ముద్దుల్లో రకాలు.. ఏ ముద్దుకు ఏం అర్థమొస్తుందంటే?

Published : Jul 06, 2023, 09:54 AM IST

International Kissing Day 2023: ముద్దులోని మాధ్యురమే వేరు. ముద్దు కేవలం ప్రేమను మాత్రమే కాదు, ఆప్యాయత, సంతోషం, గౌరవం వంటి ఎన్నో భావాలను వ్యక్తపరుస్తుంది. కిస్సింగ్ డే సందర్భంగా  ముద్దులోని రకాలు, వాటి అర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..  

PREV
19
ముద్దుల్లో రకాలు.. ఏ ముద్దుకు ఏం అర్థమొస్తుందంటే?

International Kissing Day 2023: మాటల్లోనే కాదు ఒక చిరు ముద్దుతో కూడా ఒక వ్యక్తిపై ఉన్న ప్రేమను చెప్పొచ్చంటుంటారు. నిజానికి ముద్దు మెడిసిన్ కంటే తక్కువేం కాదు. ఇది ఎన్నో భావాలను పలికిస్తుంది. బాధనుంచి బయటపడేస్తుంది. చిరు ముద్దు మానసిక, ఆరోగ్య సమస్యలను కూడా దూరం చేస్తుందంటుంటారు నిపుణులు.

ముద్దును ఒక్కొక్కరు ఒక్కోలా ఇచ్చుకుంటారు. కొందరు బుగ్గపైనే ఇస్తే ఇంకొందరు నుదురు, లిప్స్, చేతులు, మెడ అంటూ ఇస్తుంటారు. ఈ రోజు అంతర్జాతీయ కిస్సింగ్ డే. ప్రతి ఏడాది ఈ కిస్సింగ్ డేను జూలై 6 న జరుపుకుంటారన్న ముచ్చట మీకు తెలుసా? ఈ ఆచారం యునైటెడ్ కింగ్ డమ్ లో పుట్టుకొచ్చింది. ఈ రోజును ప్రపంచ వ్యాప్తంగా 2000 వ సంవత్సరం నుంచి జరుపుకుంటున్నారు. ఈ ప్రపంచ ముద్దు దినోత్సవం సందర్భంగా ముద్దులోని రకాలు, వాటి అర్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. 

29

పెక్ కిస్

మీ  భాగస్వామి పెదాలపై ముద్దు పెట్టుకోవడానికి ఇదొక మంచి మార్గం. ఈ ముద్దు ఆప్యాయతను చూపిస్తుంది. ఈ ముద్దులో మీరు మీ భాగస్వామి పెదాలను మీ పెదాలతో తాకుతారు. ఈ పెక్స్ కిస్ సమయంలో భాగస్వాములిద్దరి పెదాలు క్లోజ్ అవుతాయి. నచ్చిన వారితో,  మీరు బయటకు వెళుతున్న సమయంలో భాగస్వామికి ముద్దు పెట్టడానికి మొదటి ముద్దు పెట్టుకోవడానికి ఇదొక గొప్ప మార్గం. దీనికి ఎలాంటి టెక్నిక్ కానీ ప్రాక్టీస్ కానీ అవసరమే లేదు. అయితే ఈ ముద్దు మీ భాగస్వామిని పలకరించడానికి, వీడ్కోలు చెప్పడానికి ఉపయోగిస్తారు. 
 

39
Image: Getty Images

అమెరికన్ కిస్

ఇది పెక్ కిస్ నుంచి ఒక స్టెప్ అప్. ఇది గాఢమైన ముద్దు. అంతకంటే చాలా చాలా రొమాంటిక్ ముద్దు. ఇది నోటిని తెరచి పెట్టుకుంటారు. కానీ అమెరికన్ ముద్దులో నాలుకను ఉపయోగించకూడదు. మీ భాగస్వామిని ఇతరుల ముందు ముద్దు పెట్టుకోవడానికి ఇది మర్యాదగా ఉంటుంది. అయితే ఈ ముద్దు పెట్టుకోవడానికి మీ చేతులను ఉపయోగించకూడదు. 
 

 

49

ఫ్రెంచ్ కిస్

ఫ్రెంచ్ కిస్ అత్యంత ఉద్వేగభరితమైన ముద్దు. ఇది సుమారుగా అమెరికన్ ముద్దుతో సమానం. దీనిలో నాలుక మీ నాలుక గొప్ప పాత్ర పోషిస్తుంది. ఈ ముద్దు అమెరికన్ కిస్ తో ప్రారంభించిన నాలుకను ఉపయోగిస్తారు. అయితే ఈ కిస్ ను పెట్టుకోవడానికి కొంచెం ప్రాక్టీస్ అవసరం అవుతుంది. ఈ ముద్దు మొదట్లో అంత గొప్పగా అనిపించకపోవచ్చు. 
 

59
Image: Getty Images

బుగ్గ ముద్దు

బుగ్గపై ముద్దు అనేది పలకరింపు లేదా ఆప్యాయతకు సాధారణ సంకేతం. మీకు నచ్చిన వ్యక్తిపై అభిమానాన్ని చూపించడానికి ఇదొక గొప్ప మార్గం. ఈ ముద్దు ఆప్యాయత, ప్రేమ, కృతజ్ఞత మొదలైన వాటిని చూపించడానికి బుగ్గపై ముద్దును పెట్టుకోవచ్చు. 

69
Image: Getty Images

నుదిటిపై ముద్దు

నుదుటిపై ఒక చిన్న ముద్దు ఎన్నో భావాలను చెప్తుందంటారు నిపుణులు. నుదిటిపై ముద్దు చాలా సన్నిహితంగా ఉంటుంది. కాని శృంగార మార్గంలో కంటే మాధుర్యం ఎక్కువగా ఉంటుంది. అనుకున్న వ్యక్తికి ఆప్యాయత, అవగాహన, నమ్మకం, సంరక్షణను తెలియజేయడానికి ఈ ముద్దును పెట్టుకుంటారు. మీ భాగస్వామి, స్నేహితులు, తల్లిదండ్రులు లేదా పిల్లల మాదిరిగా మీకు దగ్గరగా అనిపించే ఎవరికైనా ఈ ముద్దును పెట్టొచ్చు.  మీ భాగస్వామి బాధలో ఉన్నారని మీకు అనిపిస్తే వారిని మీ వైపు తిప్పుకుని నుదుటిపై ముద్దు పెట్టండి. ఇది వారికి ఓదార్పునిస్తుంది. 

79

మెడపై ముద్దు

మెడ శరీరంలోని అత్యంత సున్నితమైన భాగాలలో ఒకటి. మెడను ముద్దు పెట్టుకోవడాన్ని సాధారణంగా చాలా సన్నిహిత, శృంగార సంకేతంగా భావిస్తారు. మీరు చూడని వ్యక్తి మీకు ఈ రకమైన ముద్దు పెడితే అది ఖచ్చితంగా శృంగారానికి సంకేతంగా భావించాలి.  మీరు మీ భాగస్వామి మెడ వెనుక భాగాన్ని ముద్దు పెట్టుకుంటే వారిని రొమాంటిక్ మూడ్ లోకి తీసుకెళుతుంది. 
 

89

బటర్ ఫ్లై ముద్దు

సీతాకోకచిలుక ముద్దు అందమైన రకాల ముద్దులలో ఒకటి. ఇది ఎంతో మృదువైనది. ఇది ప్రేమ, ఆప్యాయత, ఉల్లాసాన్ని వ్యక్తపరుస్తుంది. ఎవరికైనా సీతాకోకచిలుక ముద్దు ఇవ్వడానికి మీరు మీ ముఖాన్ని వారి ముఖానికి దగ్గరగా తీసుకురావాల. అలాగే మీ కళ్లు వారి కళ్లను తాకాలి. తర్వాత మీ కనురెప్పలను కొట్టాలి. ఇది వారికి సీతాకోకచిలుక రెక్కల ద్వారా ముద్దు పెడుతున్నట్టు అనిపిస్తుంది. సీతాకోకచిలుక ముద్దు తప్పనిసరిగా రొమాంటిక్ కాదు. తల్లిదండ్రులు చిన్న పిల్లలకు ఇస్తారు. మీ భాగస్వామి శరీరంలోని ఇతర భాగాలపై కూడా సీతాకోకచిలుక ముద్దులు ఇవ్వొచ్చు. 
 

99

హ్యాండ్ కిస్

హ్యాండ్ కిస్ శృంగార సంకేతంగా భావించకూడదు. ఇది పెద్దలకు లేదా మీ స్థాయికి పైన ఉన్న వ్యక్తులకు గౌరవ సూచికగా ఉపయోగించబడుతుంది. మీ భాగస్వామి చేతిని పట్టుకుని ముద్దు పెడితే ఇది చాలా సున్నితమైన, వెచ్చని అనుభూతిని కలిగిస్తుంది. ఇది వారికి ఆప్యాయత, విశ్వాసం, భరోసా, ప్రేమను తెలియజేస్తుంది.  

click me!

Recommended Stories