అంజీరా పండుగా పిలవబడే అత్తిపండులో పోషక విలువలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ముఖ్యంగా వీటిలో జింక్, ఐరన్, ఖనిజాలు, మాంగనీస్, పాస్ఫరస్, మెగ్నీషియం, ఫైబర్, విటమిన్ ఎ, బి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది మన ఆరోగ్యానికే కాదు, చర్మం సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడుతుంది.