Father's Day 2022: ఈ ఫాదర్స్ డేను మరింత స్పెషల్ గా మార్చాలనుకుంటున్నారా? అయితే నాన్నగారితో ఇలా గడపండి

Published : Jun 17, 2022, 03:26 PM IST

Father's Day 2022: ఈ ఫాదర్స్ డే  సందర్భంగా మీ నాన్నకు విలువైన గిఫ్టులు కొనివ్వడమే కాదు.. ఆ రోజున మీ నాన్నతో ఇలా గడిపితే కూడా ఆయన ఈ రోజును ఎన్నటికీ మర్చిపోడు.   

PREV
18
Father's Day 2022: ఈ ఫాదర్స్ డేను మరింత స్పెషల్ గా మార్చాలనుకుంటున్నారా? అయితే నాన్నగారితో ఇలా గడపండి

Father's Day 2022: ఫాదర్స్ డే తొందరలోనే ఉంది. దీంతో చాలా మంది ఇప్పటికే వాళ్ల నాన్న కోసం బహుమతులు కొనే ఉంటారు. ఈ రోజును స్పెషల్ గా మార్చాలంటే.. కేవలం గిఫ్టు కొంటే సరిపోదు.. వారితో సరదాగా  గడపాలి కూడా. ఈ స్పెషల్ డేను మరింత స్పెషల్ గా మార్చాలంటే ఈ యాక్టివీటిస్ చేయండి. 
 

28

కలిసి ఐస్ క్రీం తినండి: ఐస్ క్రీం పిల్లలకేంటి పెద్దలకు కూడా ఇష్టముంటుంది. ఇక ఫాదర్స్ డే రోజున మీ నాన్నతో కలిసి బయటకు వెళ్లి టేస్టీ ఐస్ క్రీం ను తినండి. ఇలాంటి సందర్భాలు ఎప్పుడూ రావు. అందుకే ఈ ఫాదర్స్ డే ను మీ నాన్నకు అలా ఐస్ క్రీం తినడానికి తీసుకెళ్లండి. ఇది ఆయనకెంతో సంతోషాన్నిస్తుంది. 
 

38

కుటుంబంతో బైక్ రైడ్ కు వెళ్లండి:  ఫాదర్స్ డే నాడు బైక్ రైడ్ కు వెళ్లడతో మీరు కుటుంబం మొత్తంతో వ్యాయామం చేసిన వారవుతారు. ఎక్కడికి వెళ్లాలో ముందే ప్లాన్ చేసుకోండి. అక్కడికి చేరుకున్నాక పిక్కిన్ కోసం ప్లాన్ చేయండి. 
 

48
Father's day 2022

మీ నాన్నకోసం చిన్న పాట:  తమ పిల్లలు పాట పాడినా.. డాన్స్ చేసినా తల్లిదండ్రులు ఎంతో సంతోషిస్తారు. అందుకే ఈ స్పెషల్ రోజున మీ నాన్నకోసం చిన్న పాటను పాడండి. మీ పాటతో మీ నాన్న అంటే మీకెంత ఇష్టమో పాటల్లో తెలియజేయండి.  
 

58

షాపింగ్ కు తీసుకెళ్లండి: పిల్లల కోసం తప్ప తమ కోసం ఎప్పుడూ షాపింగ్ చేయని తండ్రులెందరో ఉన్నారు. అందుకే ఈ రోజున మీ నాన్నను షాపింగ్ కు తీసుకెళ్లండి. మీ నాన్నకు నచ్చినవి ఇప్పించండి. 
 

68

క్యాంప్ ఫైర్ నిర్మించండి: ఫాదర్స్ డే ను మరింత స్పెషల్ గా చేయడానికి మీ నాన్నతో కలిసి క్యాంప్ ఫైర్ ను ఏర్పాటు చేయండి. మీ అక్కడ మీ నాన్నజ్ఞాపకాలను చెప్పమని అడగండి. ఇది ఆ క్షణాన్ని మరింత అందంగా, ఆనందంగా మారుస్తుంది.
 

78

మీ నాన్నకు ఇష్టమైన వైన్: ఇక ఈ స్పెషల్ డే  రోజున నాడు సాయంత్రం వేళ మీ నాన్నగారికి ఇష్టమైన వైన్ ను గిఫ్ట్ గా అందించండి. ఇది ఆయన ఎన్నటికీ మర్చిపోలేడు. 
 

88

అవుట్ డోర్ మూవీ ప్లాన్ చేయండి: రాత్రిపూట సినిమాలకు వెళ్లడం కాస్త కష్టమే. అందుకే మీ పెరట్లో అవుట్ డోర్ స్క్రీనింగ్ ను ఏర్పాటు చేయండి. గోడకు ప్రొజెక్టర్ ను పెట్టి మీ నాన్నకు ఇష్టమైన మూవీని ప్లే చేయండి.  
 

click me!

Recommended Stories