Chutney: జుట్టు ఆరోగ్యంగా, పొడవుగా పెరగాలంటే ప్రతిరోజూ కరివేపాకు చట్నీ తినేందుకు ప్రయత్నించండి. ఈ చట్నీ నెలరోజుల పాటూ నిల్వ ఉంటుంది. ఆ చట్నీ ఎలా చేయాలో తెలుసుకోండి.
కరివేపాకులు ఆరోగ్యానికే కాదు జుట్టుకు ఎంతో ఉపయోగకరం. కరివేపాకుల్లో ఐరన్, బీటా-కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మీ జుట్టు కుదుళ్లకు పోషణ కావాలంటే, డైట్‌లో కరివేపాకు చట్నీని చేర్చుకోవాలి. ప్రతిరోజూ ఈ చట్నీని తింటే మంచి ఫలితం ఉంటుంది. ఈ చట్నీ ఎలా చేయాలో తెలుసుకోండి.
23
కరివేపాకు చట్నీకి కావలసిన పదార్థాలు
కరివేపాకు
1-2 చెంచాల నూనె
2 చెంచాల నూనె
1 పెద్ద చెంచా జీలకర్ర
1 పెద్ద చెంచా ధనియాలు
10-12 వెల్లుల్లి రెబ్బలు
1/2 కప్పు పచ్చి వేరుశనగపప్పు
2 పెద్ద చెంచాల పచ్చి శనగపప్పు
6-7 ఎండు మిరపకాయలు
1/2 చెంచా ఇంగువ
1/4 కప్పు ఎండు కొబ్బరి
1 చెంచా ఉప్పు
1 చెంచా ఆమ్‌చూర్ పౌడర్ (మామిడి పొడి)
33
కరివేపాకు చట్నీ తయారీ విధానం
ముందుగా కరివేపాకును కడిగి, పాన్‌లో 2 చెంచాల నూనె వేసి కరకరలాడే వరకు వేయించాలి.
తర్వాత అదే పాన్‌లో నూనె, జీలకర్ర, ధనియాలు, వెల్లుల్లి, వేరుశనగ, పచ్చి శనగపప్పు, తెల్ల నువ్వులు వేసి వేయించాలి. ఇప్పుడు 3 నుంచి 4 ఎండు మిరపకాయలు కూడా వేసి వేయించాలి.
చివరగా తురిమిన కొబ్బరి వేసి కాసేపు వేయించాలి.
1-2 నిమిషాలు చల్లార్చి, మిక్సీ జార్‌లో వేసి, కరివేపాకుతో పాటు అన్ని పదార్థాలను కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి.
రుచికి సరిపడా ఉప్పు కలపండి. అంతే, రుచికరమైన కరివేపాకు చట్నీ రెడీ అయినట్టే