వంటగదిలో లవంగాలు ఉంటాయి. ఇవి బొద్దింకలను తరిమికొడతాయి. వాటి వాసన బొద్దింకలకు ఏమాత్రం నచ్చవు. కిచెన్ డ్రాయర్లు, కప్‌బోర్డులలో ఓ పది లవంగాలు వేసి ఉంచండి. ఆ వాసనకు బొద్దింకలు రావు. బేకింగ్ సోడాను బొద్దింక తిన్న వెంటనే చనిపోతుంది. వంటసోడా, పంచదార పొడిని సమానంగా కలిపి కిచెన్ మూలల్లో, సింక్ కింద, అలమరాల వెనుక చల్లండి. పంచదార వాసనకు వచ్చే బొద్దింక, బేకింగ్ సోడా తిని చనిపోతుంది. బిర్యానీ ఆకులు కూడా బొద్దింకలను తరిమేందుకు అద్భుతంగా పనిచేస్తాయి. బొద్దింకలకు వాటి వాసన నచ్చదు. ఓ ఆరు బిర్యానీ ఆకులను పొడి చేసి వంటగది మూలల్లో చల్లండి. ఈ వాసనకు బొద్దింకలు వెంటనే పారిపోతాయి.