Health Tips: ఆరోగ్యంగా ఉంటేనే అందం, ఆనందం. మరి ఆరోగ్యంగా ఉండాలంటే హెల్తీఫుడ్స్ నే తినాల్సి ఉంటుంది. మరి ఏ ఫుడ్ మనల్ని ఆరోగ్యంగా ఉంచుతుందో తెలుసుకోవాల్సి అవసరం చాలా ఉంది.
ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలనే కోరకుంటారు. ఇందుకోసం ఎలాంటి ఆహారాలను తినాలి, ఎలాంటి జీవన శైలిని పాటించాలి వంటి విషయాలను తెలుసుకుంటారు. అయితే మనల్ని ఆరోగ్యంగా ఉంచడంలో వ్యాయామం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. అయితే సీజనల్ వ్యాధులు కానీ, ఇతర రోగాలు కానీ మనకు సోకకూడదంటే ఆహారం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు ఆరోగ్య నిపుణులు. శరీరానికి పోషకాలందించే, రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలను తీసుకోవాలి. ఆరోగ్య నిపుణురాలైన ముఖర్జీ ఆరు ఇన్ స్టాగ్రామ్ వేదికగా మెరుగైన జీవనశైలి చిట్కాలు తెలియజేశారు. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
27
తినే దానిపట్ల జాగ్రత్తగా ఉండాలి..
ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలంటే జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలను తినడం పూర్తిగా మానుకోనుకోవాలి. ఇవి నోటికి రుచిగా అనిపించినా.. ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తాయి. అందుకే వీటికి బదులుగా ఆరోగ్యకరమైన ఆహారాలనే తినాల్సి ఉంటుంది.
37
డీటాక్స్ జ్యూస్
డీటాక్స్ రోగనిరోధక శక్తిని పెంచడమే కాదు శరీరానికి హాని చేసే వ్యర్థాలను బయటకు పంపుతుంది. అంతేకాదు శరీర పనితీరును మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా దీనివల్ల ఎన్నో దీర్ఘకాలిక రోగాలు తగ్గుతాయి. ఇందుకోసం బీట్ రూట్ జ్యూస్, టొమాటో జ్యూస్, పుచ్చకాయ రసం, క్యాబేజీ జ్యూస్, సెలేరీ వంటి ముడి జ్యూస్ ను డీటాక్స్ గా తీసుకోవాలి. వీటితో పాటుగా తాజా పండ్ల రసాలను, కూరగాయల రసాలను తీసుకోవచ్చు.
47
ప్రోటీన్
మన శరీరానికి ప్రోటీన్ చాలా అవసరం. ప్రోటీన్ తోనే శరీరం శక్తివంతంగా ఉంటుంది. అంతేకాదు రక్తం ద్వారా శరీరమంతా ఆక్సిజన్ ను తీసుకెళుతుంది. ప్రోటీన్ అనారోగ్యాన్ని కలిగించే వాటికి వ్యతిరేకంగా ప్రతిరోధకాలను తయారుచేస్తుంది. ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. శరీర కణాలను కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకే ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువ మొత్తంలో తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
57
బరువును నియంత్రణలో ఉంచుకోవాలి
శరీర బరువు అధికంగా ఉంటే కూడా ఎన్నో రకాల రోగాలొచ్చే అవకాశం ఉంది. ఊబకాయం లేదా ఓవర్ వెయిట్ వల్ల హార్ట్ ఎటాక్, కంటి సమస్యలు, స్ట్రోక్, నరాలు దెబ్బతినడం, మూత్రపిండాలు దెబ్బతినడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.
67
డిన్నర్ టైమింగ్స్
పోషకాహారాన్ని తినడమే కాదు.. తినడానికంటూ ఒక టైం ను సెట్ చేసుకోవాలంటున్నారు నిపుణులు. ముఖ్యంగా డిన్నర్ ను రోజు రాత్రి 7 గంటలకు తినాలని సలహానిస్తున్నారు.
77
ఒత్తిడిని తగ్గించుకోవాలి
ఒత్తిడి చాలా సమస్యగా భావించినప్పటికీ.. ఇది ఆరోగ్యాన్ని ఎన్నో విధాల దెబ్బతీస్తుంది. ఎక్కువ కాలం పాటు ఒత్తిడికి గురైనట్టైతే గుండెపోటు, షుగర్ వ్యాధి, ఊబకాయం, అధిక రక్తపోటు వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంది.