మీ జుట్టు పెరగాలా? అయితే ఇలా చేసేయండి

Published : Aug 04, 2023, 01:52 PM IST

చుండ్రు నుంచి వాతావరణ కాలుష్యం వరకు జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అయితే మీ జీవన శైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకుంటే జుట్టు రాలడం ఆగి తొందరగా పెరుగుతుంది.  

PREV
16
 మీ జుట్టు పెరగాలా? అయితే ఇలా చేసేయండి
hair care

నూటిలో ఏ ఒక్కరికో.. ఇద్దరికో నల్లని, ఒతైన, పొడవాటి  పుట్టు ఉంటుంది. ప్రస్తుతం హెయిర్ ఫాల్ తో బాధపడేవారు ఎక్కువయ్యారు. అయితే జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ఒత్తిడి, నెత్తి పరిశుభ్రత సరిగ్గా లేకపోవడం, పోషకాల లోపం, కొన్ని అనారోగ్య సమస్యలు వంటి ఎన్నో కారణాల వల్ల జుట్టు రాలుతుంది. నిపుణుల ప్రకారం.. కొన్ని పద్దతులతో  జుట్టు రాలడాన్ని తగ్గించొచ్చు. అంతేకాదు ఇవి మీ జుట్టు ఒత్తుగా పెరిగేందుకు కూడా సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

26
hair care

లావెండర్ ఆయిల్

లావెండర్ ఆయిల్ లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగున్నాయి. ఈ లావెండర్ ఆయిల్ జుట్టును పెంచడానికి,  చుండ్రును తొలగించడానికి, నెత్తిమీద దురద, ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం లావెండర్ ఆయిల్ ను జుట్టుకు అప్లై చేసి 15 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. లావెండర్ ఆయిల్ ఒత్తిడిని తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

36
hair care

కర్పూరం తులసి నూనె

కర్పూరం తులసి నూనె కూడా మన జుట్టుకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ నూనె జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. వెంట్రుకలు పొడుగ్గా పెరిగేందుకు సహాయపడుతుంది. ఇందుకోసం కర్పూరం తులసి నూనెను జుట్టుకు అప్లై చేసి మసాజ్ చేయాలి. 15 నిమిషాల తర్వాత మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి.

46
hair care

కలబంద జెల్

కలబంద జెల్ లో ఎన్నో ఔషదగుణాలు ఉన్నాయి. ఇది చుండ్రును పోగొట్టడంతో పాటుగా జుట్టు బాగా పెరిగేందుకు కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం అలోవెరా జెల్ ను తలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి.

56
hair care

మెంతులు

మెంతులు జుట్టు పెరిగేందుకు కూడా సహాయపడతాయి. ఇందుకోసం మెంతులను ముందు రోజు రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం వీటిని పేస్ట్ చేయాలి. దీనిలో sage flower, ఆకులు, పెరుగు, గుడ్డు, కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ వేసి బాగా కలపాలి. గంట తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేయాలి. 20 నిమిషాల తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.
 

66
hair care

ఉల్లిరసం

ఒకటి లేదా రెండు ఉల్లిపాయలను తీసుకుని పొట్టు తీసి శుభ్రం చేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి జ్యూస్ తీసుకోవాలి. ఈ జ్యూస్ ను తలకు, జుట్టుకు బాగా అప్లై చేయాలి. అరగంట తర్వాత ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు, మూడు సార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గి జుట్టు బాగా పెరగడం మొదలవుతుంది. 

click me!

Recommended Stories