భార్య ఇంట్లో లేకుంటే భర్త చేసే పనులు ఇవా..!

First Published | May 23, 2022, 1:28 PM IST

భార్య ఉన్నప్పుడు ఒకలా.. భార్య లేనప్పుడు ఒకలా ప్రవర్తించే వారు చాలా మందే ఉంటారు. ముఖ్యంగా భార్య లేని సమయంలో భర్త ఎలా ప్రవర్తిస్తాడో తెలుసా..? 

సాధారణంగా పురుషులు తమ భాగస్వామి ముందు చాలా మర్యాదగా, గుడ్ బాయ్ లా ప్రవర్తిస్తుంటారు.  అంటే భార్యల ముందు ఎలాంటి వింత పనులు చేయరన్న మాట. భార్య ఉన్నప్పుడు ప్రతి పనిలో సాయపడుతుంటారు. మంచి చెడులు చెప్తుంటారు. కానీ భార్య లేదా స్నేహితురాలు వీరి దగ్గర లేనప్పుడు అంటే పురుషులు ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తారనే విషయం మీ ఊహకు కూడా అందదేమో. మరి మీ భాగస్వామి మీరు లేనప్పుడు ఏం ఏం చేస్తారో తెలుసుకుందాం పదండి.. 

వారి శరీరాలను వాసన చూడటం: ఇది కాస్త వింతగా అనిపించొచ్చు. కానీ మెజారిటీగా చాలా మంది పురుషులు ఈ పనిని తప్పకుండా చేస్తారట. ముఖ్యంగా వారి చంకలను లేదా వారి లో దుస్తులను వాసన చూస్తారట.  ఎవరూ లేనప్పుడు కొంతమంది పురుషులు చేసేది ఇదే పని. 


టాయిలెట్ లో ఎక్కువ సమయం గడపడం: చాలా మంది పురుషులకు ఎక్కువ సేపు టాయిలెట్ లో కూర్చునే అలవాటు ఉంటుంది.  అందులోనూ వారి భాగస్వామి ఇంట్లో లేనప్పుడు ఎక్కువ సమయం టాయిలెట్ లో మొబైల్ ఫోన్ తో గంటల తరబడి కూర్చుంటారట.
 

నెట్ లో ఏదైనా చూస్తారు: భార్యలు ఇంటి నుంచి పనిమీద బయటకు వెళ్లిపోగానే భర్తలే ఒంటరిగా మిగిలిపోతారు. ఇంకేముంది ఆ మూమెంట్ ను తనకు నచ్చిన దానిని చూడటానికి కేటాయిస్తారట. అంటే అశ్లీల చిత్రాలను  చూడటం లేదా ఏదైనా సినిమాలను చూస్తారట. 

బిగ్గరగా ఏడవడం: ప్రతి మనిషికీ ఏడుపు అవసరం. కానీ మన సమాజంలో పురుషులు ఏడవడం పెద్ద నేరంగా భావిస్తారు. అందులోనూ వీరికి ఏడవటానికి అసలు సమయమే ఉండదు. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు ఇన్నాళ్లుగా వారి మనసులో ఉన్న బాధను తీర్చుకోవడానికి బిగ్గరగా ఏడుస్తారట. 

మేకప్ బాక్స్ ను తనిఖీ చేస్తారు.. భార్యలు ఇంట్లో లేనప్పుడు వారి మేకప్ బాక్స్ తెరచి అందులో ఏమేమేం  ఉన్నాయో ప్రతీదీ చూస్తారట. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలని వారికి ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుందట. 

విభిన్న, వింతైన ఆహారాలను టేస్ట్ చేస్తారు:  భార్య ఇంట్లో లేనప్పపుడు డిఫరెంట్ టేస్ట్ ను ఆస్వాధించడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు ఇంట్లో ఉన్న అన్ని ఐటెమ్స్ ను కలిపి తినడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఇది మనకు కాస్త వికారంగా అనిపించినా.. దీనిని వారు యమ్మీగా ఫీలవుతారు. 

Latest Videos

click me!