మాములుగా స్కిన్ టోన్ కి సరిపోయే లిప్ స్టిక్ వాడినప్పుడే ఆడవారి అందం మరింత మెరుస్తుంది. అయితే సీజన్ మారేకొద్దీ.. లిప్ కాస్మెటిక్స్‌లో ట్రెండ్స్ మారుతుంటాయి. మరి చలికాలంలో ఎలాంటి లిప్ స్టిక్స్ వాడితే బాగుంటుంది. అవి మీ అందాన్ని ఎలా పెంచుతాయో ఇప్పుడు చూద్దాం.
చలికాలంలో సరైన లిప్ స్టిక్ షేడ్ ని ఎంచుకోవడం వల్ల మేకప్ లుక్ ను మరింత ఎలివేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం బోల్డ్ బెర్రీ టోన్లు చాలా ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇవి ఏ లుక్‌కి అయినా మరింత గ్లామర్ ను జోడిస్తాయి. ఈ షేడ్స్ ఈ సీజన్‌లో బోల్డ్ స్టేట్‌మెంట్‌లను చేయడానికి సరైనవని కాస్మోటిక్ నిపుణులు చెబుతున్నారు.