ఈ ఒక్క ఆకుతో.. ఇంట్లో చెద పురుగులు లేకుండా పోతాయి

First Published | Jan 3, 2025, 2:22 PM IST

ఇంట్లో చెద పురుగులు ఉంటే ఇంట్లో ఉండే మంచాలు, కట్టె సోఫాలు, దర్వాజలు ఒక్కొక్కటిగా నాశనమవుతాయి. అయితే ఈ చెదలును ఒక్క ఆకుతో పూర్తిగా లేకుండా చేయొచ్చు. 

ways to get rid of termites in your home

ఇంటిని ఎంత నీట్ గా ఉంచుకున్నా, శుభ్రం చేసినా పురుగులు, కీటకాలు కనిపిస్తూనే ఉంటాయి. ఇవి ఇంట్లో ఎక్కడెక్కడో దాక్కుని ఇంటిని నాశనం చేస్తుంటారు. ఇలాంటి వాటిలో చెద పురుగులు ఒకటి. ఇవి చూడటానికి చిన్నగానే ఉన్నా..  ఇవి ఇంట్లోకి వస్తే మాత్రం ఫర్నిచర్ నుంచి గోడల వరకు ప్రతిదాన్ని నాశనం చేస్తాయి.

ఇవి తలుపులు, కిటికీలు అంటూ చెక్క వస్తువులను, బుక్కులను పనికిరాకుండా చేస్తాయి. వీటివల్ల ఎంతో ఖరీదైన ఫర్నీచర్లు నాశనమైన సందర్భాలు కూడా ఉంటాయి. అందుకే వీటిని ఇంట్లో లేకుండా చేయడానికి ఖరీదైన మందులను వాడుతుంటారు. అయినా ఇవి ఎక్కడో ఒకచోట నుంచి వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఇవి పూర్తిగా నాశనం కావు. 

కానీ ఈ చెదపురుగులను పొగాకు సహాయంలో పూర్తిగా ఇంట్లో లేకుండా చేయొచ్చు తెలుసా? నిజానికి పొగాకు ఆరోగ్యానికి మంచిది కాదు. కానీ ఇది ఇంట్లో ఒక పెద్ద సమస్యను తగ్గించడానికి మాత్రం సహాయపడుతుంది. పొగాకు సహాయంతో చెదపురుగుల బెడద నుంచి బయటపడొచ్చు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్ నెట్ లో తెగ వైరల్ అవుతోంది. మరి ఈ పొగాకును ఉపయోగించి ఇంట్లో చెద పురుగులు లేకుండా ఎలా చేయొచ్చో మనమూ ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


TOBACCO


పొగాకుతో చెద పురుగులను ఎలా తరిమికొట్టాలి?

ఇంట్లో చెద పురుగులు లేకుండా చేసేందుకు ముందుగా పొగాకు ఆకులను తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి. వీటిని జిప్ లాక్ ఉన్న బ్యాగుల్లో నింపండి. వీటికి చిన్న చిన్న రంధ్రాలను కూడా చేయండి. దీంతో పొగాకు వాసన బయటకు వస్తుంటుంది.

అయితే చెద పురుగులకు పొగాకు వాసన అస్సలు నచ్చదు. అలాగే ఈ వాసనకు తట్టుకోలేవు. దీంతో ఈ వాసన చూసిన వెంటనే చెదలు చనిపోతుంది. ఈ విధంగా మీరు చెద పురుగుల బెడద నుంచి బయటపడొచ్చు. 
 

tobacco

పొగాకును ఎలా ఉపయోగించాలి? 

ఇంట్లో చెదలు లేకుండా చేయడానికి జిప్ లాక్ బ్యాగుల్లో పొగాకును నింపి వాటిని ఇంట్లో అక్కడక్కడ పెట్టండి. అంటే మీ ఇంట్లో చెదలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అక్కడ పెట్టండి. అయితే ఈ బ్యాగులను మీరు నెలకోసారి మార్చాల్సి ఉంటుంది. 
 

చెద పురుగులు లేకుండా చేసే ఇంటి చిట్కాలు

పొగాకుతోనే కాకుండా ఇంట్లో ఉండే కొన్ని వస్తువులతో కూడా ఇంట్లో చెదలు లేకుండా చేయొచ్చు. ఇందుకోసం వెల్లుల్లి, వేప ఆకుల ద్రావనం బాగా సహాయపడుతుంది. దీన్ని చెదలు ఉన్న చోట స్ప్రే చేయాలి. వరుసగా కొన్ని రోజుల పాటు ఫర్నిచర్ నుంచి గోడల వరకు ప్రతిచోటా స్ప్రే చేస్తూ ఉంటే చెద పురుగుల నుంచి విముక్తి పొందుతారు.

Latest Videos

click me!