ఫోన్ ఎక్కువగా చూస్తే ముసలోళ్లు అవుతారంట - నిజ‌మేనా?

First Published Oct 12, 2024, 8:03 PM IST

Is Phone Blue Light accelerate the aging process: సోషల్ మీడియాలో ఫోన్‌ల నుండి వచ్చే బ్లూ లైట్ చర్మానికి హాని కలిగిస్తుందనే వార్తలు వైరల్ గా మారాయి. బ్లూ లైట్ కండ్లతో పాటు చర్మానికి నష్టం కలిగించడంతో పాటు త్వరగా వృద్ధాప్యాన్ని తీసుకువస్తుందనే  వార్తలు ఎంతవరకు నిజం, దానిని ఎలా నివారించాలో తెలుసుకుందాం.

Is Phone Blue Light Harmful to Skin, accelerate the aging process : టెక్నాలజీ మానవ జీవితాన్ని మరింత సుఖమయం చేసింది. కానీ, మన కొన్ని అలవాట్లు తీవ్ర అనారోగ్య పరిస్థితులకు కారణం అవుతున్నాయి. మన దినచర్యలు ముఖ్యంగా ఫోన్లు, కంప్యూటర్లు వంటి గ్యాడ్జెట్స్ అధికంగా వాడకం అంటే వాటి నుంచి వచ్చే బ్లూ లైట్ మన చర్మానికి హానికరమనే వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మన కండ్లకు మాత్రమే కాడు, మన చర్మానికి తీవ్ర హానికరమని ఈ వైరల్ వార్తల్లో నిజమెంత? అసలు బ్లూ లైట్ కండ్లను మాత్రమే కాకుండా మన చర్మాన్ని ఎలా దెబ్బతీస్తుంది అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

బ్లూ లైట్ అంటే ఏమిటి?

దృశ్యమాన కాంతి వర్ణపటంలో ఒక భాగం బ్లూ లైట్. దీనికి ప్రధాన వనరు సూర్యకాంతి. అయితే, మన ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లైన టీవీలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్లు సహా పలు ఎలక్ట్రానిక్స్ బ్లూ లైట్ ను ఉత్పత్తి చేస్తాయి. సూర్యుడి కంటే 100–1,000 రెట్లు తక్కువ స్థాయిలో బ్లూ లైట్ ఉన్నప్పటికీ ఇది మనకు తవ్ర నష్టం కలిగిస్తుందని వైద్య నివేదికలు పేర్కొంటున్నాయి. మరీ ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌ గ్యాడ్జెట్స్ ను ఎక్కువసేపు ఉపయోగించడం వల్ల మన ఆరోగ్యానికి హాని కలుగుతుంది. మన చర్మాన్ని కూడా బ్లూ లైట్ ప్రభావితం చేస్తుంది.

బ్లూ లైట్ చర్మ వర్ణద్రవ్యాన్ని పెంచుతుంది

పలు వైద్య అధ్యయనాల ప్రకారం బ్లూ లైట్ ఎక్స్‌పోజర్ మెలనిన్ సంశ్లేషణను వేగవంతం చేస్తుంది. ఇది హైపర్‌పిగ్మెంటేషన్‌కు దారితీస్తుంది. మెలనిన్ అధిక ఉత్పత్తి కారణంగా చర్మం నల్లగా మారుతుంది. ఇది ముదిరితే చర్మంపై నల్లని మచ్చలు కూడా ఏర్పడతాయి.

Latest Videos


బ్లూ లైట్ వల్ల చర్మం ముడతలు వస్తాయి

కొన్ని అధ్యయనాల ప్రకారం బ్లూ లైట్ చర్మ నిర్మాణానికి ముఖ్యమైన ప్రోటీన్ అయిన కొల్లాజెన్‌కు నష్టం కలిగించే అవకాశముంది. ఇది వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది. ఒక అధ్యయనం ప్రకారం మీరు మీ పరికరాన్ని ఒక గంట పాటు ఒక అంగుళం దూరంలో ఉంచితే ఈ ప్రమాదం అధికంగా ఉంటుంది. అంటే మీరు బ్లూ లైట్ ను  ప్రసరింపజేసే ఫోన్, ల్యాప్ టాప్ లను అధికంగా ఉపయోగించడం వల్ల త్వరగా ముసలోళ్లు అవుతారు. 

బ్లూ లైట్ నిద్రను దెద్బతీస్తుంది 

బ్లూ లైట్ చర్మంతో పాటు కళ్లను తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.  మీ కళ్ళ చుట్టూ ఉబ్బిన లేదా మసకబారినట్టు మారితే దీనికి కారణం బ్లూ లైట్ అని మీరు గుర్తించాలి. బ్లూ లైట్ మీ నిద్రను కూడా ప్రభావితం చేస్తుంది. మనిషికి సరిపడా నిద్ర లేకపోతే అది మీ ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతుంది. నిద్ర లేమి లక్షణాలు చర్మంలో కనిపిస్తాయి. చర్మం త్వరగానే ముడుతలు పడటం ప్రారంభం అవుతుంది.

బ్లూ లైట్ హానిని ఎలా నివారించాలి

1. పడుకునే ముందు స్మార్ట్ ఫోన్ స్క్రీన్ ను చూసే టైమ్‌ను తగ్గించాలి. పడుకునే ముందు ఒక గంట ముందు మీ ఫోన్‌ను ఆఫ్ చేయండి లేదా మీ నుండి దూరంగా ఉంచండి.

2. మీ చర్మాన్ని బ్లూ లైట్‌కు గురిచేయకుండా ఉండటానికి మీ ఫోన్ లేదా పరికరాన్ని మీ చర్మం నుండి దూరంగా ఉంచండి.

3. సన్‌స్క్రీన్ రక్షణ కల్పించే, టైటానియం డయాక్సైడ్, ఐరన్ ఆక్సైడ్‌లను కలిగి ఉన్న సన్‌స్క్రీన్‌లను అప్లై చేయండి. ఇవి బ్లూ లైట్ నుండి రక్షణ కల్పిస్తూ చర్మాన్ని జాగ్రత్తగా చూసుకుంటాయి.

4. మీరు నైట్ షిఫ్ట్‌లో పని చేస్తే లేదా రాత్రిపూట చాలా ఎలక్ట్రానిక్ పరికరాలను ఉపయోగిస్తుంటే, బ్లూ-బ్లాకింగ్ గ్లాసెస్ ధరించడం లేదా రాత్రిపూట నీలం/ఆకుపచ్చ తరంగదైర్ఘ్యాన్ని ఫిల్టర్ చేసే యాప్‌ను ఇన్‌స్టాల్ చేయడం మీకు మంచింది. 

5. పగటిపూట ప్రకాశవంతమైన కాంతిలో ఉండండి. ఇది రాత్రిపూట నిద్రపోయే మీ సామర్థ్యాన్ని, అలాగే పగటిపూట మీ మానసిక స్థితి, చురుకుదనాన్ని పెంచుతుంది.

click me!