బ్రకోలీ గురించి ఇటీవల బాగా వింటున్నాం. అయితే బ్రకోలీ ఇటలీకి చెందిన కూరగాయ. అదేవిధంగా క్యాప్సికం అంటే వెంటనే మనకు గుర్చొచ్చేది బెంగళూరు. బెంగళూరు నుంచి ఈ కూరగాయను వ్యాపారులు లోకల్ మార్కెట్లకు దిగుమతి చేసుకుంటారు. అయితే క్యాప్సికం ఒరిజనల్ దేశం వచ్చేసి అమెరికా. ఇది అమెరికాకు చెందిన కూరగాయ.
ఇక కేవలం ఇండియాకు చెందిన కూరగాయలు ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నారా? అవి వంకాయ, దొండకాయ, బీరకాయ, సొరకాయ, కాకరకాయ, ముల్లంగి, మొదలైనవి. ప్రపంచం వ్యాపార పరంగా అభివఈద్ధి చెందడం ప్రారంభించినప్పటి నుంచి దేశ విదేశాల్లో ఉన్న వస్తువులు, కూరగాయలు ఖండాంతరాలు దాటాయి.