నేలపై కూర్చుని తింటే ఏమౌతుందో తెలుసా?

First Published Jun 14, 2024, 2:50 PM IST

చాలా మంది డైనింగ్ టేబుల్ లేదా మంచం లేదా కుర్చీలపై కూర్చిని తింటుంటారు. కొంతమంది మాత్రమే నేలపైనే కూర్చొని తింటుంటారు. అయితే ఇలా నేలపై కూర్చొని తింటే ఏమౌతుందో తెలిస్తే  ఆశ్చర్యపోతారు. 
 

గజిబిజీ లైఫ్ వల్ల ప్రశాంతంగా కూర్చొని తినే సమయం చాలా తక్కువ మందికే ఉంటుంది. ఈ ఉరుకుల పరుగుల లైఫ్ వల్ల చాలా మంది డైనింగ్ టేబుల్ మీద కూర్చొని హడావుడిగా ఏదో తిన్నామా? అంటే తిన్నాము అనిపిస్తారు. అలాగే టిఫిన్ బాక్స్ తీసుకెళ్లి సమయం దొరికినప్పుడు తింటుంటారు. చాలా మందికి ఈ అలవాటు ఉంటుంది. ఇకపోతే ఇంట్లో ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ లేదా సోఫా లేదా మంచంపై కూర్చొని తింటుంటారు. కానీ ఈ కుర్చీలు లేనికాలంలో ప్రతిఒక్కరూ నేలపై కూర్చొని ప్రశాంతంగా తినేవారు. కానీ ఇప్పుడు  డైనింగ్ టేబుల్ మీద లేదా సోఫాలో టీవీ లేదా ఫోన్లు చూస్తూ తింటున్నారు. కానీ  నేలపై కూర్చొని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

బరువు తగ్గడానికి సహాయపడుతుంది

లేవడం, కూర్చోవడం వల్ల శరీర కదలికలు పెరుగుతాయి. ఇది త్వరగా కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మీరు నేలపై కూర్చొని తింటున్నప్పుడు మీ వీపును నిటారుగా ఉంచండి. బరువు తగ్గాలనుకునేవారు ఇలా చేస్తే ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ భంగిమ మీ మనస్సును రిలాక్స్ చేయడానికి కూడా సహాయపడుతుంది. నేలపై కూర్చుని తినేటప్పుడు అతిగా తినరు. ఇది శరీర  అలసట, బలహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది.
 

Latest Videos


అజీర్ణానికి సహాయపడుతుంది

కాళ్ళను నేలపై ఉంచి కూర్చోవడం వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మీ ప్లేట్ ను నేలపై ఉంచి, తినడానికి మీ శరీరాన్ని కొద్దిగా ముందుకు వంచి నిటారుగా కూర్చున్నప్పుడు, ఉదర కండరాలు చురుకుగా మారుతాయి. దీనివల్ల కడుపులో యాసిడ్ స్రావం పెరిగి ఆహారం త్వరగా జీర్ణమవుతుంది.
 

రక్త ప్రసరణను పెంచుతుంది.

కాళ్లు జోడించి కూర్చుంటే శరీరంలో రక్తప్రసరణ పెరుగుతుంది. దీంతో నరాలు రిలాక్స్ అయ్యి వాటిలో టెన్షన్ ను తగ్గుతుంది. ఇది మన గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఎందుకంటే మనం నేలపై కూర్చున్నప్పుడు మన శరీరం, గుండెపై ఒత్తిడి చాలా వరకు తగ్గుతుంది. సుఖాసనంలో కూర్చుని తింటే శరీరం అంతటా రక్తం సమానంగా ప్రవహిస్తుంది.
 

మనసు, శరీరానికి విశ్రాంతి 

పద్మాసనం, సుఖాసనం ధ్యానం చేయడానికి ఉత్తమమైన భంగిమలు. ఇవి మెదడు నుంచి ఒత్తిడిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. శరీరంలో ఆక్సిజన్ ప్రవాహాన్ని పెంచే శ్వాస వ్యాయామాలు కూడా గొప్పగా ఉపయోగడపతాయి. ఇది వెన్నెముకను నిటారుగా చేస్తుంది. అలాగే  భుజం కండరాలను సడలిస్తుంది.
 

click me!