లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ ఈ ఏడాది కొత్త బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో 600 లకు పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆటపై ఎంత దృష్టి పెడతాడో... ఫిట్నెస్ మీద కూడా అంతే ఫోకస్ పెడతాడు.
కేఎల్ రాహుల్... క్రికెట్ ప్రియులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఆట తీరుకి విపరీతమైన ఫ్యాన్స్ ఉన్నారు. బ్యాటు పట్టుకొని కేఎల్ రాహుల్.. క్రీజులోకి అడుగుపెట్టాడంటే చాలు.. అభిమానులు స్టేడియంలో నుంచి కేరింతలు పెట్టడం చాలా కామన్.
28
Image Credit: KL Rahul Instagram
అయితే.. కేవలం రాహుల్ ఆటకు మాత్రమే కాదు.. ఆయనకు అమ్మాయిల ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువ అనే చెప్పొచ్చు. కేఎల్ రాహుల్ ఫిట్నెస్ కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. మరి తన ఫిట్నెస్ ని కాపాడుకోవడానికి ఆయన ఏం చేస్తుంటారు..? ఆయన డైటింగ్ సీక్రెట్ ఏంటో ఓసారి చూసేద్దామా..
38
Image Credit: KL Rahul Instagram
లక్నో సూపర్ జెయింట్ కెప్టెన్ ఈ ఏడాది కొత్త బాధ్యతలు చేపట్టిన కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో 600 లకు పైగా పరుగులు చేసి రికార్డు సృష్టించాడు. ఆటపై ఎంత దృష్టి పెడతాడో... ఫిట్నెస్ మీద కూడా అంతే ఫోకస్ పెడతాడు.
48
కేఎల్ రాహుల్ తన ఫిట్నెస్ కోసం కేవలం జిమ్ కి పరిమితమవ్వడు. జిమ్ లో కసరత్తులు చేయడంతో పాటు..స్విమ్మింగ్ చేయడం, సైకిల్ తొక్కడం, రన్నింగ్ చేయడం, యోగా లాంటివి కూడా చేస్తూ ఉంటాడు.
58
ఇక డైట్ విషయానికి వస్తే.. కేవలం ఒకే డైట్ కి పరిమితమవ్వడట. వివిధ రకాల డైట్స్ ఫాలో అవుతాడట. కీటో, నో కార్బ్, హై ప్రోటీన్ ఇలా.. అన్ని డైట్స్ ఫాలో అవుతూ ఉంటాడట.
68
KL Rahul LSG
కేఎల్ రాహుల్ కి.. దక్షిణ భారత వంటకాలు అంటే ఎక్కువగా ఇష్టమట. ముఖ్యంగా అన్నం, దోశ లు తినడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తాడట.
78
డైట్ లో షుగర్ ని ఎవాయిడ్ చేస్తాడట. అయితే.. అప్పుడప్పుడు ఐస్ క్రీమ్ లను మాత్రం తింటూ ఉంటాడట. చీట్ డే రోజు ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడతాడు.
88
మ్యాచ్లు ఉన్నప్పుడు మాత్రమే కాదు... లేనప్పుడు కూడా తన బాడీకి ఆయన బ్రేక్ ఇవ్వరు. స్విమ్మింగ్ అయినా చేస్తారు. కానీ ఫిజికల్ యాక్టివిటీకి మాత్రం బ్రేక్ ఇవ్వడు.