Weight Loss Mistakes: బరువు తగ్గే ప్రాసెస్ లో ఈ తప్పులు చేస్తే మీ ఆరోగ్యం దెబ్బతినడం పక్కా..

Published : May 08, 2022, 12:42 PM IST

Weight Loss Mistakes: అధిక బరువు నుంచి బయటపడాలని చాలా మంది ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ వెయిట్ లాస్ ప్రాసెస్ లో కొన్ని మిస్టేక్స్ మీ ఆరోగ్యాన్నిదెబ్బతీసే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.   

PREV
16
Weight Loss Mistakes: బరువు తగ్గే ప్రాసెస్ లో ఈ తప్పులు చేస్తే మీ ఆరోగ్యం దెబ్బతినడం పక్కా..

Weight Loss Mistakes: ప్రస్తుత కాలంలో ఓవర్ వెయిట్ తో  బాధపడే వారి సంఖ్య రోజు రోజుకు విపరీతంగా పెరిగిపోతోంది. అధిక బరువుతో గుండె సంబంధిత సమస్యలు, కీళ్ల నొప్పులు, వాపు, స్థూలకాయం వంటి  ఎన్నో ప్రమాదకరమైన సమస్యల బారిన పడే అవకాశం ఉంది. అందుకే దీని నుంచి బయటపడాలని జిమ్ లో చెమటలు చిందిస్తుంటారు. కానీ ఈ ప్రాసెస్ లో మీరు చేసే కొన్ని తప్పులు మిమ్మల్ని అనారోగ్యం బారిన పడేస్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి బరువు తగ్గే ప్రాసెస్ లో ఎలాంటి పనులు చేయకూడదో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.. 
 

26

ఎక్కువ సేపు ఆకలితో అలమటించడం.. అధిక బరువు ఉన్నవారు దీన్ని బాగా నమ్ముతారు. ఎక్కువ సేపు తినకుండా ఉంటే ఈజీగా బరువు తగ్గుతారని అనుకుంటారు. కానీ ఇలా చేయడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే  ఎక్కువ సేపు ఆకలితో ఉంటే జీవక్రియ రేటు తగ్గుతుంది. ఇది మమ్మిల్ని బరువు తగ్గించడం కాదు కదా.. మిమ్మల్ని మరింత బలహీనంగా చేస్తుంది. ఫుడ్ తినడానికి గ్యాప్ ఉండటం అవసరమే కానీ ఈ గ్యాప్ మరీ ఎక్కువగా ఉండకూడదు. 

36
breakfast_skip

బ్రేక్ ఫాస్ట్ మానేయకూడదు.. డైటింగ్ చేస్తున్నవారు చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడమే మానేస్తుంటారు. ఇది అస్సలు మంచి పద్దతి కాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బ్రేక్ ఫాస్ట్ చేస్తేనే మీరు బరువు తగ్గడంతో పాటుగా ఆరోగ్యంగా కూడా ఉంటారు. ముఖ్యంగా అల్పాహారం వల్ల మీరు ఆ రోజంతా మీరు ఎనర్జిటిక్ గా ఉంటారు. 

46

ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోరు.. బరువు తగ్గాలనుకునే వారు ప్రోటీన్ ఫుడ్ ను తీసుకోవడమే మానుకుంటారు. ఇలా అస్సలు చేయకూడదు. ఎందుకంటే ఈ ప్రోటీన్స్  యే మీ కండరాల  అభివృద్ధికి సహాయపడతాయి. అంతేకాదు మన శరీరానికి కావాల్సిన శక్తి కూడా ప్రోటీన్ ఫుడ్ ద్వారానే లభిస్తుంది. ఇందుకోసం కాయధాన్యాలు, సోయాబీన్స్, గుడ్లు వంటి వాటిని తినండి. వీటిలో ప్రోటీన్లు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. 

56

ప్రిజర్వేటివ్స్ అస్సలు తినకూడదు.. మార్కెట్ లో లభించే అనేక ప్రిజర్వేటివ్ ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివని చెబుతుంటారు. కానీ వీటిలో అధిక మొత్తంలో ప్రిజర్వేటివ్ లు, షుగర్ ఉంటుంది. ఇవి మీకు అస్సలు మంచిది కావు. వీటికి బదులుగా తాజా పండ్లు, కూరగాయలను తినడం మంచిది. ఎందుకంటే ప్రిజర్వేటిక్స్ ఫుడ్ మీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. 

66

నడవక పోవడం.. తిన్న వెంటనే పడుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది. కానీ రాత్రి భోజనం తర్వాత కాసేపు నడిస్తే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 15 నిమిషాల పాటు నడిస్తే మీ ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది మీరు బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. 

click me!

Recommended Stories