ఆరోగ్యంగా ఉండడానికి నెయ్యిని ఎలా వాడాలంటే...

First Published Sep 13, 2021, 4:00 PM IST

నెయ్యిని... ఈజిప్టులో 'సామ్నా', మధ్యప్రాచ్యంలో 'సామ్న్', ఇరాన్‌లో 'రోగన్', ఉగాండాలో 'సములి' అని పిలుస్తారు. ఈ రిచ్ న్యూట్రీషియన్ ఫుడ్ ఐటెమ్ ఆరోగ్యంగా ఉండటానికి చక్కటి మార్గం. నెయ్యిలో అనేక రకాలు ఉన్నాయి.

నెయ్యి చాలా ఆరోగ్యకరమైన ఆహారం. అందుకే భారతీయ వంటకాల్లో నెయ్యి ది ప్రధానపాత్ర ఉంటుంది. పాల ఉత్పత్తుల నుంచి తయారైన నెయ్యి... మంచి కొవ్వు ఇది. నెయ్యిని ఆయుర్వేదంలో ఎన్నో ఔషధ ప్రయోజనాలు కలిగి ఉన్నాయి. 

నెయ్యిని... ఈజిప్టులో 'సామ్నా', మధ్యప్రాచ్యంలో 'సామ్న్', ఇరాన్‌లో 'రోగన్', ఉగాండాలో 'సములి' అని పిలుస్తారు. ఈ రిచ్ న్యూట్రీషియన్ ఫుడ్ ఐటెమ్ ఆరోగ్యంగా ఉండటానికి చక్కటి మార్గం. నెయ్యిలో అనేక రకాలు ఉన్నాయి.

నెయ్యి రకాలు
రెగ్యులర్ నెయ్యి : ఆవు లేదా గేదె పాలనుంచి వెన్నను తీసి.. నెయ్యిని తయారు చేయడం మొదటి పద్ధతి. 
A2 నెయ్యి : గిర్ ఆవు, ఎరుపు సింధీ వంటి దేశీ భారతీయ ఆవుల నుండి తయారు చేసిన నెయ్యి. 
బిలోనా నెయ్యి: అత్యంత సంప్రదాయ పద్ధతిలో తయారుచేసిన నెయ్యి. ఇది దేశీ ఆవు పాలతో చేసిన స్వచ్ఛమైన నెయ్యి. 

నెయ్యిలోని పోషకాలు...
ఐదు గ్రాముల నెయ్యిలో.. 44.8 కిలో కేలరీలు ఉంటాయి. జీరో గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. జీరో శాతం పిండి పదార్థాలు ఉంటాయి. 4.9 గ్రాముల కొవ్వులు ఉంటాయి. 
దీంతోపాటు నెయ్యిలో అవసరమైన కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. విటమిన్ ఎ, ఇ, కె 2, డి, కాల్షియం, సిఎల్‌ఎ, ఒమేగా -3 వంటి ఖనిజాలు ఉంటాయి. 

నెయ్యి ఉపయోగాలు :  ఒక గ్లాసు పాలలో ఒక చెంచా నెయ్యి, నల్ల మిరియాలు, పసుపు కలిపి తాగితే జీర్ణవ్యవస్థను శుభ్రపరుస్తుంది. ఇది మలబద్ధకాన్ని నిరోధిస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థకు కావాల్సిన బూస్ట్ ఇస్తుంది.
నెయ్యి జీవక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇది మానసిక స్థితిని బాగా మెరుగుపరుస్తుంది. అదే సమయంలో శక్తిని పెంచుతుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ ఉంటుంది. ఇది జీర్ణాశయంలోని బ్యాక్టీరియాకు ప్రోబయోటిక్ ఆహారంగా పనిచేస్తుంది. నెయ్యిలో విటమిన్ కె 2 ఉంది, ఇది ఎముకలు కాల్షియం గ్రహించడానికి,  కీళ్ల నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.

పసుపు, నల్ల మిరియాలు కలిపి నెయ్యిని తీసుకుంటే మంట, ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మంచి నిద్రకు సహాయపడుతుంది. సహజసిద్ధమైన  నెయ్యి  మీ చర్మాన్ని మెరుస్తుంది. నెయ్యిలోని CLA ట్యూమర్ లను తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. రక్తంలో చక్కెరలను స్థిరీకరిస్తుంది.  ఆకలిని ప్రేరేపించడంలో సహాయపడుతుంది. 

1 చెంచా లేదా 5 గ్రాముల నెయ్యిలో అధిక కేలరీలు, కొవ్వు ఉంటుంది. నెయ్యితో ఆహారాన్ని వండడం కూరలు, సబ్జీలు, పప్పులు వండడానికి ఉత్తమమైన పద్ధతుల్లో ఒకటి, అయితే మధుమేహం, స్థూలకాయం, అధిక కొలెస్ట్రాల్, గుండె రోగులు, పిసిఒఎస్ వంటి ఆరోగ్య పరిస్థితులు ఉన్న వాళ్లు నెయ్యి తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. 

ఎంత నెయ్యి తీసుకోవాలని తెలిసి ఉండాలి. ఆరోగ్యకరమైన చురుకైన నిశ్చల జీవనశైలిని నడిపించే వ్యక్తులతో రోజుకు 3-4 చెంచాల నెయ్యిని తీసుకోవచ్చు. పెరిగిన రోజువారీ కేలరీలతో, మీరు తదనుగుణంగా నెయ్యి తీసుకోవడం పెంచవచ్చు.

click me!