రాత్రి పడుకునే ముందు ఈ నాలుగు కలిపి తింటే...తెల్ల జుట్టు రాదు..!

First Published | Aug 5, 2024, 11:33 AM IST

అప్పటి నుంచి వైట్ హెయిర్ కి  రంగులు వేయడం మొదలుపెడతారు. ఇలా  రంగులు వేయడం మొదలుపెడితే.. జుట్టు బలహీనంగా మారిపోయి..కుప్పలు కుప్పలుగా ఊడిపోతుంది

జుట్టు మనకు ఇచ్చిన అందం మరేదీ ఇవ్వదనే చెప్పాలి. జుట్టు నల్లగా నిగనిగలాడుతూ కనిపిస్తూ ఉంటే... వచ్చే అందమే వేరు. కానీ.. మనం తినే ఆహారాలు, కాలుష్యం.. కారణం ఏదైనా  నిండా 30 రాకముందే.. తెల్ల జుట్టు రావడం మొదలౌతుంది. అలా బయటకు తెల్ల జుట్టు కనపడుతూ ఉంటే.. ఎవరికైనా చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకేముంది అప్పటి నుంచి వైట్ హెయిర్ కి  రంగులు వేయడం మొదలుపెడతారు. ఇలా  రంగులు వేయడం మొదలుపెడితే.. జుట్టు బలహీనంగా మారిపోయి..కుప్పలు కుప్పలుగా ఊడిపోతుంది


అసలు.. జుట్టు ఊడిపోవడానికీ, తెల్లగా మారిపోవడానికి అసలు కారణం.. మన శరీరానికి అవసరం అయిన పోషకాలు అందకపోవడమే. సరైన ఆహారం తీసుకోకపోవడం, ఒత్తిడి, హార్మోన్ల అసమతుల్యత, అనేక ఇతర కారణాల వల్ల.. జుట్టు చాలా తొందరగా నెరసిపోతుంది.  అందుకే.. ఆహారంలో కచ్చితంగా మార్పులు చేసుకోవాలి. మీకు తెలుసా..? రాత్రిపూట  కేవలం నాలుగు ఆహారాలను పడుకునేముందు తింటే.. కచ్చితంగా వచ్చిన తెల్ల జుట్టు నల్లగా మారడమే కాదు... కొత్తగా తెల్ల వెంట్రుకలు రాకుండా ఉంటాయి. మరి అవేంటో మనం తెలుసుకుందామా... 
 



మనం కేవలం నాలుగు ఫుడ్స్ ని రాత్రి పడుకునే ముందు.. నెయ్యితో కలిపి తినాలి. ఉసిరి, కరివేపాకు, భృంగరాజ్, బ్రహ్మీలను నెయ్యిలో కలిపి తీసుకోవాలి. రాత్రి పడుకునే ముందు లేదంటే...ఉదయాన్నే పరగడుపున తినాలి. ఈ నాలుగు మన జుట్టుకు ఎలా ఉపయోగపడతాయి అంటే...
 

grey hair


ఉసిరికాయలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి.ఇది జుట్టు మూలాలకు పోషణనిస్తుంది, జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. బూడిద రంగులోకి మారకుండా చేస్తుంది. ఉసిరిలో ఉండే పోషకాలు జుట్టు , చర్మానికి చాలా మేలు చేస్తాయి.

ఇక.. బృంగరాజ్‌లో ఐరన్, విటమిన్ ఇ, విటమిన్ డి, మెగ్నీషియం, కాల్షియం, యాంటీ బాక్టీరియల్ , యాంటీ వైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇది జుట్టు అకాల నెరసిపోవడాన్ని నివారిస్తుంది.ఇది జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు ,మినరల్స్ సమృద్ధిగా ఉండే బ్రహ్మి జుట్టుకు కూడా చాలా మేలు చేస్తుంది. బ్రహ్మి స్కాల్ప్‌ను రిలాక్స్ చేస్తుంది. ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది, ఇది జుట్టు రాలడానికి ప్రధాన కారణం.

కరివేపాకులో ప్రొటీన్లు, విటమిన్ బి6, బీటా కెరోటిన్ ఉంటాయి. ఇది జుట్టుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇది జుట్టు మూలాలకు పోషణనిస్తుంది, చుండ్రుని తగ్గిస్తుంది. జుట్టు అకాల బూడిద రంగులోకి మారకుండా చేస్తుంది.
 

అందుకే.. వీటి మిశ్రమాన్ని  నెయ్యితో కలిపి తీసుకోవాలి. వాటిని పొడి రూపంలో చేసుకొని.. నెయ్యితో కలిపి ఉండలా చేసుకొని అయినా తినొచ్చు.  రుచి కాస్త నచ్చకపోయినా... ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఒక పదిహేను రోజులు ప్రయత్నిస్తే.. ఫలితం మీకు స్పష్టంగా కనపడుతుంది. 

Latest Videos

click me!