చలికాలంలో ఒక కప్పు వేడి వేడి టీ తాగితే వచ్చే ఆనందమే వేరు. ఈ అలవాటు చాలా మందికి ఉంటుంది. వీళ్లకు ఉదయం టీ తాగనిదే ఏ పనీ తోచదు. అంతేకాదు టీకి అలవాటు పడిన వారు సాయంత్రం వేళ కూడా కప్పు వేడివేడి టీ తాగుతుంటారు. టీ తాగకపోతే అసౌకర్యంగా, తలనొప్పిగా అనిపిస్తుంది. అందుకే ఏదిఏమైనా టీని ఖచ్చితంగా తాగుతుంటారు. కానీ సాయంత్రం వేళ టీ తాగడం మంచిదేనా? అసలు సాయంత్రం వేళ ఎవరు టీ తాగాలి? ఎవరు టీ తాగకూడదు? అన్న సంగతి తెలుసా?
సాయంత్రం టీ తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఒత్తిడిని తగ్గిస్తుంది: ఒత్తిడి మనం అనుకున్నంత చిన్న సమస్య అయితే కాదు. ఇది మానసిక ఆరోగ్యాన్నే కాకుండా శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. ఆరోగ్య నిపుణుల ప్రకారం.. సాయంత్రం కప్పు టీ తాగితే ఈ ఒత్తిడి తగ్గుతుంది. ఈ టీలో ఉండే ఎల్-థియనిన్ అనే అమైనో యాసిడ్ మన స్ట్రెస్ ను తగ్గించి మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది.
milk tea
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది: చాయ్ జీర్ణక్రియను మెరుగుపర్చడానికి బాగా సహాయపడుతుంది. అంతేకాదు ఇది మలబద్దకం సమస్యను తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.
యాంటీఆక్సిడెంట్ల మూలం: చాయ్ లో ఎన్నో రకాల యాంటీ ఆక్సిడెంట్లు మెండుగా ఉంటాయి. ఇవి మన శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. అలాగే ఎన్నో జబ్బులతో పోరాడే శక్తిని శరీరానికి అందిస్తాయి.
శక్తిని పెంచుతుంది: చాయల్ లో కెఫిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది అలసటను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. టీని తాగితే మీ ఒంట్లో శక్తి పెరుగుతుంది.
గుండె ఆరోగ్యం : క్రమం తప్పకుండా లిమిట్ లో టీ తాగితే గుండె జబ్బుల ప్రమాదం తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
milk tea
సాయంత్రం టీ తాగడం వల్ల కలిగే నష్టాలు
నిద్రకు భంగం: సాయంత్రం టీ తాగితే మీకు రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టదు. ఎందుకంటే చాయ్ లో ఉండే కెఫిన్ కంటెంట్ మీకు నిద్రపట్టకుండా చేస్తుంది. అందుకే నిద్రపోవడానికి కొన్ని గంటల ముందు టీ తాగకూడదు.
ఎసిడిటీ: సాయంత్రం టీ తాగడం వల్ల కొంతమందికి ఎసిడిటీ సమస్య వస్తుంది.
ఇనుము శోషణను నిరోధిస్తుంది: ఆరోగ్య నిపుణుల ప్రకారం.. చాయ్ లో టానిన్లు ఉంటాయి. ఇవి శరీరంలో ఇనుము శోషణకు అడ్డుగా ఉంటాయి.
పేలవమైన నోటి ఆరోగ్యం: చాయ్ ని ఎక్కువగా తాగితే పళ్లపై పసుపు పచ్చ మరకలు ఏర్పడతాయి.
ఈవినింగ్ ఎవరు టీ తాగాలి?
నైట్ షిఫ్టుల్లో పనిచేసే వ్యక్తులు: సాయంత్రం టీ నైట్ షిఫ్టుల్లో పనిచేసేవారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇవి వారికి నిద్రమబ్బు రాకుండా, మంచి శక్తివంతంగా ఉంచుతుంది.
ఎసిడిటీ లేదా గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారు: ఈ రోజుల్లో చాలా మందికి గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు ఉంటున్నాయి. అయితే వీళ్లు ఒకసారి తమ డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే సాయంత్రం టీ తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే మీకు రాత్రిపూట సరిగ్గా నిద్రపట్టకపోతే మాత్రం సాయంత్రం టీ తాగకపోవడమే మంచిది. ఎందుకంటే టీ మిమ్మల్ని ఎనర్జిటిక్ గా మారుస్తుంది. దీంతో మీకు రాత్రిపూట నిద్రపట్టదు. ఒకవేళ సాయంత్రం టీ తాగాలనుకుంటే సాయంత్రం 6 గంటలకంటే ముందే తాగాలి.
ఈవెనింగ్ టీని ఎవరు తాగకూడదు?
బరువు తగ్గాలనుకునేవారు : ఒకవేళ మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం సాయంత్రపు టీలో పాలు,పంచదార కలపకుండా చూసుకోండి.
సరిగ్గా ఆకలి కాకపోతే: కొంతమందికి అస్సలు ఆకలి వేయదు. ఇలాంటివారు సాయంత్రం వేళ టీని తాగకపోవడమే మంచిది. ఎందుకంటే టీ మీ ఆకలిని మరింత తగ్గిస్తుంది.
హార్మోన్ల సమస్యలు: ఆడవాళ్లకు హార్మోన్ల సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అయితే ఇలాంటి వారు డాక్టర్ ను సంప్రదించిన తర్వాతే సాయంత్రం టీ తాగాలి. అంతేకాదు మలబద్ధకం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు మరీ ఎక్కువగా ఉంటే సాయంత్రం టీ తాగకపోవడమే మంచిది.