కొందరమ్మాయిలు మరీ అణకువగా ఉంటారు. ప్రతి చిన్న విషయానికీ భయపడిపోతుంటారు. ఏ చిన్న నిర్ణయాన్నీ సొంతంగా తీసుకోలేరు. ఈ టెక్నాలజీ యుగంలో ఇలా ఉంటే కుదరదు. అణకువగా ఉన్నా ఫర్వాలేదుగానీ అతి భయం వాళ్ల భవిష్యత్తు, ఎదుగుదలకు అడ్డంకిగా మారుతుంది. అందుకే ఈ రోజుల్లో తల్లిదండ్రులు తమ ఆడపిల్లలను చాలా ధైర్యంగా పెంచాలి. వాళ్లలో రాణి రుద్రమదేవి, ఝాన్సీ లక్ష్మిబాయిలా గొప్పగా పోరాడే తత్వం ఉండాలి. దాని కోసం వాళ్ళు ఏమి చేయాలి? ఏమి చేయకూడదో వివరంగా చూద్దాం.
ఆడపిల్లల అభివృద్ధి ఏ స్థాయిలో ఉందో, అదే స్థాయిలో పోటీ ఉంటోంది. దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. చదువు నుండి మొదలుకొని ఉద్యోగం వరకు అనేక విషయాల్లో పోటీలు ఉండడం వల్ల, ప్రారంభంలోనే ఆడపిల్లలకు తల్లిదండ్రులు అన్ని విధాలా ప్రోత్సాహం ఇవ్వాలి. మానసికంగా ఇది వాళ్ళని ముందుకు నడిపిస్తుంది.
25
అస్సలు వెనకాడకుండా 'నో' చెప్పండి
ఏ సమస్య వచ్చినా, వాళ్ళు కుంగిపోకుండా ధైర్యంగా పెంచాలి. ఈ పరిణితి మీ పిల్లలకు రావడానికి కొన్ని విషయాల్లో ఓటములను కూడా నేర్పించి పెంచడం అవసరం. వాళ్ళు అడిగినప్పుడల్లా అన్నీ కొనివ్వాలని అనుకోకండి. అవసరం లేని వస్తువులు అడిగితే, అస్సలు వెనకాడకుండా 'నో' చెప్పి వాళ్ళ మనసును దృఢపరచండి. ఇలా చేయడం వల్ల వేరే ఏదైనా విషయంలో పిల్లలు ఆశపడింది జరగకపోతే అది వాళ్ళని పెద్దగా బాధించదు.
35
నైపుణ్యాలకు ఎప్పుడూ అడ్డు చెప్పకండి
మీ పిల్లల నైపుణ్యాలకు ఎప్పుడూ అడ్డు చెప్పకండి. చదవాలి అనే కారణంతో వాళ్ళు ఇష్టపడే డాన్స్, పాట, లేదా స్పోర్ట్స్ వంటి విషయాలను ఆపడం మంచి నిర్ణయం కాదు. అదే విధంగా స్కూల్ కి వెళ్ళేటప్పుడు, ఆడపిల్లలకు స్పర్శ గురించి తప్పకుండా చెప్పి పెంచాలి. మంచి స్పర్శ, చెడు స్పర్శ గురించి వివరించాలి. అదే విధంగా పేరెంట్స్ పని ఒత్తిడి ఉన్నా మీ పిల్లల కోసం కొన్ని గంటలు కేటాయించాలి.
45
ఆడపిల్లలకు ఆత్మగౌరవాన్ని నేర్పించి పెంచండి
మీ ఆడపిల్లలకు ఆత్మగౌరవాన్ని నేర్పించి పెంచండి. అది వాళ్ళని ధైర్యంగా మారుస్తుంది. అదే విధంగా ఆడపిల్లలు ఎప్పుడూ పొగడ్తలను ఎక్కువగా ఇష్టపడతారు. వాళ్ళని సంతోష పెట్టడానికి, వాళ్ళ దుస్తులు, ఆభరణాలు వంటి వాటిని పొగిడినట్టు వాళ్ళు చేసే నిర్మాణాత్మకమైన విషయాలను కూడా చప్పట్లు కొట్టి, గట్టిగా పొగడండి. ఇది మీ పిల్లలను మీకు చాలా దగ్గరగా ఉండేలా చేస్తుంది. ఏ విషయం అయినా మీ దగ్గర వాళ్ళు భయాన్ని దాటి చెబుతారు.
55
అవసరం లేని వాదనలు వద్దు:
అదే విధంగా ప్రతి పిల్లవాడు తల్లిదండ్రులను చూసే పెరుగుతారు. మనం చేసేదే పిల్లలు చేస్తారు అని అర్థం చేసుకుని, పేరెంట్స్ ఇంట్లో అనవసరమైన గొడవలు, వాదనలు తగ్గించాలి. ఇది వంటి సమస్యలు మగ పిల్లలను మానసికంగా బాధిస్తాయి. ముఖ్యంగా ఆడపిల్లలు దీని వల్ల బాధపడవచ్చు అని గుర్తుంచుకోండి.