మొదటి రాత్రి వధువు పాల గ్లాసుతో గదిలోకి వెళ్లడానికి అసలు కారణం ఇదా..

First Published | Feb 24, 2022, 2:04 PM IST

ఫస్ట్ నైట్ రోజు వధువును వరుడి గదిలోకి పాలగ్లాసుతో పంపే తంతును మనం నిత్యం సినిమాల్లో చూస్తూనే ఉంటాం. ఇక రియల్ లైఫ్ లో కూడా ఇలాంటి తంతులు నిర్వహించేవారు లేకపోలేదు. అయితే ఆ రోజు పాల గ్లాసుతో పంపడానికి రీజన్ ఏంటి? కామసూత్రాల్లో దీని గురించి ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

కరోనా మహమ్మారి వ్యాప్తి ప్రస్తుతం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో జోరుగా పెళ్లిళ్లు జరుగుతున్నాయి. ఇక ఈ పెళ్లి తంతు ముగియగానే యథావిథిగా జరిగే కార్యం గురించి ప్రత్యేకంగా వివరించాల్సిన అవసరం లేదు కదా. శోభనం రాత్రి పడకగదిని, మంచాన్ని గులాబీ పువ్వులు, మల్లెపువ్వులతో అందంగా అలంకరిస్తుంటారు. అలాగే స్వీట్లు, రకరకాల పండ్లతో ఎన్నో ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. 

పండ్లు , స్వీట్లు ఉన్నా లేకున్నా.. గానీ వధువు చేత మాత్రం ఖచ్చితంగా పాల గ్లాసుతో వరుడి గదిలోకి పంపుతుంటారు. ఇది సాంప్రదాయంగా కొనసాగుతూ వస్తూ ఉంది. అయితే ఇది కేవలం సాంప్రదాయంగానే కాకుండా.. ఈ పద్దతుల వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం..


కొత్త జంట ఫ్రీగా ఉండలేరు. వారి మధ్య దూరం తగ్గాలంటే కొన్ని చిట్కాలను పాటించాల్సిందే. కాగా పాల గ్లాస్ ఇద్దరి మధ్య సిగ్గును, బిడియాన్ని తగ్గించేందుకు ఎంతో ఉపయోగపడతుందని పెద్దలు చెబుతున్నారు.
 

పాలను ఇద్దరు పంచుకుని తాగడం వల్ల వారి మధ్య దూరం తగ్గుతుంది. ముఖ్యంగా వారి బంధం బలపడుతుందట. అందుకే పాల గ్లాసుతో వధువును పంపుతారు.

పాలు తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా పాలు తాగడం వల్ల మన శరీరంలో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయ. దాంతో మనసు రిలాక్స్ అవుతుంది.

పాలు తాగడం వల్ల ఇద్దరిలో  శృంగార ప్రేరేపణలు జరిగి ఇద్దరూ ఒకటవుతారట. అంతేకాదు భోభనం రోజున పాలు ఎనర్జీ డ్రింక్ లా కూడా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు. 
 

పాలల్లో ఉండే ఎమిన్ యాసిడ్ లైంఘిక శక్త పెరిగేలా చేస్తుంది. అలాగే పాలల్లో ఉండే ప్రోటీన్లు హార్మోన్ల వృద్ధిని ప్రోత్సహిస్తాయి. కాగా మగవారు నైట్ టైం పాలు తాగితే వారిలో స్పెర్మ్ కౌంట్ కూడా పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. 

ముఖ్యంగా శోభనం రోజు పురుషులు పాలు తాగితే సెక్స్ లో చురుగ్గా ఉంటారట. అంతేకాదు పాలల్లో ఉండే విటమిన్ డి ఒత్తిడిని, అలసటను తగ్గించేందుకు బాగా ఉపయోగపడతాయట. 

లైంఘిక సామర్థ్యం, శక్తి పెరిగేందుకు శోభనం రోజున పాలు తాగుతారని కామసూత్ర చెబుతోంది. ఒక్క మొదటి రాత్రే కాదు.. ఇతర రాత్రుళ్లు తాగితే కూడా చక్కటి ఫలితం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 

Latest Videos

click me!