సాధారణంగా ప్రతి ఇంట్లో ఈగలు, దోమలు, ఎలుకలు, బల్లులు, పురుగులు ఉంటాయి. వీటితో పాటుగా చాలా మంది ఇండ్లల్లో చెదలు కూడా ఉంటుంది. ఈ చెదలు చూడటానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ ఇది చేసే నష్టం అంతా ఇంతా కాదు.
ఈ చెదలు చెక్క కిటికీలను, గోడలను, డోర్స్ తో పాటుగా పుస్తకాలను తినేస్తుంటాయి. దీనివల్ల ఎంతో నష్టం జరుగుతుంది. వీటిని అలాగే వదిలేస్తే ఇవి మన ఇంటిని మొత్తం నాశనం చేస్తాయి.
ఈ చెదలు బెడద ఎక్కువగా వానాకాలం, చలికాలంలో ఉంటుంది. ఈ సీజన్లలో చెదలు చాలా చురుగ్గా ఉంటుంది. దీనికి కారణం తేమ. తేమ వాతావరణంలోనే చెదడు సంతానోత్పత్తి చేస్తాయి. అందుకే మీ ఇంట్లో చెదలు ఉంటే వాటిని ముందే గుర్తించండి. ఒకవేళ ఉంటే.. ఇంట్లో నుంచి ఎలా తరిమికొట్టాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
నిమ్మరసం, వెనిగర్
నిమ్మరసం, వెనిగర్ తో ఇంట్లో ఇక్క చెద పురుగు లేకుండా చేయొచ్చు. ఈ రెండు చెద పురుగులు ఇంట్లో మొత్తమే లేకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. చెదపురుగులకు నిమ్మకాయ వాసన అసలే నచ్చదు.
చెదలు పోవాలంటే రెండు టీ స్పూన్ల వెనిగర్ లో టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపండి. వీటిలో తగినన్ని నీళ్లు పోసి కలపండి. దీన్ని చెద పురుగులు ఉన్న చోట స్ప్రే చేయండి. ఇలా తరచుగా చేస్తే చెదలు నశిస్తాయి. అలాగే ఇంట్లోకి మళ్లీ రావు.
లవంగాలు
లవంగాలతో కూడా ఇంట్లో చెద పురుగు లేకుండా చేయొచ్చు. అయితే వీటిని డైరెక్ట్ గా వాడకూడదు. ఒక గిన్నె తీసుకుని అందులో నీళ్లు పోసి లవంగాలను వేసి బాగా మరిగించండి. ఈ నీళ్లు చల్లారిన తర్వాత స్ప్రే బాటిల్ లో పోయండి. దీనితో చెద పురుగులు ఉన్న చోట స్ప్రే చేయండి. దీనివల్ల చెద పురుగులు పూర్తిగా నశిస్తాయి.
సిట్రస్ ఆయిల్
సిట్రస్ ఆయిల్ తో కూడా చెద పురుగులను తరిమికొట్టొచ్చు. ముఖ్యంగా నిమ్మ పండ్లలో సిట్రస్ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో చెదపురుగులు లేకుండా చేయడానికి మీరు సిట్రస్ ఆయిల్ ను వాడండి. మీరు ఈ సిట్రస్ ఆయిల్ అన్ని షాపుల్లో దొరుకుతుంది. ఈ ఆయిల్ ను స్ప్రే చేస్తే చెదలు పూర్తిగా పోతుంది.
వేప నూనె
వేప నూనెతో కూడా చెదలు మొత్తమే లేకుండా చేయొచ్చు. వేప నూనె వాసన చెదలు నశించేలా చేస్తుంది. ఈ నూనెతో ఒక్క చెదలు మాత్రమే కాదు ఇంట్లో ఉన్న ఈగలు,చీమలు, చిన్న చిన్న పురుగులు లేకుండా చేస్తుంది. ఇందుకోసం వేప నూనెను ఒక గుడ్డలో ముంచి చెదలు ఉన్న చోట తుడిస్తే సరిపోతుంది.