Health tips: మామిడి పండ్లను తిన్నవెంటనే నీళ్లను తాగడం ఎంత డేంజరో తెలుసా?

First Published May 23, 2022, 11:36 AM IST

Health tips: వేసవిలో రెండు నెలల నుంచి మూడు నెలల పాటు మాత్రమే మామిడి పండ్లు లభిస్తాయి. అందుకే ఈ సీజన్ పోతే మళ్లీ దొరకవని జనాలు ఈ పండ్లను ఎక్కువగా తింటుంటారు. అయితే ఈ పండ్లను సరైన పద్దతిలో తినకపోతే ఎన్నో సమస్యల బారిన పడతారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. 
 

health tips: వేసవిలో పుష్కలంగా లభించే మామిడి పండ్లు.. పండ్లకు రారాజు మాత్రమే కాదు రుచిలో ది బెస్ట్ అనిపించుకుంటుంది. అంతేకాదు మామిడి పండ్లు మన దేశ వ్యాప్తంగా 100 రకాలకు పైగానే లభిస్తాయి. ఒక్కో రకం మామిడి పండు టేస్ట్ ను కలిగి ఉంటుంది. అయితే చాలా మంది మామిడి పండ్లను తినేటప్పుడు కొన్ని మిస్టేక్స్ ను చేస్తుంటారు. దీని వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయి అకస్మాత్తుగా పెరగడం, ముఖం లేదా శరీరంపై దద్దుర్లు, కడుపు నొప్పి సమస్యలు వస్తాయి. అందుకే మామిడి పండ్లను ఎలా తినాలో తెలుసుకోవడం ఎంతో ముఖ్యం.

మామిడి పండ్లలో విటమిన్ ఎ, విటమిన్ బి 6, విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, కొవ్వు, పొటాషియం కూడా ఇందులో లభిస్తాయి. మామిడిలో సంతృప్త కొవ్వు, సోడియం పరిమాణం కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది సూపర్ ఫ్రూట్.

మామిడి పండ్లను తినడం గురించి ప్రజలకు ఎన్నో అనుమానాలు కలుగుతుంటాయి.  అయితే మామిడి పండ్లను తినడానికి ఉత్తమ సమయం ఉదయం పరిగడుపున లేదా అల్పాహారం సమయంలో తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో మామిడి పండ్లను తినడం వల్ల శరీరంలోని శక్తి ఎక్కువ సేపు ఉంటుంది. ఎందుకంటే మామిడి మన శరీరానికి కావాల్సిన  ఆల్కలీన్ ను అందిస్తుంది. దీంతో మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. 

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మామిడి పండ్లను తిన్న వెంటనే నీళ్లను తాగకూడదు. ఒక వేళ తాగితే.. కడుపునొప్పి వస్తుంది. ఒక వేళ తాగాలనుకుంటే మామిడి పండ్లు తిన్న తరువాత కనీసం 1 గంట వరకు నీళ్లను తాగకూడదు. 
 

Mangoes

మామిడి పండ్లను, పెరుగును కలిపి తినకూడదు.. మామిడి పండ్లలో వేడిచేసే గుణముంటుంది. పెరుగు చల్లగా ఉండటం వల్ల పెరుగును మామిడి పండ్లతో కలిపి ఎప్పుడూ తీసుకోకూడదు. ఈ రెండింటినీ కలిపి తినడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది.  దీని వల్ల శరీరంలో విషతుల్యాలు పెరుగుతాయి.
 

అలాగే మామిడితో కాకరకాయ (Karela)తో అస్సలు తినకూడదు.  ఈ కాంబినేషన్ లో తింటే వికారం, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే కాకరకాయలను తిన్న తర్వాత మామిడి పండ్లను అస్సలు తినకూడదు.

మామిడి ఆకులు లేదా దాని రసాన్ని తీసుకోవడం కంటే మామిడి పండ్లను తినడం మంచిది. ఎందుకంటే ఇది మీ రక్తపోటు స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. అలాగే శరీరాన్ని చల్లబరచడంతో పాటు వేడిని తగ్గిస్తుంది. 

ఒకవేళ మీకు మధుమేహం ఉన్నట్టైతే మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదు, ఎందుకంటే దీనిలో సహజ చక్కెర చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీనిని ఎక్కువగా తీసుకోవడం ద్వారా శరీరంలో గ్లూకోజ్ పరిమాణం పెరుగుతుంది. 

చాలా మంది బరువు తగ్గాలనుకునే వారు మామిడి పండ్లకు దూరంగా ఉంటారు. వీటిని తింటే ఎక్కడ బరువు పెరిగిపోతామేమోనని. ఇది పూర్తిగా అవాస్తవం అంటున్నారు నిపుణులు. ఎందుకంటే పలు పరిశోధనల్లో బరువు తగ్గడానికి సహాయపడే ఫైటోకెమికల్స్ కొవ్వు కణాలు మామిడి పండులో ఉన్నాయట. కానీ వీటిని మోతాదులోనే తీసుకోవాలి. 

వీటితో పాటుగా మామిడి పండ్లను తినడం వల్ల బ్లడ్ క్యాన్సర్, కడుపు క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, చర్మ సంబంధిత సమస్యలు, కంటి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని కూడా పలు నివేదికలు వెల్లడించాయి. మామిడి పండ్లలో విటమిన్ ఎ ఉంటుంది, ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. 

click me!