పిల్లలు మట్టిని ఎక్కువగా తింటే ప్రమాదకరం.. మాన్పించేందుకు ఇలా చేయండి..

First Published | Jun 17, 2022, 4:58 PM IST

చిన్నపిల్లలన్నాకా మట్టిని తినడం చాలా సహజం. కానీ మట్టి వారి ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. దీనివల్ల పిల్లలు అనారోగ్యం బారిన పడొచ్చు. అందుకే వీలైనంత తొందరగా పిల్లల్లో ఈ అలవాటును మాన్పించాలి. 
 

kids

నిపుణుల అభిప్రాయం ప్రకారం..  పిల్లలు మట్టిని తినడం సాధారణ విషయం. అయితే ఎక్కువ మట్టిని తినడం వల్ల పిల్లల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుంది. మట్టిని తినే అలవాటు కూడా ఒక వ్యాధిలాంటిదే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీన్నే పైకా అంటారు. ఇది శిశువు కడుపులో పురుగులను పుట్టించేందుకు  కారణమవుతుంది.

kids

ఒకవేళ పిల్లలు మట్టిని తింటున్నట్లయితే వారికి ఆకలి పూర్తిగా మందగిస్తుంది. దాంతో మీ పిల్లలు మీరు పెట్టే ఫుడ్ ను అస్సలు తినరు. అందుకే ఈ అలవాటును తొందరగా మాన్పించాలి. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..


అరటి

అరటిపండు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది పిల్లల ఆరోగ్యానికి అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటుంది. అరటిపండ్లు తినడం వల్ల పిల్లలు బరువు కూడా పెరుగుతారు. అలాగే వారి శారీరక ఎదుగుదలకు కూడా ఇది సహాయపడుతుంది. దీనికోసం అరటి పండ్లను తేనె, పాలలో కలిపి బిడ్డకు ఇవ్వాలి.
 

అరటిపండ్లు, తేనె, పాలను కలిపి పిల్లలకు పెడితే.. మట్టిని తినాలన్న కోరిక పుట్టదు. ఇది మీ బిడ్డ కడుపును నిండుగా ఉంచుతుంది. దీంతో మీ పిల్లలు మట్టి జోలికి కూడా పోరు. 

లవంగాల నీళ్లను ఇవ్వండి

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. లవంగం నీరు కూడా పిల్లలు మట్టి తినే అలవాటును వదిలించుకోవడానికి సహాయపడుతుంది. దీనికోసం లవంగాలను నీళ్లలో మరిగించి చల్లారాక వారికి ఇవ్వాలి. ఒకవేల ఆ నీళ్లను తాగకపోతే.. తేనెను ఇవ్వండి.  దీనిని తరచుగా తింటే.. మీ పిల్లలు మట్టిని తినే సాహసం చేయరు. 

Ajwain water

పిల్లల మట్టిని తినే అలవాటును వదిలించడానికి  ప్రతి రోజూ రాత్రి పడుకునేటప్పుడు వారికి Ajwain waterను తాగించండి. ఈ నీళ్లు మట్టిని తినాలి అన్న కోరికలను తగ్గిస్తాయి. అలాగే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా మట్టిని తినాలనే కోరికలను చంపేస్తాయి. 

Latest Videos

click me!