ప్రతి అమ్మాయికి మెరిసే చర్మం కావాలని ఉంటుంది. అయితే ముఖానికి ఏవేవో క్రీములు రాస్తూ అందంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ముఖానికి పచ్చిపాలు రాయడం ద్వారా అందాన్ని పెంచుకోవచ్చు.
అమ్మాయిలకు అందం ఎంతో ముఖ్యం. చర్మం మెరిసిపోవాలని మచ్చలు, మొటిమలు రాకూడదని కోరుకుంటారు. రసాయనాలు కలిసిన ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. ఇలా కెమికల్ ఉత్పత్తులకు చర్మాన్ని గురి చేస్తే దీర్ఘకాలంలో ముఖం అందవిహీనంగా మారిపోతుంది. కొన్ని ఉత్పత్తులు చర్మానికి ఎంతో కీడు చేస్తాయి. కాబట్టి ఇంట్లో ఉన్న వస్తువులతోనే చర్మ సౌందర్యాన్ని కాపాడుకోవాలి.
కొంతమంది ఉదయం లేచిన వెంటనే అద్దంలో చూసుకుంటారు. అప్పుడు వారి చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. ముఖం పాలిపోయినట్లు అనిపిస్తుంది. ఇలా మీకు కూడా అనిపిస్తే పచ్చిపాలతో మీ చర్మాన్ని అందంగా మెరిసిపోయేలా చేయవచ్చు. వంటగదిలో ఉంచిన కొన్ని వస్తువులను ఈ పచ్చిపాలలో కలిపి ముఖానికి అప్లై చేయండి చాలు. కొన్ని రోజుల్లోనే మీ ముఖం మెరిసిపోతుంది.
25
పచ్చిపాలలో పసుపు
పచ్చిపాలలో చిటికెడు పసుపు వేసి దాన్ని ముఖానికి పూయండి. తరచూ ఇలా చేయడం వల్ల అది మచ్చలను తొలగిస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది. వారానికి కనీసం రెండుసార్లు ఇలా పచ్చిపాలలో పసుపు వేసి ముఖానికి రాయడం వల్ల మీకు అద్భుతమైన చర్మం దక్కుతుంది.
35
పచ్చిపాలలో గంధపు పొడి వేసి
రెండు స్పూన్ల పచ్చిపాలలో గంధం పొడిని వేసి పేస్టులా చేయండి. దాన్ని ముఖానికి అప్లై చేయండి. ఒక ఐదు నిమిషాల పాటు వదిలేసి తర్వాత కడిగేయండి. దీని వల్ల చర్మం మృదువుగా మారుతుంది. ముఖానికి చక్కని మెరుపు వస్తుంది.
45
పచ్చి పాలలో తేనె
రెండు స్పూన్ల పచ్చిపాలలో తేనెను వేసి కలిపి పేస్టులా చేయండి. దీన్ని ముఖానికి రాసుకుంటే చర్మం బంగారు రంగులోకి మారుతుంది. చర్మాన్ని మెరిసేలా ఉంచుకోవాలంటే వారానికి మూడుసార్లు అయినా పచ్చిపాలు వస్తేనే కలిపి ముఖానికి అప్లై చేయాలి.
55
పచ్చిపాలు రోజ్ వాటర్
చర్మం పై ఉన్న మురికిని ప్రతిరోజు తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. రాత్రి పడుకోబోయే ముందు రెండు స్పూన్ల పచ్చిపాలలో రోజ్ వాటర్ వేయండి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించండి. ఇది మీ చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. అలాగే మృత కణాలను తొలగిస్తుంది. కొన్ని రోజుల్లోనే మీ చర్మం అందంగా మెరిసిపోవడం మొదలవుతుంది.