తొందరగా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఎండుద్రాక్ష, బెల్లం నీటిని ఇలా తీసుకోండి..

Published : Mar 10, 2022, 10:00 AM IST

వెయిట్ పెరగడం ఎంతో ఈజీ.. కానీ బరువు తగ్గడం మాత్రం చాలా కష్టం. ఇది అందరికీ తెలుసు. వెయిట్ తగ్గే ప్రాసెస్ లో ఏ చిన్న మిస్టేక్ చేసినా.. మీరు పడ్డ కష్టానికి ఫలితం మాత్రం దక్కదు. క్రమం తప్పకుండా వ్యాయామం, హెల్తీ డైట్ తో పాటుగా మరికొన్ని చిట్కాలను పాటిస్తే ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎండు ద్రాక్ష, బెల్లం నీటితో ఈజీగా వెయిట్ లాస్ అవుతారని నిపుణులు చెబుతున్నారు.

PREV
18
తొందరగా బరువు తగ్గాలనుకుంటున్నారా?అయితే ఎండుద్రాక్ష, బెల్లం నీటిని ఇలా తీసుకోండి..

ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న కామన్ ప్రాబ్లమ్ అధిక బరువు. ఈ సమస్యతో చాలా మంది అనేక అనారోగ్య సమస్యను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ సమస్య నుంచి తొందరగా  బయటపడటానికి ప్రతి రోజూ వ్యాయామం, హెల్తీ డైట్ ను పాటిస్తున్నారు. అయితే వీటితో పాటుగా కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే కూడా ఈజీగా బరువు తగ్గొచ్చంటున్నారు నిపుణులు. అందులో ఎండుద్రాక్ష, బెల్లం నీరు వెయిట్ లాస్ అవ్వడానికి ఎంతో ఉపయోగపడతాయి. 

28

బెల్లం, ఎండుద్రాక్ష ఎలా ఉండాలి:  కొన్ని గోరువెచ్చని నీటిలో 4 నుంచి 5 ఎండు ద్రాక్షలను రాత్రి మొత్తం నానబెట్టాలి. ఉదయం పూట ఒక గ్లాస్ నీటిలో 5 గ్రాముల బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి వేయండి. ఆ తర్వాత పరిగడుపున కొంచెం బెల్లం తినండి. ఆ తర్వాత బెల్లాన్ని నానబెట్టిన నీళ్లను తాగండి. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల మీ జీవక్రియ వేగంగా పనిచేస్తుంది. దీంతో మీరు తొందరగా వెయిట్ లాస్ అవుతారు. 

38

అలాగే .. కాస్త పెరుగు తీసుకుని అందులో 4 నుంచి 5 ఎండుద్రాక్షలను నానబెట్టి భోజనం తర్వాత తిన్నా తొందరగా కేలరీలను కరిగించొచ్చు. పెరుగులో ఎండుద్రాక్షలను నానబెట్టి తినడం వల్ల ప్రేగు ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ జీర్ణక్రియ ను మెరుగుపరుస్తుంది. 

48

ఎండుద్రాక్ష, బెల్లం ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎన్నో పోషకాలున్న సూపర్ ఫుడ్ గా దీనిని నిపుణులు వర్గీకరించారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అధిక రక్తపోటు సమస్య తగ్గుతుంది. అలాగే శ్వాసకోశ వ్యవస్థను కూడా శుభ్రపరుస్తుంది. అంతేకాదు ఇవి ఎముకలను బలంగా మారుస్తుంది. అలాగే ఇది జీవక్రియను పెంచి కిలోల బరువు తగ్గేందుకు ఎంతగానో సహాయపడుతుంది.  ఎండుద్రాక్షలను, బెల్లాన్నికలిపి తినడం వల్ల బరువు తగ్గించే ప్రక్రియ వేగవంతం అవుతుంది. 

58

బెల్లం ప్రయోజనాలు: బెల్లంలో మాంగనీస్, మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, పొటాషియం, జింక్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చక్కెర మాదిరి బెల్లం కేలరీలను కలిగి ఉండదు. దీన్ని తింటే బరువు పెరుగుతామన్న భయం అసలే ఉండదు. ప్రతిరోజూ బెల్లాన్ని తింటే ఎన్నో విటమిన్లు, ఖనిజాలు మెండుగా లభిస్తాయి. 

68

బరువు తగ్గడంలో బెల్లం ఎలా సహాయపడుతుంది:  బెల్లంలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. 20 గ్రాముల బెల్లంలో 38 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఇది Natural sweetener electrolyte levelని సమతుల్యం చేయడానికి ఎంతో సహాయపడుతుంది. అలాగే శరీరంలో నీరు నిల్వ ఉండకుండా చేయడానికి ఎంతో సహాయపడుతుంది. కానీ చాలా మంది  బెల్లం తినడాన్ని తినడానికి ఇష్టపడరు. దీని వల్లే మీరు బరువు తగ్గే ప్రాసెస్ దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. 

78

ఎండుద్రాక్ష పోషకాలు మరియు ప్రయోజనాలు: ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిని తినడం వల్ల మీ కడుపు ఎక్కువ సేపు ఫుల్ గా ఉండేలా చేస్తుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది బెస్ట్ స్నాక్స్ గా ఉపయోగపడుతుంది. ఈ ఎండుద్రాక్షల్లో సహజ చక్కెరలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. అలాగే ఇనుము, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవి జీవక్రియను పెంచడానికి ఎంతో సహాయపడతాయి. అలాగే బరువు తగ్గే ప్రసెస్ ను వేగవంతం చేస్తాయి. కాబట్టి మీరు మీ రోజు వారి ఆహారంలో వీటిని చేర్చండి. 
 

88

వెయిట్ లాస్ అవుతారని బెల్లాన్ని, ఎండుద్రాక్షలను మోతాదుకు మించి అస్సలు తినకూడదు. వీటిని మోస్తారుగా తీసుకుంటేనే మీరు బరువు తగ్గుతారు. ఈ రెండు పద్దతుల్లో ఏ ఒక్కదాన్ని పాటించినా మీరు వెయిట్ లాస్ అవుతారు. అయితే డయాబెటిస్ లేదా ఇతర జబ్బులతో మెడిసిన్స్ ను వాడే వాళ్లు ఈ పద్దతులను పాటించే ముందు వైద్యులను సంప్రదించడం ముఖ్యం. 

click me!

Recommended Stories