Weight loss: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. తొందరగా బరువు తగ్గుతారు..

Published : Jun 07, 2022, 02:06 PM IST

Weight loss: బరువు తగ్గడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే వీళ్లు రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే తొందగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు. 

PREV
15
Weight loss: రాత్రి పడుకునే ముందు ఇలా చేస్తే.. తొందరగా బరువు తగ్గుతారు..

మారుతున్న జీవన శైలిలో అధిక బరువు (Overweight)అనేది సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది. ఇక ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో చిట్కాలను పాటిస్తూ ఉంటారు. బరువు తగ్గే ప్రాసెస్ చాలా ఆలస్యంగా జరిగినా.. ఖచ్చితమైన ఫలితాలు మాత్రం వస్తాయి. ఇందుకోసం మీరు చిన్న చిన్న విషయాలను సైతం పట్టించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే.. బరువు తగ్గడానికి బదులుగా వేగంగా బరువు పెరుగుతారు. 
 

25

ముఖ్యంగా రాత్రి నిద్రపోయే ముందు కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది మీరు తొందరగా బరువు తగ్గేందుకు సహాయపడుతుంది. దీనికోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

35

రాత్రి మరో గంటసేపు ఎక్కువ నిద్రపోండి.. రాత్రిపూట మీరు అధనంగా ఒక గంట ఎక్కువ నిద్రపోతే.. అది బరువు తగ్గించడంలో మీకు సహాయపడుతుంది. ఏదైనా వ్యాధి సోకినప్పుడు ఎక్కువ సేపు నిద్రపోవడం వల్ల..  సగం కంటే ఎక్కువ వ్యాధి నిద్రలోనే పోతుందని చాలా మందికి తెలుసు. అలాగే ఎక్కువగా నిద్రపోవడం వల్ల బరువు తగ్గడంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
 

45

ప్రోటీన్ షేక్.. రాత్రి పడుకునే ముందు ప్రోటీన్ షేక్ తాగినా కూడా ఎన్నోప్రయోజనాలు కలుగుతాయి.  ఇందులో ప్రోటీన్ కార్బోహైడ్రేట్లు, కొవ్వు కంటే ఎక్కువైన థర్మోజెనిక్ అని నమ్ముతారు. దీనిని శరీరం జీర్ణం చేసుకోవడానికి ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. ఈ విధంగా మీరు బరువు తగ్గడానికి ఎంతో సహాయపడుతుంది. 
 

55

స్లీప్ మాస్క్ ధరించి పడుకోవాలి.. స్లీప్ మాస్క్ ధరించడానికి బరువు తగ్గడానికి కూడా సంబంధం ఉందని మీకు తెలుసా? మసక వెలుతురులో నిద్రించే వారికి ఊబకాయం వచ్చే అవకాశం 21 శాతం ఉంటుందని  పలువురు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితిలో.. లైట్ వెలుతురులో పడుకునే వ్యక్తులు స్లీప్ మాస్క్ ధరించి నిద్రించాలి. అప్పుడే మీరు వేగంగా బరువు తగ్గుతారు.

click me!

Recommended Stories