Dark spots removal: ముఖంపై నల్లమచ్చలు పోవాలంటే ఇలా చేయండి..

Published : Apr 23, 2022, 01:12 PM IST

Dark spots removal: ముఖంపై ఏర్పడే నల్లని మచ్చలను తొలగించేందు మార్కెట్ లో దొరికే క్రీములు, స్కిన్ లోషన్లు, సోప్ ల కంటే హోమ్ రెమిడీస్ చిట్కాలే బాగా ఉపయోగపడతాయి.   

PREV
16
Dark spots removal: ముఖంపై నల్లమచ్చలు పోవాలంటే ఇలా చేయండి..

Dark spots removal: వాతావరణ మార్పుల కారణంగా చర్మం దెబ్బతినే అవకాశం ఉంది.  ముఖ్యంగా వాతావారణ కాలుష్యం వల్ల ముఖంపై మచ్చలు, మొటిమలు ఏర్పడుతుంటాయి. మరికొంతమందికైతే వయసు పెరుగుతున్న కొద్దీ ముఖంపై మచ్చలు వస్తుంటాయి. అయితే ఈ మచ్చలకు కారణం ఏదైనా.. ఇవి ఏర్పడటం వల్ల అందం దెబ్బతినే ప్రమాదం ఉంది. అయితే కొన్ని హోం రెమిడీస్ ద్వారా ఈ మచ్చలకు చెక్ పెట్టొచ్చు. అవేంటంటే.. 

26

కలబంద (Aloe vera) .. కలబందలో ఎన్నో ఔషదగుణాలు దాగున్నాయి. ఇది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ముఖంపై ఉండే మొటిమలను, నల్లని మచ్చలను కూడా వదిలించగలదు. ముఖంపై మచ్చలు పోవాలంటే.. కలబంద జెల్ ను తీసుకుని ముఖానికి అప్లై చేయాలి. తర్వాత ముఖాన్ని కాసేపు నెమ్మదిగా మసాజ్ చేయాలి. ఇలా రెగ్యులర్ గా చేస్తే ముఖంపై ఉండే మచ్చలు పోతాయి. 

36

గుడ్డు..  ముందుగా ఒక గుడ్డును తీసుకుని దానిలోని పచ్చసొనను పక్కన పెట్టేయండి. గుడ్డులోని వైట్ ను మాత్రమే ముఖానికి పట్టించండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత శుభ్రంగా కడగండి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేస్తే చాలా తొందరగా మచ్చలు వదిలిపోతాయి. 

46

టొమాటోలు.. టొమాటోలల్లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ముఖాన్ని అందంగా తయారుచేయడమే కాదు నల్లని మచ్చలను కూడా పోగొడతాయి. టొమాటో పేస్ట్ ను వారానికి రెండు మూడు సార్లు ముఖానికి పట్టించి మర్దన చేస్తే ఫలితాలను తొందరగా వస్తాయి. 
 

56

నిమ్మరసం.. నిమ్మకాయల్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడానికి ఎంతో సహాయపడుతుంది. అంతేకాదు ఇది ముఖంపై ఉండే నల్లని మచ్చలను కూడా పోగొడుతుంది. ముఖం మీద ఎక్కెడెక్కడ నల్ల మచ్చలు ఉన్నాయో ఆ ప్లేసెస్ లో నిమ్మరసాన్ని అప్లై చేయండి. ఆ తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయండి. ఇలా చేస్తే మచ్చలు చాలా ఫాస్ట్ గా వదిలిపోతాయి. 
 

66

పెరుగు.. పెరుగులో ఎన్నో పోషకాలుంటాయి. అవి చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడంతో పాటుగా కొత్త చర్మకణాలను పుట్టించడానికి సహాయపడతాయి. ముఖంపై ఉండే మచ్చలను, ముడతలను తొలగించడానికి కూడా పెరుగు ఎంతో ఉపయోగపడుతుంది. 

click me!

Recommended Stories