రక్తదానం చేస్తే ఏమౌతుందో తెలుసా?

First Published Apr 9, 2024, 2:55 PM IST

రక్తం ఎంతో మందికి అవసరమవుతుంటుంది. రక్తం దానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలను కాపాడిన వారవుతారు.అయితే రక్తదానం చేయడం వల్ల మీ శరీరానికి ఏం జరుగుతుందో తెలుసా?
 

అవసరమున్న వారికి రక్తం దానం చేసిన వల్ల పుణ్యం దక్కుతుందంటారు పెద్దలు. రక్త దానం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. అయితే రక్తదానం చేయడం వల్ల మన శరీరం దెబ్బతింటుందని చాలా మంది భయపడుతుంటారు. దీనివల్ల చాలా మంది రక్తదానం చేయడానికి అస్సలు ముందుకు రారు. కానీ మీరనుకుంటున్నట్టు రక్తదానం చేయడం వల్ల అలాంటిదేమీ జరగదు. నిజానికి రక్తదానం వల్ల మీకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అవేంటంటే? 
 

ఐరన్ నియంత్రణలో ఉంటుంది

శరీరంలో ఇనుము స్థాయిలు ఎక్కువగా ఉండటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇనుము రక్త నాళాలను అడ్డుకుంటుంది. అలాగే గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు పెంచుతుంది. మీరు రక్తదానం చేయడం వల్ల మీ శరీరంలో ఐరన్ కంటెంట్ అదుపులో ఉంటుంది.
 

blood donation

కొత్త రక్తం 

రక్తదానం చేయడం వల్ల ఒంట్లో రక్తం తక్కువగా ఉంటుందని, దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని చాలా మంది అనుకుంటుంటారు. కానీ రక్తదానం చేయడం వల్ల  శరీరం సహజంగా కొత్త రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. దీంతో కొత్త రక్తం ఏర్పడుతుంది. 
 

blood donation


ఇమ్యూనిటీ 

మనం రక్తదానం చేసినప్పుడు, మన శరీరంలో కొత్త రక్త ప్లాస్మా ఏర్పడుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీంతో మీరు ఎన్నో అంటువ్యాధులు, ఇతర రోగాలకు దూరంగా ఉంటారు. కాబట్టి రక్తదానం మీ ఆరోగ్యాన్ని ఏమీ పాడు చేయదు. 
 


క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది

నేషనల్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అమెరికా ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. రక్తదానం చేసేవారికి క్యాన్సర్ వచ్చే అవకాశం తక్కువ. 

శరీర బరువును తగ్గిస్తుంది

శాన్ డియాగో విశ్వవిద్యాలయం నిర్వహించిన ఒక అధ్యయనంలో రక్తదానం చేయడం వల్ల శరీరంలో 600 నుండి 650 కేలరీలు ఖర్చవుతాయని, బరువు తగ్గారని కనుగొన్నారు. కాబట్టి రక్తదానం చెడ్డదేమీ కాదు. 
 

blood donation

రక్తదానం ఎవరు చేయకూడదు?  

గర్భిణులు, ఈ మధ్యే శస్త్రచికిత్స చేయించుకున్నవారు రక్తదానం చేయడానికి లేదు. అలాగే కొన్ని విదేశీ పర్యటనల నుంచి తిరిగి వచ్చినవారు, మాత్రలు ఎక్కువగా వేసుకునేవారు కూడా రక్తదానం చేయకూడదు. 

click me!