మీరు సెక్స్ టాయ్స్ ను ఉపయోగిస్తారా? అయితే ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సిందే..!

First Published | Dec 1, 2023, 3:07 PM IST

సెక్స్ టాయ్స్ ను ఉపయోగించడం వల్ల ఎలాంటి హాని జరగదు. కానీ ఎలా ఉపయోగించాలో కరెక్టుగా తెలియకపోతేనే మీరు ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. అవును వీటిని పరిశుభ్రంగా ఉంచకపోతే మీ సన్నిహిత ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. 
 

ప్రస్తుత కాలంలో మార్కెట్లో రకరకాల సెక్స్ టాయ్స్ దొరుకుతున్నాయి. ఈరోజుల్లో సెక్స్ టాయ్స్ అంటే చాలా కామన్ అయిపోయింది.  అయితే ఆడవారు స్వీయ ఆనందం కోసం సెక్స్ టాయ్స్ ను వాడుతుంటారు. దీనివల్ల వచ్చే నష్టమేమీ లేదు. కానీ వీటిని ఉపయోగించడానికి సరైన మార్గం తెలియకపోతే, వీటి పరిశుభ్రత గురించి సరైన సమాచారం లేకపోతే మీ సన్నిహిత ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు. పరిశుభ్రంగా లేని సెక్స్ బొమ్మలు యోని ఇన్ఫెక్షన్లు, యుటీఐలు, దద్దుర్లు వంటి ఇతర ఎన్నో సమస్యలు వచ్చేలా చేస్తాయి. ఎలాంటి సెక్స్ టాయ్స్ ను ఉపయోగించినా.. దానిని క్లీన్ చేసే ప్రక్రియ గురించి మీరు ముందుగా తెలుసుకోవాలి. మరి సెక్స్ టాయ్స్ ను ఉపయోగించేవారు వీటిని ఎలా ఉపయోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.  
 

పరిశుభ్రత ఉత్పత్తులు 

సాధారణంగా సిలికాన్, గ్లాస్, స్టెయిన్ లెస్  స్టీల్ తో తయారైన చాలా రకాల సెక్స్ టాయ్స్ ను తేలికపాటి సబ్బు, నీటితో కడిగి శుభ్రం చేయొచ్చు. అయినప్పటికీ అన్ని రకాల సబ్బులు, వాషింగ్ ఉత్పత్తులు సన్నిహిత ఆరోగ్యానికి మంచివి కావు. ఎందుకంటే వీటిలో మంచి సువాసనలు వచ్చే కొన్ని కఠినమైన ఉత్పత్తులను ఉపయోగిస్తారు. ఇలాంటి వాటితో క్లీన్ చేసిన సెక్స్ టాయ్స్ ను వాడిన తర్వాత యోనిలో చికాకు, అసౌకర్యం కలుగుతుంది. అలాగే సూక్ష్మజీవుల అసమతుల్యత, సంక్రమణ ప్రమాదం కూడా పెరుగుతుంది. 
 


మీ శరీరంలోని ఇతర భాగాల కంటే వల్వర్ ప్రాంతానికే ఎక్కువ సంరక్షణ అవసరం. ఇది 5 పీహెచ్ ను కలిగి ఉంటుంది. ఇది సంక్రమణ, చికాకును నివారించడానికి సహాయపడుతుంది. ఇలాంటి సమయంలో మీరు సెక్స్ టాయ్స్ ను ఉపయోగిస్తూ.. సరైన పరిశుభ్రతను పాటించలేకపోతే పిహెచ్ అసమతుల్యత చెందుతుంది. దీంతో మీరు ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. 

ఆరబెట్టడం ముఖ్యం

మీరు ఉపయోగించే సెక్స్ టాయ్స్ ఎప్పుడూ కూడా పొడిగా ఉండేట్టు చూసుకోవాలి. అంటే వీటిని ఉపయోగించిన వెంటనే క్లీన్ చేసి ఆరబెట్టాలి. మీరు ఉపయోగించడానికి ముందు మీ సెక్స్ బొమ్మలు పూర్తిగా పొడిగా ఉన్నాయని నిర్ధారించుకోండి. దీంతో తడి ఉపరితలాలపై బ్యాక్టీరియా వృద్ధి చెందదు. వీలైతే వాటిని గాలిలో ఆరబెట్టడానికి ప్రయత్నించండి. తర్వాత వాటిని సేఫ్ ప్లేస్ లో పెట్టండి. 
 

బ్యాటరీ ఉత్పత్తులపై శ్రద్ధ 

చాలా రకాల వైబ్రేటర్లు బ్యాటరీలతోనే నడుస్తాయి. ఒకవేళ మీరు బ్యాటరీతో నడిచే సెక్స్ టాయ్ ను ఉపయోగిస్తే వీటిని శుభ్రం చేయాడానికి నీటిలో ముంచకూడదు. ఎందుకంటే వైబ్రేటర్లు పనిచేయడానికి బ్యాటరీలు లేదా విద్యుత్ అవసరం. అందుకే వీటిని నీటిలో ముంచకూడదు. అయితే దీనిని శుభ్రం చేయడానికి గోరువెచ్చని నీరు, సబ్బు సహాయంతో తుడవండి. కానీ వీటిని నేరుగా నీళ్లలో ముంచితే మాత్రం పాడవుతాయి. 


సెక్స్ టాయ్ స్టోరేజ్ 

మీ సెక్స్ టాయ్ ను సురక్షితమైన ప్రదేశంలో ఉంచడం ఎంత ముఖ్యమో దానిని సరిగ్గా శుభ్రపరచడం కూడా అంతే ముఖ్యం. బెడ్ సైడ్ డ్రైయర్స్ వంటి ప్రదేశాలలో వీటిని పెట్టకండి. ఎందుకంటే ఈ ప్రదేశాల్లో దుమ్ము, ధూళి ఎక్కువగా ుంటుంది. వీటిని చిన్న బ్యాగుల్లో ఉంచండి. అందుకే చాలా కంపెనీలు శాటిన్ బ్యాగులతో సెక్స్ టాయ్స్ ను అందిస్తున్నాయి. అలాగే సెక్స్ బొమ్మలను ప్రత్యక్ష సూర్యకాంతికి దూరంగా ఉంచడం మంచిది. ఎందుకంటే సూర్యరశ్మి సెక్స్ బొమ్మ పదార్థంతో ప్రతిస్పందిస్తుంది. ముఖ్యంగా జెల్లీ, రబ్బర్ బొమ్మలను సూర్యకిరణాలకు గురికానివ్వకూడదు. వాటిని బ్యాగ్ లేదా డ్రాయర్, సూట్కేస్ లో ఉంచడం సురక్షితం. 

కండోమ్ లను ఉపయోగించడం 

సెక్స్ టాయ్ వాడితే కచ్చితంగా కండోమ్స్ ను వాడాలని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మీ బొమ్మను పూర్తిగా శుభ్రం చేసినప్పటికీ.. సంక్రమణ ప్రమాదం ఉంది. ఒక అధ్యయనం వైబ్రేటర్ వాడకం, శుభ్రపరిచిన ఒక రోజు తర్వాత వాటిపై హ్యూమన్ పాపిల్లోమావైరస్ ఆనవాళ్లను కనుగొంది.

Latest Videos

click me!