సోయాబీన్‌ తింటే పిల్లలు పుట్టరా.? నిపుణులు ఏమంటున్నారంటే..

First Published | Dec 31, 2024, 9:51 AM IST

ఒకప్పుడు సంతానలేమి అనేది కేవలం మహిళల్లో మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు ఈ సమస్య పురుషుల్లో కూడా కనిపిస్తోంది. పురుషుల్లో సంతానలేమీకి సోయాబీన్ కూడా ఒక కారణమనే వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఈ వార్తలో నిజం ఎంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

పురుషుల్లో సంతానలేమికి జీవన విధానంతో పాటు తీసుకునే ఆహారం కూడా ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల ఫుడ్స్, చెడు అలవాట్లు శుక్ర కణాల నాణ్యతపై చెడు ప్రభావం చూపుతుందని చెబుతుంటారు. అయితే సోయాబీన్ కూడా పురుషుల్లో సంతానలేమికి కారణమవుతుందని ఓ వార్త నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఇంతకీ వార్తలో నిజమెంత ఉందో ఇప్పుడు తెలుసుకుందాం. 

యూట్యూబ్ లో వైరల్ అవుతోన్న ఓ వీడియో ప్రకారం సోయాబీన్ లో స్త్రీలలో ఉండే ఈస్ట్రోజన్ ఉంటుందని చెబుతున్నారు. కాబట్టి పురుషులు సోయాను ఎక్కువగా తింటే వారిలో టెస్టో స్టెరాన్ హార్మోన్ స్థాయి పెరుగుతుందని ఆ వీడియో పేర్కొన్నారు. 


అలసట, నిరాశ..

అలాగే ఈ వీడియోలో పేర్కొన్న వివరాల ప్రకారం శరీరంలో టెస్టోస్టెరాన్ హార్మోన్ తగ్గితే అది లైంగిక జీవితంపై ప్రభావం చూపుతుంది. దీంతోపాటు పురుషుల్లో అలసట, నిరాశకు ఇది దారి తీస్తుందని చెబుతున్నారు. 

సోయా తింటే ఏ సమస్యా లేదు..

అయితే సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారం పూర్తిగా నిజమేనా అంటే కాదని నిపుణులు అంటున్నారు. సోయాబీన్ లో ఈస్ట్రోజన్ ఉంటుందని అనడంలో నిజం ఉన్నప్పటికీ అది చాలా తక్కువలో మోతాదులోనే ఉంటుంది. కాబట్టి, అవి పురుషుల సంతానోత్పత్తిపై ఎలాంటి ప్రభావం చూపవని నిపుణులు చెబుతున్నారు.  సోయా తినడం వల్ల సంతానలేమి వస్తుందనే సిద్ధాంతం పూర్తిగా ఆధార రహితమని అంటున్నారు. కాబట్టి సోయో తినే విషయంలో ఎలాంటి భయాలు అవసరం లేదని చెబుతున్నారు. ప్రోటీన్‌కి మంచి మూలం అయిన సోయాబీన్‌ను ఆహారంలో చేర్చుకోవడం మంచిదని వైద్యులు అంటున్నారు.

లైంగిక సమస్య ఉంటే..

అయితే అప్పటికే లైంగిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న పురుషులు మాత్రం సోయా తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. ఎందుకంటే ఇది వారిలో సమస్య మరింత పెరిగేందుకు కారణమవుతుండొచ్చని అంటున్నారు. 

వైద్యుల సూచనల ప్రకారం సోయా తినడం వల్ల నేరుగా ఎలాంటి సంతానలేమి సమస్యలు రావని చెబుతున్నారు. కాబట్టి ఎలాంటి సంకోచం లేకుండా సోయాను తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ సంతానలేమితో బాధపడుతున్న పురుషులు వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం. 

గమనిక: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం. 

Latest Videos

click me!