ఈ పండ్ల తొక్కలతో తోమినా.. పచ్చ పళ్లు తెల్లగా అవుతాయి

First Published | Jan 7, 2025, 12:03 PM IST

పండ్ల తొక్కలు అవసరం రావు అనుకుంటాం కానీ.. వీటితో మనం ఎన్నో పనులను చేసుకోవచ్చు. ముఖ్యంగా వీటిని ఉపయోగించి పసుపు పచ్చని పళ్లను తెల్లగా తలతలలాడేలా చేయొచ్చు తెలుసా? 

yellow teeth

మన ముఖానికి నవ్వే అందం. ఆ నవ్వుకు తెల్లని పళ్లే ముఖం. తెల్లని దంతాలు మన అందాన్ని పెంచుతాయి. అలాగే నోటిని ఆరోగ్యంగా ఉంచుతాయి. కానీ ఈ రోజుల్లో చాలా మందికి పళ్లు పచ్చగా ఉంటాయి. పచ్చని పళ్లు మీ అందాన్ని తగ్గించడమే కాకుండా.. మీ నోటి ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. పళ్లను సరిగ్గా తోమకపోవడం, చెడు ఆహారపు అలవాట్లు, మాదకద్రవ్యాల వాడకం, సిగరేట్, ఆల్కహాల్ వంటి చెడు అలవాట్ల వల్ల పళ్లు పచ్చగా అవుతాయి. 

తొక్కలతో పచ్చ పళ్లు తెల్లగా అవుతాయి

మనం ఎన్నో రకాల పండ్ల తొక్కలను పారేస్తుంటాం. ఎందుకంటే ఇవి మనకు ఏ విధంగానూ ఉపయోగపడవని. కానీ పండ్ల తొక్కలతో ఎన్నో ఇంటి పనులను చేసుకోవచ్చు. అంతేకాదు వీటిని తింటే ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది. అంతేకాదు వీటిని ఉపయోగించి మనం పచ్చ పళ్లను తిరిగి తెల్లగా కూడా చేయొచ్చు. ఇంతకీ పచ్చ పళ్లను తెల్లగా చేయడానికి ఏ పండ్ల తొక్కలు ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 


అరటి తొక్క

అరటిపండు మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ పండు మనం బరువు తగ్గడానికి, బరువు పెరగడానికి రెండూ విధాలా ఉపయోగపడుతుంది. అంతేకాదు ఈ పండును తింటే వెంటనే ఎనర్జీ వస్తుంది. ఎన్నో అనారోగ్య సమస్యలకు కూడా దూరంగా ఉంటాం. అయితే చాలా మంది అరటి పండును తిని దాని తొక్కను మాత్రం పారేస్తుంటారు.

ఇది ఏం పనికి రాదని. కానీ అరటితొక్కతో పచ్చ పళ్లను తెల్లగా చేయొచ్చు. ఇందుకోసం అరటి తొక్క లోపలి భాగానికి నీటితో కలిపిన బేకింగ్ సోడా పేస్ట్ ను రాసి పళ్లకు రుద్దితే  నోరు శుభ్రపడుతుంది. దంతాలు తెల్లగా అవుతాయి. 
 

అరటి తొక్క ప్రయోజనాలు

అరటి తొక్కలో మాంగనీస్, పొటాషియం, మెగ్నీషియం వంటి ఎన్నో రకాల ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవన్నీ మన పళ్లను తెల్లగా మార్చడానికి సహాయపడతాయి. 

బేకింగ్ సోడా ప్రయోజనాలు

బేకింగ్ సోడాను మనం కేవలం వంటకే కాకుండా ఎన్నో రకాల పనులకు కూడా ఉపయోగిస్తాం. నిజానికి ఇది మంచి నేచురల్ స్క్రబ్బర్ గా కూడా పని చేస్తుంది. దీన్ని ఉపయోగించడం వల్ల పళ్లపై ఉన్న పొర నుంచి  పచ్చ మరకలు తొలగిపోతాయి. 
 

నారింజ తొక్క

నారింజ తొక్కను ఉపయోగించి కూడా మనం పచ్చ పళ్లను తెల్లగా చేయొచ్చు. ఇందుకోసం నారింజ తొక్క లోపలి భాగాన్ని పళ్లపై 2 నిమిషాల పాటు సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత  నీళ్లతో నోటిని కడుక్కోవాలి. ఇలా తరచుగా చేస్తే పళ్లపై ఉన్న పచ్చ మరకలు పూర్తిగా తొలగిపోతాయి. 

ఆరెంజ్ పీల్ ప్రయోజనాలు

నారింజ తొక్కల్లో విటమిన్ సి, లిమోనేన్ అనే సహజ సమ్మేళనం పుష్కలంగా ఉంటాయి. ఇవి మన నోటి నుంచి దుర్వాసనను పోగొట్టడానికి, దంతాలను తెల్లగా చేయడానికి సహాయపడతాయి. 

Latest Videos

click me!