రన్నింగ్ అనేది చాలా శక్తిని వాడాల్సిన పని. దీనికి మీరు నిర్ధిష్ట సమయంలో నియమిత దూరం పరిగెత్తాలనుకున్నప్పుడు మీరు మరింత శక్తిని పెట్టాల్సి ఉంటుంది. ఈ శక్తిని ఉత్పత్తి చేయడం కోసం శరీరానికి మరింత ఆక్సీజన్ సరఫరా అవసరం అవుతుంది. అయితే దీనికోసం మీరు రిలాక్స్ డ్ గా ఉండాలి. ముఖ కండరాలు బిగించి, సీరియస్ గా ఉండడం వల్ల ఆ ప్రభావం మొత్తం శరీరం మీద పడుతుంది. భుజాలు, వీపు, చేతులు వీటి ప్రభావాానికి లోనవుతుంది. దీంతో లెగ్ స్ట్రైడ్, చేతుల స్వింగ్ తగ్గుతుంది. దీనివల్ల వేగం తగ్గుతుంది. అంతేకాదు గాయాలు అయ్యే అవకాశాలు, పడిపోయే ప్రమాదమూ ఉంది.