mango
పండ్లలో రారాజుగా మామిడి పండుకే ప్రత్యేక స్థానం దక్కుతుంది. అందులోనూ వేసవిలో మామిడిపండ్లకు కొదవే ఉండదు. ఇష్టమున్నన్ని లాగించొచ్చు. కమ్మని వాసన.. నోరూరించే ఆకారంతో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇక మార్కెట్లలో మనకు ఎన్నో రకాల పండ్లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో దానికి ఒక్కో స్పెషాలిటీ ఉంటుంది. మీకు తెలుసా.. మన దేశంలో ఏకంగా 100 కు పైనే మామిడి పండ్ల రకాలు ఉన్నాయి.
ఒకటి తియ్యగా ఉండే మరొటి.. పుల్లపుల్లగా ఉంటుంది. ఇంతకీ మన దేశంలో ఎన్ని రకాల మామిడి పండ్లు ఉన్నాయో.. అవి ఎక్కడెక్కడ లభిస్తాయో.. తెలుసుకుందాం పదండి.
Mangoes
ఆంధ్రప్రదేశ్ లో.. తోతాపురి, బంగినపల్లి, నీలం, సువర్ణరేఖ వంటి మామిడిపండ్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంటుంది. ఈ పండ్లు ఆంధ్రప్రదేశ్ లో పండుతాయి. ఆ పండ్లు ఇతర దేశాలకు సైతం Export అవుతుంటాయి.
Mangoes
హిమాచల్ ప్రదేశ్ లో.. లంగ్రా, పైరి, చౌసా, అల్పోన్సో, దసేహరి, కేసర్ వంటి ఆరు రకాల మామిడి పండ్లు హిమాచల్ ప్రదేశ్ లో చాలా ఫేమస్. ఈ పండ్లు ఇక్కడ మాత్రమే లభిస్తాయి.
Mangoes
బీహార్ లో.. కిసేన్ బోగ్ , దసేహరి, ఫాజిలి, లంగ్రా, హిమ్ సాగర్, చౌసా, గుల్బకాస్, జర్దాలు బాంబే గ్రీన్ వంటి ప్రఖ్యాతిగాంచిన మామిడి పండ్లు బీహార్ రాష్ట్రంలో లభిస్తాయి.
Mangoes
గుజరాత్ లో .. లంగ్రా, తోతాపురి, నీలమ్, జామాదార్, అల్ఫాన్సో, కేసర్, రాజాపురి, దసేహరి వంటి ఎనిమిది రకాల మామిడి పండ్లు గుజరాత్ లో లభిస్తాయి. ఇవి అక్కడ చాలా ఫేమస్.
కర్ణాటకలో.. నీలం, తోతాపురి, పైరి, ఆల్ఫన్సో, బంగినపల్లి, ముల్ గోవా, నీలం వంటి రకరకాల మామిడి పండ్లకు కర్ణాటక ఫేమస్ ప్లేస్.
mangoes
హర్యానాలో.. లంగ్రా, చౌసా, ఫాజిలి, దసేహరి వంటి నాలుగు రకాల పండ్లకు హర్యానా ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంది. ఈ పండ్లు రుచిలో ది బెస్ట్ అనిపించుకుంటాయి.
పంజాబ్ లో.. లంగ్రా, బాంబే గ్రీన్, దసేహరి, చౌసా వంటి నాలుగు రకాల మామిడి పండ్లలు పంజాబ్ లో పండుతాయి. ఈ మామిడి పండ్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
మధ్యప్రదేశ్ లో.. నీలం, దసేహరి, అల్ఫాన్సో, ఫాజిలి, బాంబే గ్రీన్, లంగ్రా వంటి ఆరు రకాల మామిడి పండ్లు మధ్యప్రదేశ్ లో పండుతాయి. వీటికి మార్కెట్ లో డిమాండ్ బగ్గ ఉంటుంది.
ఉత్తర ప్రదేశ్ లో.. లంగ్రా, బాంబేగ్రీన్, దసేహరి, చౌసా వంటి మామిడి పండ్లకు ఉత్తరప్రదేశ్ ప్రత్యేక స్థానం పొందింది. ఈ మామిడి పండ్లు చాలా రుచిగా ఉంటాయి.
తమిళనాడులో.. నీలం, ఆల్పోన్సా, బంగినపల్లి, తోతాపురి మామిడి పండ్లు తమిళనాడులో పండుతాయి. ఈ పండ్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.
వెస్ట్ బెంగాల్.. బాంబే గ్రీన్, గుల్బకాస్, కిషోన్ బోగ్, ఫాజిలి, హిమ్ సాగర్, లంగ్రా వంటి మామిడి పండ్లకు వెస్ట్ బెంగాల్ పెట్టింది పేరు. ఈ పండ్లకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది.