Home Hacks: వీటితో తెల్ల బట్టలపై మరకలను ఈజీగా పోగొట్టవచ్చు!

Published : Feb 26, 2025, 03:33 PM IST

తెల్ల బట్టలు చూడటానికి ఎంత అందంగా ఉంటాయో.. మరకలు పడితే పోగొట్టడం కూడా అంతే కష్టంగా ఉంటుంది. వేరే కలర్స్ తో పోలిస్తే వైట్ డ్రైస్సులపైన చిన్న మరకున్నా కొట్టచ్చినట్లు కనబడతుంది. ఇంక దాన్ని వేసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. అయితే కొన్ని చిట్కాలతో తెల్లబట్టలపై ఉన్న మొండి మరకలను సైతం దూరం చేయవచ్చు. అవెంటో చూడండి.

PREV
16
Home Hacks: వీటితో తెల్ల బట్టలపై మరకలను ఈజీగా పోగొట్టవచ్చు!

తెల్ల బట్టలు ఎవరికైనా సరే అందంగానే ఉంటాయి. అవి వేసుకున్నప్పుడు తెలియని మెరుపు కనిపిస్తుంది. కానీ వాటిపై మరకలు పడితే మాత్రం తొలగించడం చాలా కష్టం. దానికి తోడు ఎంత చిన్న మరకైనా వైట్ డ్రెస్సులపై బాగా కనబడుతుంది. దాంతో డ్రెస్ లుక్ పోతుంది. చాలామంది మరకలు పడ్డ వెంటనే తెల్ల బట్టలను ఇక పక్కకు పడేస్తుంటారు. కానీ కొన్ని చిట్కాలతో వైట్ డ్రెస్సులపై ఉన్న మరకలను ఈజీగా తొలగించవచ్చు. వాటిని మళ్లీ కొత్తవాటిలా మెరిపించవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో చూసేయండి.

26
నిమ్మకాయ

నిమ్మకాయ ఒక నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్. మరకపై నిమ్మరసం పిండాలి. ఆ తర్వాత, ఎండలో ఆరబెట్టండి. సూర్యరశ్మి, నిమ్మరసం కలిసి మరకను తొలగిస్తాయి. మరీ మొండి మరకలైతే కొంచెం ఉప్పు కూడా కలపవచ్చు.

36
హైడ్రోజన్ పెరాక్సైడ్

హైడ్రోజన్ పెరాక్సైడ్ ఒక పవర్ఫుల్ బ్లీచింగ్ ఏజెంట్. మొండి మరకలపై కొద్దిగా హైడ్రోజన్ పెరాక్సైడ్ నేరుగా రాయొచ్చు. కొన్ని నిమిషాల తర్వాత బట్టలు ఉతకండి. కానీ ఇది తెల్ల బట్టలకే వాడాలి. రంగు బట్టలు వెలిసిపోతాయి.

46
బేకింగ్ సోడా

బేకింగ్ సోడా కూడా మరకలకు మంచి రెమిడీ. ఒక కప్పు గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ బేకింగ్ సోడా వేసి, మరక ఉన్న చోట కొన్ని గంటలు నానబెట్టండి. తర్వాత మామూలుగా ఉతకండి. బేకింగ్ సోడా మరకను పీల్చుకుంటుంది. కొత్త దానిలా మెరిపిస్తుంది.

56
వెనిగర్, నీళ్ల మిశ్రమం

వైట్ వెనిగర్ మరకలు తీయడంలో బాగా పనిచేస్తుంది. ఒక భాగం వెనిగర్, రెండు భాగాలు నీళ్లు కలపండి. ఈ మిశ్రమంలో మరక ఉన్న చోట 30 నిమిషాలు నానబెట్టి, తర్వాత ఉతకండి. వెనిగర్ మరకను సులువుగా వదిలిస్తుంది.

66
లాండ్రీ సోప్, బ్రష్

కొన్నిసార్లు మంచి లాండ్రీ సోప్, బ్రష్ ఉంటే చాలు. మరక ఉన్న చోట కొద్దిగా సబ్బు రాసి, మెత్తటి బ్రష్‌తో రుద్దండి. తర్వాత చల్లటి నీటితో ఉతకండి.

click me!

Recommended Stories