ఈ ఒక్కదాంతో.. టైల్స్ కు అంటిన మురికంతా పోయి కొత్తవాటిలా మెరిసిపోతాయి

First Published | Jan 7, 2025, 11:28 AM IST

టైల్స్ అందంగా ఉన్నా.. ఇవి చాలా తొందరగా మురికిగా మారుతాయి. వీటికి సబ్బు, దుమ్ము, ధూళి మరకలు ఎక్కువగా పట్టుకుంటాయి. ఇలాంటి వాటిని జస్ట్ ఒక ద్రావణంతో సులువుగా పోగొట్టొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 

రోజూ ఇంటిని క్లీన్ చేసుకుంటుంటాం. కానీ టైల్స్ ను మాత్రం వారం లేదా పది రోజులకోసారి క్లీన్ చేసుకుంటుంటాం. నిజానికి టైల్స్ వల్ల ఇళ్లు మరింత అందంగా కనిపిస్తుంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది ఇంట్లో, బాత్ రూం, కిచెన్ అంటూ ఇంటి మొత్తం టైల్స్ నే వేయిస్తున్నారు. కానీ ఈ టైల్స్ చాలా తొందరగా మురికిగా అవుతాయి.

వీటిని అలాగే క్లీన్ చేయకుండా ఎక్కువ రోజులు వదిలేస్తే మాత్రం మురికి మొండి మరకలుగా అవుతాయి. ఇలాంటి వాటిని క్లీన్ చేయడం ఆడవాళ్లకు పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ కష్టపడకుండా.. చాలా సింపుల్ గా టైల్స్ కు పట్టిన మురికిని పోగొట్టొచ్చు. జస్ట్ ఒక్క ద్రావణంతో టైల్స్ ను క్లీన్ చేసి తలతలా మెరిపించొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి. 
 

క్లీనర్ కు కావల్సిన పదార్థాలు

మురికిగా మారిన టైల్స్ శుభ్రం చేయడానికి మార్కెట్ లో దొరికే వాటిని కాకుండా.. చాలా ఈజీగా మీరే ఇంట్లో ఒక ద్రావణాన్ని తయారుచేయొచ్చు. ఇందుకోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా ఉండదు.  టైల్ క్లీనింగ్ ద్రావణం కోసం12 కర్పూరం మాత్రలు, మీడియం సైజ్ ఆలం, 2-3 టీస్పూన్ల ఉప్పు, ఒక దాల్చినచెక్క, ముఖ్యమైన నూనె అవసరమవుతాయి. 


టైల్స్ క్లీనర్ ను ఎలా తయారు చేయాలి?

టైల్స్ ను ఈజీగా, కష్టపడకుండా శుభ్రం చేయడానికి ద్రావణాన్ని చాలా సింపుల్ గా తయారుచేయొచ్చు. ఇందుకోసం ముందుగా ఒక మిక్సీ జార్ ను తీసుకుని అందులో కర్పూరాలను, ఆలం, దాల్చిన చెక్క, ఉప్పు వేసి బాగా కలిపి మెత్తగా గ్రైండ్ చేయండి. అంతే టైల్స్ క్లీనర్ రెడీ అయినట్టే.

టైల్ క్లీనర్ ను ఎలా నిల్వ చేయాలి?

మీరు తయారుచేసిన టైల్స్ క్లీనర్ పౌడర్ ను ఎయిర్ టైట్ కంటైనర్ లో నిల్వ చేయండి.  మీరు ఈ క్లీనర్ ఉపయోగించాలంటే ముందుగా ఒక బకెట్ లో గోరువెచ్చని నీళ్లను తీసుకోండి. దీనిలో తయారుచేసి పెట్టుకున్న పొడిని 2 టీస్పూన్లు వేసి కలపండి. అలాగే ఈ వాటర్ లో మీకు నచ్చిన కొన్ని ముఖ్యమైన నూనెను 3-4 చుక్కలు వేసి కలపండి. దీంట్లో సాఫ్ట్ స్క్రబ్బర్ తో లేదా గుడ్డను ముంచండి.

టైల్స్ ను ఎలా శుభ్రం చేయాలి?

ద్రావణంలో ముంచిన  స్క్రబ్బర్ తో టైల్స్ ను పాలిష్ చేయండి. లేదా తుడవండి. మీరు ఇలా గనుక టైల్స్ ను క్లీన్ చేస్తే చాలా తక్కువ టైంలోనే టైల్స్ కు అంటిన మురికంతా పోయి తలతలా కొత్తవాటిలా కనిపిస్తాయి. గోడల టైల్స్ ను కూడా మీరు ఇలా క్లీన్ చేసుకోవచ్చు. 

టైల్స్ వాసన పోతుంది.

ఈ హోం మేడ్ క్లీనర్ ను వాడటం వల్ల టైల్స్ నుంచి వచ్చే వాసన కూడా పూర్తిగా తొలగిపోతుంది. అలాగే వాటి నుంచి మంచి వాసన వస్తుంది. ముఖ్యంగా ఈ ద్రావణం వాడకం వల్ల టైల్స్ కు అంటిని ఆయిల్, మసాలా దినుసుల మొండి మరకలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. 

సూక్ష్మక్రిముల నిర్మూలన 

చాలా మంది టైల్స్ ను చాలా రోజుల వరకు క్లీన్ చేయకుండా ఉంటారు. దీనివల్ల టైల్స్ పై క్రిములు, బ్యాక్టీరియాలు బాగా పేరుకుపోతాయి. అయితే మీరు తయారుచేసిన ఈ టైల్స్ క్లీనర్ తో శుభ్రం చేస్తే గనుక బ్యాక్టీరియా, క్రిములు నశిస్తాయి.
 

Latest Videos

click me!