NTR Birthday: ఎన్టీఆర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

First Published May 20, 2022, 11:00 AM IST

బాగా డ్యాన్స్ వేయడానికి వాళ్ల అమ్మ కారణం. చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మ బలవంతంగా ఆయనకు కూచిపూడి నేర్పించారట. దాని ఫలితమే.. ఆయన ఇప్పుడు గొప్ప డ్యాన్సర్ కాగలిగారు.

టాలీవుడ్ బాద్షా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు 39వ పుట్టిన రోజు జరుపుకుంటారు. ఈ విషయం అందరికీ తెలిసిందే.. ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే.. ఆయన గురించి చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన కొన్ని విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. 
 

1.ఎన్టీఆర్... నందమూరి కుటుంబానికి చెందిన వాడు అనే విషయం మనందరికీ తెలుసు. కాగా... ఆయనకు మొట్ట మొదట పెట్టిన పేరు నందమూరి తారక రామరావు కాదట. ఆయన ముందుగా ఆయన తండ్రి హరికృష్ణ ముందుగా తారక్ రామ్ అని పేరు పెట్టారట. అయితే.. ఆయనకు 8ఏళ్ల వయసులో వారి తాతగారు.. తారక రామారావు అని పేరు మార్చారట. ఆ తర్వాత వీరిద్దరూ కలిసి బ్రహ్మశ్రీ విశ్వామిత్ర అనే సినిమాలో కలిసి నటించారు.  తొలిసారి.. తెరపై ఎన్టీఆర్ కనిపించింది అప్పడే. ఆ సినిమాతో బాల నటుడిగా కెరీర్ ప్రారంభించాడు.

2.ఎన్టీఆర్ డ్యాన్స్ ఎలా ఇరగదీస్తాడో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. ఇప్పుడు ఆయన అంత బాగా డ్యాన్స్ వేయడానికి వాళ్ల అమ్మ కారణం. చిన్నప్పటి నుంచి వాళ్ల అమ్మ బలవంతంగా ఆయనకు కూచిపూడి నేర్పించారట. దాని ఫలితమే.. ఆయన ఇప్పుడు గొప్ప డ్యాన్సర్ కాగలిగారు.

3.ఆర్ఆర్ఆర్ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా మారారు. ఆ సినిమాకి రాజమౌళి దర్శకత్వం వహించారు. కాగా.. ఆయన కెరిర్ ఫస్ట్ బ్లాక్ బస్టర్ కూడా రాజమౌళితోనే వచ్చింది. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన స్టూడెంట్ నెం.1 సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టాడు.


4.అతని చిత్రం ఆంధ్రావాలా (2004) మొట్టమొదటి భారీ ఆడియో లాంచ్‌లో పది లక్షల మంది ప్రజలు హాజరయ్యారు. నివేదికల ప్రకారం, భారతీయ రైల్వే ఆ ఒక ప్రత్యేక సందర్భం కోసం పది ప్రత్యేక రైళ్లను నడిపింది, ఆ రికార్డును ఇప్పటి వరకు ఎవరూ బ్రేక్ చేయలేదు.
 

5.జపాన్‌లో ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఏకైక తెలుగు నటుడు. అతని చిత్రం బాద్షా (2013) జపనీస్ భాషలో డబ్ చేసిన తర్వాత జపాన్‌లో జరిగిన చలన చిత్రోత్సవానికి నామినేట్ చేశారు. అప్పటి నుండి అతనికి అక్కడ పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారు

ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ లిస్ట్‌లో రెండుసార్లు
అతను 2012,2016లో ఫోర్బ్స్ ఇండియా  సెలబ్రిటీ లిస్ట్‌లో రెండుసార్లు పేరు పొందాడు.

అతని ఇటీవలి చిత్రాలు, నాన్నకు ప్రేమతో , జనతా గ్యారేజ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించాయి. ఇటీవల ఆర్ఆర్ఆర్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు.
 

అదృష్ట సంఖ్య 9
ఎన్టీఆర్ లక్కీ నెంబర్ 9. అతని అన్ని ఆటోమొబైల్స్‌లో అతని రిజిస్ట్రేషన్ నంబర్ 9999. అతను తన BMW 7 సిరీస్ కారు కోసం INR 10.5 లక్షలు చెల్లించాడు, ఇది ఒక కారు నంబర్ కోసం చెల్లించిన అత్యధిక మొత్తం కావడం గమనార్హం.

ఆయన తన సినిమాల్లో కొన్ని తెలుగు పాటలు పాడారని చాలామందికి తెలుసు.కానీ.. తన సినిమాల్లో మాత్రమే కాకుండా.. ఆయన కన్నడలోని  చక్రవ్యూహ చిత్రంలో  “గెలేయా గెలేయా” అనే పాటను కూడా పాడాడు.

click me!