటిమల వల్ల కలిగే మంటను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది. అందుకే మీరు మొటిమలతో ఇబ్బంది పెడుతుంటే గంధం ఫేస్ ప్యాక్ ను ఉపయోగించండి.
Image: Getty Images
వడదెబ్బకు చికిత్స
వడదెబ్బ వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. అలాగే చర్మంపై దద్దుర్లే ఏర్పడతాయి. ఇలాంటి వారికి గంధం పొడి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే గంధం పొడి చల్లని స్వభావం కలిగి ఉంటుంది. ఇది చర్మపు చికాకును, దద్దుర్లను తగ్గించడానికి సహాయపడుతుంది. గంధం మీ చర్మానికి ఎలాంటి హాని చేయదు. కాబట్టి మీరు సురక్షితంగా ఉపయోగించొచ్చు.
యాంటీ ఏజింగ్ గుణాలు
కాలుష్యం, వయస్సు వల్ల కలిగే వృద్ధాప్య లక్షణాలను తగ్గించడానికి కూడా గంధం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. గంధం పొడి మన చర్మాన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి రక్షిస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల ముడతలు తగ్గిపోతాయి.
sandal powder
ముఖాన్ని మెరుగుపరుస్తుంది
గంధంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం డల్ నెస్ ను తగ్గిస్తాయి. అలాగే గంధం పొడి చర్మంపై ఉన్న మచ్చలను కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. గంధాన్ని ఉపయోగించడం వల్ల చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
ఫేషియల్ ఆయిల్ ను తగ్గిస్తుంది
గంధం పొడిని ఉపయోగించి చర్మంలోని అదనపు నూనెను తగ్గించుకోవచ్చు. దీంతో మొటిమలు కూడా తొందరగా తగ్గుతాయి. అలాగే గంధం మన చర్మాన్ని పొడిబారనియ్యదు. అందుకే దీన్ని అన్ని రకాల చర్మం వారు ఉపయోగించొచ్చు.
మచ్చలను తగ్గిస్తుంది
గంధం చర్మం కొల్లాజెన్ ను పెంచుతుంది. ఇది చర్మంపై ఉన్న మచ్చలను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది. దీంతో స్కిన్ టోన్ కూడా మెరుగ్గా కనిపిస్తుంది. ఇందుకోసం గంధం పొడిని పేస్ట్ లా చేసి ముఖానికి అప్లై చేయాలి.