Car Smell: కారులో దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?

Published : Feb 13, 2025, 01:53 PM IST

చాలా మంది కారు దుర్వాసన రాకుండా ఉండేందుకు మార్కెట్లో దొరికే సువాసనను అందించే ఖరీదైన ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటారు. కానీ.. అవి ఖరీదు గా ఉండటమే కాదు.. వాటి వాసన కూడా అందరికీ నచ్చదు.

PREV
14
Car Smell: కారులో దుర్వాసన పోవాలంటే ఏం చేయాలి?
car smell

ఈ రోజుల్లో కారు లేనివాళ్లు చాలా అరుదు అని చెప్పొచ్చు. ఇంట్లో ఒక కారు ఉండటం కూడా ఒక నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ఇంటి నుంచి మరో ప్రదేశానికి వెళ్లాల అంటే కారు తప్పనిసరి అయిపోయింది. అయితే... మనం  కారును మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. మనం, మన ఇంటిని  శుభ్రం చేసుకున్నట్లే.. కారు కూడా చేసుకుంటూ ఉండాలి. లేకపోతే.. కారులో దుర్వాసన ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. చాలా మంది కారు దుర్వాసన రాకుండా ఉండేందుకు మార్కెట్లో దొరికే సువాసనను అందించే ఖరీదైన ఫ్రెషనర్స్ వాడుతూ ఉంటారు. కానీ.. అవి ఖరీదు గా ఉండటమే కాదు.. వాటి వాసన కూడా అందరికీ నచ్చదు.

24

అంతేనా...ఆ ఫ్రెషనర్స్ అయిపోయినా వెంటనే మార్చకపోవడం వల్ల కూడా మళ్లీ కారు దుర్వాసన రావడం మొదలుపెడుతుంది. అలా కాకుండా చాలా తక్కువ ఖరీదుతో , మంచి సువాసన రావాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం..

34
driving

సబ్బుతో కారులో దుర్వాసనకు చెక్...

మీరు స్నానం చేయడానికి ఉపయోగించే సబ్బుతో కారు నుండి దుర్వాసనను తొలగించవచ్చు. దీని కోసం, మీరు రూ. 10 విలువైన సబ్బును కొనుగోలు చేసి, దానిని ప్యాకెట్ నుండి తీసి డ్రైవింగ్ సీటు కింద లేదా మీ కారులో ఎక్కడైనా ఉంచండి.  సబ్బు ఉంచిన తర్వాత కారు డోర్లు, విండోస్ మొత్తం మూసి ఉంచాలి. అలా చేసిన తర్వాత కారు డోర్ తీయడం వల్ల  కారు మొత్తం సువాసనలు వెద జల్లుతుంది. మీకు నచ్చిన ఫ్లేవర్, ఎక్కువ సువాసన వచ్చే సబ్బు ఎంచుకోవడం మంచిది.

44

కర్పూరం..

దీనితో పాటు, మీరు కాటన్ వస్త్రంలో కర్పూరం లేదా నాఫ్తలీన్ బంతులను కూడా నింపవచ్చు. ఆపై దానిని మీ కారు ముందు వేలాడదీయండి. కారు మంచి వాసన వచ్చేలా చేయడానికి ఇది ఖరీదు తక్కువ. కారులో దుర్వాసన రాకుండా కూడా చేస్తుంది.

click me!

Recommended Stories