
ప్రపంచ వ్యాప్తంగా మంకీపాక్స్ కేసులు దారుణంగా పెరిగిపోతున్నాయి. ఇక తాజాగా ఇండియా కు ఈ వైరస్ వ్యాపించింది. ప్రపంచ వ్యాప్తంగా జనాలను తీవ్ర భయబ్రాంతుకు గురిచేస్తున్న ఈ వైరస్ ను ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయంగా ఆందోళన కలిగించే ప్రజారోగ్య అత్యవసరర పరిస్థితిగా ప్రకటించింది. ఈ మంకీపాక్స్ కేసులు కేరళలో 3 నమోదుకాగా.. తాజాగా ఎలాంటి విదేశీ ప్రయాణాలు చేయని ఢిల్లీకి చెందిన వ్యాక్తి కూడా మంకీపాక్స్ వైరస్ బారిన పడ్డాడు. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం నాలుగు మంకీపాక్స్ కేసులు నమోదయ్యాయి. ఇంకా ఎన్నికేసులు నమోదవుతాయో తెలియదు. అందుకే ఇది ఎలా వ్యాపిస్తుంది. దీని లక్షణాలేంటి, దీని ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
మంకీపాక్స్ అనేది కొత్త వ్యాధేం కాదు. దీని మొదటి కేసు 1958 లో నమోదైంది. 1958లో డెన్మార్క్ లోని కోపెన్ హాగన్ లోని ఓ పరిశోధనా కేంద్రంలో ప్రయోగశాల పరీక్షా కోతుల సమూహంలో ఈ వ్యాధి వ్యాపించడం వల్ల దీనికి ఈ పేరు వచ్చింది. ఈ వ్యాధి కోతుల ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది.
దీని వ్యాప్తి ఎలా ఉంటుంది
మంకీపాక్స్ వ్యాప్తిలో జంతువుల పాత్ర కీలకమైందని పరిశోధకులు చెబుతున్నారు. ముఖ్యంగా మనుషులు, కోతులు, అడవి ఎలుకల ద్వారా ఈ వ్యాధి వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. అయితే పశ్చిమ ఆఫ్రికా నుంచి వేరు చేయబడ్డ స్ట్రెయిన్ మధ్య ఆఫ్రికా నుంచి వచ్చిన స్ట్రెయిన్ కంటే తక్కువ ప్రమాదకరమైనదని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా నమోదవుతున్న మంకీపాక్స్ కేసులు పశ్చిమ ఆఫ్రికా స్ట్రెయిన్ వే అని గంగారామ్ హాస్పటల్ లోని ఇంటెన్సివిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ ధీరేన్ గుప్తా తెలియజేశారు.
ఈ మంకీపాక్స్ కోతులు, అడవి ఎలుకలు, ఉడుతలు, దీర్థకాలిక సంపర్కం, మంకీపాక్స్ సోకిన వ్యక్తులతో సన్నిహిత సంపర్కం ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. ఇది గాలి ద్వారా వ్యాపించదు. కానీ ఇది సోకిన రోగితో సన్నిహితంగా ఉంటే.. వారి నోటి పెద్ద పెద్ద బిందువుల ద్వారా సంక్రమిస్తుంది. దీని సెకండరీ ఎటాక్ 7 రెట్లు ఉంటుంది. అంటే చికెన్ పాక్స్, మశూచి కంటే తక్కువగా సంక్రమిస్తుంది.
మంకీపాక్స్ ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది
పురుషులు: ఈ మంకీపాక్స్ కేసులు ఎక్కువగా పురుషుల్లోనే కనిపిస్తున్నాయి.
LGBTQ: లెస్బియన్ (LESBIAN)గే (GAY), BISEXUAL,TRANSGENDER,QUEER వీళ్లకు కూడా మంకీపాక్స్ సోకే అవకాశం ఎక్కువగా ఉంది. పురుషులు,LGBTQ తో కమ్యూనిటీతో సెక్స్ లో పాల్గొనే పురుషులు దీని సంక్రమణకు ఎక్కువగా గురయ్యే అవకాశం ఉందని WHO ఫ్లాగ్ చేసింది.
హెల్త్ కేర్ వర్కర్లు: రోగులకు సేవలు చేసే హెల్త్ కేర్ వర్కర్లకు కూడా మంకీపాక్స్ ప్రమాదం ఎక్కువగా ఉంది. రోగులకు దీర్ఘకాలంపాటు సేవ చేయడం, రోగి బిందువుల చర్మ సంపర్కం ద్వారా వ్యాపిస్తుంది.
రోగనిరోధక శక్తి తక్కువగా ఉండే వ్యక్తులు: రోగ నిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్న వ్యక్తులు, దీర్ఘకాలం పాటు అనారోగ్య సమస్యలతో బాధపడేవారికి రిస్క్ ఎక్కువగా ఉంటుంది.
ఇది లైంగికంగా సంక్రమించే వ్యాధి మాత్రమేనా?
ప్రస్తుతానికి ఈ వ్యాధి పురుషులతో సెక్స్ చేసే పురుషులతో పాటుగా.. ముఖ్యంగా చాలా మంది లైంగిక భాగస్వాములతో ఉన్నవారికి వ్యాపిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది. అందుకే వివిధ దేశాల పురుషులతో లైంగిక సంబంధం ఉన్న పురుషులు, వీరితో సన్నిహితంగా ఉండేవారు చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు.
అయితే ఇది పూర్తిగా లైంగిక సంక్రమణ వ్యాధుల ద్వారా మాత్రమే వ్యాప్తి చెందుతుందని ఖచ్చితంగా చెప్పే సాక్ష్యాలు లేవని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇది హెచ్ఐవి లాంటిదైతే కాదు. కానీ పురుషులు ఒకరితో ఒకరుు సన్నిహితంగా ఉండటం, అసురక్షితమైన రక్తమార్పిడి, ఇతర వ్యాప్తి విధానాల ద్వారా ఇది సోకుతుందని కమ్యూనిటీ మెడిసిన్ ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్ట్ సంజయ్ గారు అన్నారు.
డాక్టర్ గుప్తా ప్రకారం లక్షణాల దశలు ఈ విదంగా ఉంటాయి
ప్రోడ్రోమల్ దశ: ఈ దశ ఐదు రోజుల పాటు ఉంటుంది. అంటే ఈ దశలో రోగికి తీవ్రమైన తలనొప్పి, జ్వరం. వెన్ను నొప్పి, లింఫాడెనోపతి, మయాల్జియా, తీవ్రమైన అలసటలు కలుగుతాయి. అలాగే శరీరంలోని అనేక భాగాల్లో శోషరస కణుపుల వాపు కూడా ఉంటుంది.
దద్దుర్లు: చర్మంపై దద్దుర్లు సాధారణంగా జ్వరం వచ్చిన నాలుగైదు రోజుల్లో రావడం ప్రారంభిస్తాయి. ఇవి సుమారుగా రెండు నుంచి మూడు వారాల పాటు ఉంటాయి. అయితే ప్రోడ్రోమ్ లేని దద్దుర్లు కూడా ఉన్నట్టు నివేధికలు చెబుతున్నాయి. ఇవి ముఖంపై ఏర్పడుకుంటూ వస్తూ చేతులు, పాదాల అరికాళ్లకు కూడా అవుతాయి.
మంకీపాక్స్ ను ప్రమాదాన్ని కొంతవరకు తప్పించడంలో మశూచీ టీకా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కాగా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటే.. ఇది సోకిన వ్యక్తికి పుండ్ల మచ్చలు మాత్రం అలాగే ఉండిపోతాయి. కాగా ఈ కేసుల మరణాల రేటు తక్కువగానే ఉందని డాక్టర్ రాయ్ పేర్కొన్నారు.