సేవింగ్స్ అకౌంట్‌లోని డబ్బుపై పన్ను ఉండదు. కానీ ఆ డబ్బుపై బ్యాంక్ ఇచ్చే వడ్డీ ఆదాయంపై పన్ను విధిస్తారు. అయితే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80TTA కింద, అర్హులైన వారికి సేవింగ్స్ అకౌంట్ వడ్డీపై కొంత మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు సెక్షన్ 80TTB కింద అదనపు పన్ను ప్రయోజనం ఉంటుంది.
కాబట్టి, సేవింగ్స్ అకౌంట్‌లో ఎక్కువ డబ్బు ఉన్నంత మాత్రాన పన్ను పడుతుందనేది అపోహ మాత్రమే. కానీ, మీ ఆదాయానికి అనుగుణంగా అన్ని లావాదేవీలు చట్టబద్ధంగా, సరైన పత్రాలతో ఉండటం, అలాగే ఆదాయపు పన్ను రిటర్న్స్‌లో సరిగ్గా చూపించడం చాలా ముఖ్యం. ఇలా చేస్తే అనవసరమైన పన్ను చిక్కుల నుంచి సులభంగా బయటపడొచ్చు.